భూ కేంద్రక సిద్ధాంతం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆకాశంలో చలించే సౌర కుటుంబంలోని భూమి, చంద్రుడు మొదలయిన రాశులన...
(తేడా లేదు)

16:28, 13 జనవరి 2013 నాటి కూర్పు

ఆకాశంలో చలించే సౌర కుటుంబంలోని భూమి, చంద్రుడు మొదలయిన రాశులన్నీ చాలా కాలంగా ఎంతో కుతూహలాన్ని రేకెత్తిస్తుండేవి. ఈ గ్రహాల చలనాలను ఒక పద్ధతి ప్రకారం పరిశీలించిన వారు గ్రీకు దేశస్థులు. గ్రీకుల ఖగోళ పరిశీనలన్నింటినీ తెలియజేసిన శాస్త్రవేత్త టాలెమీ (క్రీస్తుశకం రెండవ శతాబ్దం వాడు). అతని సిద్ధాంతాన్ని టాలమిక్ సిద్ధాంతం లేదా భూకేంద్రక సిద్ధాంతమంటారు. దాని ప్రకారం విశ్వానికంతటికీ భూమి కేంద్రంగా ఉందనీ సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాలన్నీ భూమి చుట్టూ తిరుగుతుంటాయనీ తెలుస్తుంది. ఈ సిద్ధాంతం సుమారుగా 1400 సంవత్సరములు అందరి ఆమోదం పొందింది. పదహారవ శతాబ్దంలో కోపర్నికస్ అనే పోలెండు దేశపు సన్యాసి సూర్యకేంద్రక సిద్ధాంతంను ప్రతిపాదించాడు.