వేంగి: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం
పంక్తి 6:
 
== "వేంగి" పేరు ==
"వేంగి" అనే పేరు పురాతనమైనదిగా కనిపించడం లేదు. కంచి వద్ద 'వెంగో' లేక 'వేంగి' అనే పేరు ఉన్నదని, ఆంధ్ర దేశం మధ్యలో ఈ పేరు గల నగరం ఏర్పడడానికి కారణాన్ని ఆంధ్ర దేశపు చరిత్ర అధ్యయనం చేసినవారిలో ఆద్యుడయిన [[చిలుకూరి వీరభద్రరావు]] ఈ విధంగా ఊహించాడు.("ఆంధ్రుల చరిత్రము - ప్రధమ భాగము") <ref>[http://www.archive.org/details/andhrulacharitra025965mbp [[ఆంధ్రుల చరిత్రము]] - చిలుకూరి వీరభద్రరావు] ప్రచురణ: విజ్ఞాన చంద్రికా గ్రంధమండలి - 1910లో చెన్నపురి ఆనంద ముద్రణాశాల యందు ముద్రింపబడియెను. వెల ౧-౪-౦. రాజపోషకులు: బొబ్బిలి రాజా, పిఠాపురం రాజా, మునగాల రాజా </ref> -
:ఈ దేశము పూర్వము నాగులచే పరిపాలింపబడెడిది. దక్షిణ దేశమందలి నాగులలో "అఱవలార్" ఒక తెగ. కాంచీ పురమునకు దక్షిణదేశమున ఉండే వారు గనుక ఆ ప్రదేశం "ఆఱవనాడు" అనబడింది. కనుకనే టాలెమీ వంటి విదేశీ చరిత్రకారులు మైసోలియా (కృష్ణానది) దక్షిణ ప్రాంతాన్ని "ఆశార్‌నోరి" (అర్ వార్ నాయ్) అని పేర్కొన్నారు. మొట్టమొదట కృష్ణా గోదావరి మధ్య దేశం "కూడూహార విషయం" అనబడేది. దానికి రాజధాని "కూడూరా" (గూడూరు లేక గుడివాడ?). ఏ కారణము చేతనో రాజధాని మార్చుకొనవలసి వచ్చినది. సాలంకాయన గోత్రుడైన పల్లవరాజులలో నొకరు ఒక నూతన నగరమును నిర్మింపజేసి దానికి "బెబ్బులి" అనే అర్ధం వచ్చే "వేంగి" అనే పేరు పెట్టాడు. అక్కడినుండి పాలించే రాజులు వేంగిరాజులని, వారిచే జయింపబడిన దేశాన్ని వేంగి దేశమని అనడం మొదలుపెట్టారు. ... క్రీ.శ. ౪ శతాబ్దంలో అలహాబాదు శాసనంలో వేంగిని ప్రస్తావించారు గనుక అంతకు పూర్వమే అనగా క్రీ.శ. ౨వ లేదా ౩వ శతాబ్దంలో వేంగి నగరం ఏర్పడి ఉండవచ్చును.
 
"https://te.wikipedia.org/wiki/వేంగి" నుండి వెలికితీశారు