మధ్వాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
యుక్తవయస్సులో ఉండగానే మధ్వాచార్యుడు [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారతదేశమంతా]] పర్యటించాలని సంకల్పించాడు. అనంతశయన, [[కన్యాకుమారి]], [[రామేశ్వరం]], [[శ్రీరంగం]] మొదలైన క్షేత్రాలను సందర్శించాడు. ఎక్కడికి వెళ్ళినా తాను తెలుసుకున్న తత్వాన్ని ప్రజలకు ఉపన్యాసాల రూపంలో తెలియజెప్పేవాడు. మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు. వాటిని ఆధ్యాత్మికతతో ముడిపెట్టకూడదని భావించాడు. అలా ఆయన ప్రబోధించిన తత్వం దేశవ్యాప్తంగా పండితుల్లో చర్చలు రేకెత్తించగా సనాతన వాదుల నుంచి వ్యతిరేకత కూడా ఎదురైంది. కానీ ఆయన వేటికీ చలించలేదు. యాత్ర పుర్తి చేసుకుని ఉడుపి చేరుకోగానే [[భగవద్గీత]] పై తన భాష్యాన్ని రాయడం ప్రారంభించాడు.
==రచనలు==
తన [[ద్వైతం | ద్వైత]] సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు [[ఉపనిషత్తు]]లకు, [[బ్రహ్మసూత్రాలు | బ్రహ్మసూత్రాల]]కు, [[భగవద్గీత]]కు భాష్యాలు వ్రాసాడు. ఇంకా [[ఋగ్వేదం]]లోని 40 సూక్తాలకు మరియు [[భారతం | భారత]] [[భాగవతం | భాగవతాల]]కు వ్యాఖ్యానం వ్రాసాడు. తర్కంతోపాటు మొత్తం 37 గ్రంథాలను రచించాడు. ఇందులో ప్రముఖమైనవి ప్రముఖమైనవి
#గీతాభాష్యం
#గీతాభాషష్యం
#గీతాతాత్పర్యం
#బ్రహ్మసూత్రభాష్యం
#అణువ్యాఖ్యానం
#న్యాయవివరణం
#అణుభాష్యం
#దేశోపనిషద్భాష్యం
#మహాభారతతాత్పర్యనిర్ణయం
#యమకభారతం
#దశప్రకరణం
#తంత్రసారం
#ద్వాదశస్తోత్రం
#కృష్ణార్ణవామృతం
#సదాచారస్మృతి
# జయంతినిర్ణయం
#ప్రణవకల్పం
#న్యాసపద్ధతి
#తిథినిర్ణయం
#కందుకస్తుతి
 
==ద్వైత వాదం==
జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.
"https://te.wikipedia.org/wiki/మధ్వాచార్యుడు" నుండి వెలికితీశారు