వంకాయ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: wuu:落苏
పంక్తి 116:
== వంటకములు ==
 
వంకాయ వంతివంటి కూర, పంకజంపంకజముఖి అయిన సీత వంటి భార్య, భారతం వంటి కధ ఉండవని ఒక నానుడి. అల్లాగే వంకాయ తో వెయ్యి రకాలు అని కూడా ఒక నానుడి. వంకాయలను చప్పిడి కూరగకానీ, [[పులుసు]]పెట్టి కానీ వండి తినవచ్చును. ముదురుకాయలును, గిజరుకాయలను కారము పులుసుపెట్టి వండిననేగాని తిన బాగుండవు. ఇటువంటి కాయలను ముందు ఉడుకబెట్టి వార్చి వేసినచో అందలి గిజరు మరికొంత తగ్గును. లేత కాయలను ముందు ఉడకబెట్టకుండ పోపులోనూనెవేసి మ్రగ్గనీయవచ్చును. లేక చమురులో వేచి పైన [[మసాలాపొడి]] చల్లవచ్చును. నిడివిగనుండు నీటివంకాయలను ముచికవద్ద కొంతభాగము విడిచి క్రింది భాగమును నాలుగు లేక ఆరు చీలికలుగ దరిగి యందు మసాలా పొదిని కూరి మువ్వలేక గుత్తివంకాయగ కూడ వండి తినవచ్చును. గుండ్రని మెట్ట వంకాయను కాల్చి అల్లమును చెఏర్చి యిగురు పచ్చడిగగానీ, పులుసు పచ్చడిగ గానీ పెరుగుపచ్చడిగగానీ చేయవచ్చును. వంకాయ ముక్కలను సామాన్యపు పులుసులోనూ, [[మజ్జిగ పులుసు]]లోనూ కూడ తరచు వేయుచుందురు. వంకాయ ముక్కలను [[వాంగీభాత్‌]] మొదలను [[చిత్రాన్నము]]లలో కూడా ఉపయోగింతురు. [[బంగాళాదుంప]] మొదలగు ఇతర కూరలతో కలిపి వండుటయు కలదు. వంకాయ ముక్కలను పలుచని బిళ్ళలుగ తరిగి సెనగవగైరా పిండితో చేసిన చోవిలో ముంచి చమురులో వేచి [[బజ్జీలు]]గ చేయవచ్చు.
 
 
"https://te.wikipedia.org/wiki/వంకాయ" నుండి వెలికితీశారు