శైవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
వీరశైవ మత పురాణమైన [[బసవ పురాణం]]లో బసవేశ్వరుని చరిత్ర ప్రధానమైనది. ఒక మత ప్రవక్త జీవితాన్ని పురాణంగా నిర్మించిన మొదటి దేశీయ పురాణం ఇది. వీరశైవంలోని ముగ్ధ భక్తిని, వీర భక్తిని, జ్ఞాన భక్తిని ముప్పేటగా వర్ణించే రచన ఇది. ఇందులో బసవేశ్వరుని జీవితంతో పాటు అతని సమకాలీనులైన భక్తుల కథలను, ప్రాచీన శివ భక్తుల కథలను కలిపి వర్ణించాడు. అందువలన బసవ పురాణం శివభక్తి కథా సాగరంగా రూపొందింది.
==నాయనార్లు==
==[[నయనార్లు]]==
{{main|నాయనార్లు}}
 
శైవ శాఖలో వీరు చెప్పుకోదగ్గవారు. వైష్ణవశాఖలో ముఖ్యమైన 12 మంది ఆళ్వార్ల తో కలిపి వీరిని దక్షిణ భారతం దేశంలో పరమ భక్తాగ్రేసరులుగా వ్యవహరిస్తారు వీరుమొత్తం 63(అరవై ముగ్గురు) మంది. తమ కవిత్వంతో శివుణ్ణి కీర్తించిన అపర భక్తాగ్రేసరులు. వీరి చరిత్ర తమిళంలోని 'పేరియ పురాణం'లో చక్కగా వివరించబడింది. దీనిని రచించినది సెక్కిళార్. ఈ నయనార్ల లో భక్త కన్నప్ప, కరైక్కాల్ అమ్మన్ మొదలగు వారు పెక్కు ప్రసిద్ధులు.
[[ లింగాయత్ లు]] భారత దేశంలో శైవం ఎన్నో శాఖలుగా విడిపోయింది. లింగాయత్ శైవం కర్ణాటకలోని ప్రసిద్ధ శైవ శాఖ. ఈ పద్ధతిని బసవేశ్వరుడు ప్రారంభించాడు. ఈ శైవాన్ని పాటించేవారు తమ కంఠంలో చిన్న శివ లింగాన్ని ధరిస్తారు.ఆ శివ లింగానికి రోజూ నీటితో అభిషేకం నిర్వహించి మరల ఆ లింగాన్ని తమ కంఠంలో ధరిస్తారు.
 
==శివారాధన==
{{main|శివాలయం}}
"https://te.wikipedia.org/wiki/శైవం" నుండి వెలికితీశారు