విలియం హార్వే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
[[విలియం హార్వే]] ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యశాస్త్రవేత్త. గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని చాలా క్రితమే వివరింని నేటి వైద్యులకు మార్గదర్శకుడయ్యాడు.ఈనాడు హృదయం గురించి అందరికీ తెలుసు. రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తం ఎలా నడుస్తుండో చెప్పగలుగుతున్నారు. అదే 16 వ శతాబ్దం నాడయితే "గుండె గురించి తెలుసుకునేందుకు దేవుని ఒక్కనికే సామర్థం ఉంది" అని విశ్వసించే వారు. అలాంటి నమ్మకాలు ఉన్న వ్యవస్థ లోంచి ఉదయించి మనిషి గుండెకు సంబంధించిన పూర్తి వివరాలను మిగతా జంతువుల గుండెలతో పోల్చి చూసి శాస్త్ర బద్ధంగా అందజేసిన ఘనత విల్లియం హార్వేకు దక్కుతుంది.
 
==బాల్యం,విద్యాభ్యాసం==
 
విలియం హార్వే ఇంగ్లండులోని ఫోక్‌స్టోన్‌లో 1578 ఏప్రిల్‌ 1న సంపన్నుడైన పట్టణ మేయరుకు పదిమంది సంతానంలో ఒకడిగా పుట్టాడు. పదిహేనవ యేట కేంబ్రిడ్జిలోని సైన్స్‌ కాలేజీలో చేరాడు. అచట పట్టభద్రుడయ్యాడు. ఆపై వైద్య విద్య కోసం ఇటలీలోని పాడువా వైద్య విద్యాలయంలో చేరాడు.అచట హరోనిమస్ ఫాబ్రీసియస్ అనే ప్రముఖ వైద్య శాస్త్రజ్ఞుని వద్ద శిష్యరికం పుచ్చుకున్నాడు.1602 లో వైద్య శాస్త్రంలో పట్టా పుచ్చుకొనటమే కాకుండా ప్రత్యేకమైన యోగ్యతా పత్రాన్ని పొందగలిగాడు. అక్కడి నుంచి లండన్‌ తిరిగి వచ్చాక ఇంగ్లండ్‌ రాజు మొదటి ఛార్లెస్‌ కొలువులో ఆస్థాన వైద్యుడిగా నియమితుడయ్యాడు. అంతటి హోదాలో ఉన్న సంపన్నుడెవరైనా విలాసంగా జీవితం గడిపేస్తారేమో కానీ, విలియం హార్వే మాత్రం కొత్త విషయాలు తెలుసుకోడానికి పరిశోధకుడిగా మారాడు.గుండెను సంబంధించిన సందేహాలు మాత్రం ఆయనకు వదలలేదు. గుండె నుండి బయలుదేరిన రక్తం రక్త నాళాలలో అటూ ఇటూ ప్రవహించి చివరికి హరించుకు పోతుందే తప్ప మళ్లీ గుండెను చేరదు అనే వాదంలో నిజం ఉన్నట్లు హార్వేకు తోచలేదు. పెద్ద పెద్ద సిరలలో కవాటాలు ఎందుకు ఉంటాయనే తపన కూడా ఈయనలో బయలుదేరింది.
==పరిశోధనలు==
1615 లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీసియన్స్ లో ఈయన లెక్చరర్ గా నియమింప బడ్డారు. చేపలు, కప్పలు,కోళ్ళ పిండాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ వాటి రక్య ప్రసరణ గురించి ఎంతో క్షున్నంగా అధ్యయనం చేయసాగాడు. గుండె ముడుచు కోవటం వల్ల రక్తం ధమనుల ద్వారా రక్త నాళాలకు వెళుతుందని తెలుసుకున్నాడు. నాడి కొట్టుకోవడం అంటే గుండె కొట్తుకోవడమే అని రుజువు చేశాడు. గుండెలో నాలుగు గదులు ఉంటాయని, ధమనుల ద్వారా గుండె లోని రక్తం బయటికిఒ పంప్ చేయబడుతుందని, సిరల ద్వారా కవాటాలు రక్తాన్ని గుండె వైపుకి వెళ్ళనిస్తాయే కాని గుండె లోంచి రక్తాన్ని వెలుపలికి రానివ్వవని తెలుసుకున్నాడు. ఒక అర గంటలో శరీరంలో ఉన్న మొత్తం రక్తం గుండె నుండి వెలువడే రక్తమే ఎక్కువగా ఉంటుందని నాడీ వేగం, గుండె స్పందించే రేటు ఆధారంగా నిర్ధారించుకో గలిగాడు.
 
మానవ శరీరంపై ఆసక్తి పెంచుకున్న హార్వే అనేక జంతువుల శరీర అంతర్భాగాలను క్షుణ్ణంగా పరిశీలించి గుండె పనితీరు, రక్త ప్రసరణ విధానాలను గమనించాడు. చనిపోయిన ఖైదీల శరీరాలను అడుగడుగునా పరిశీలించడం ద్వారా గుండె ఒక పంపులాగా పనిచేస్తుందని, శరీరంలో సిరలు, ధమనుల ద్వారా రక్తం వలయాకారంలో ప్రవహిస్తుందని తెలుసుకున్నాడు. రక్తం ప్రవహించే మార్గంలో వాల్వులు ఎలా పనిచేస్తాయో కనిపెట్టాడు. మనిషి గుండె నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందో, ఎంత రక్తాన్ని పంప్‌ చేస్తుందో చెప్పగలిగాడు. తన పరిశీలనలతో రెండు అమూల్యమైన గ్రంథాలను వెలువరించాడు.
"https://te.wikipedia.org/wiki/విలియం_హార్వే" నుండి వెలికితీశారు