మధ్వాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.
 
భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞానపురస్కృతమైన భక్తి అయి ఉండాలి. ముక్తి నాలుగు విధాలు. ఒకటి :
#సాలోక్యం - జీవాత్మ భగవంతుని లోకంలో భగవంతునితోపాటు నివసించడం, రెండు
#సామీప్యం - భగవంతుడిభగవంతుని సన్నిధానంలో నివసిస్తూ కామితార్థాలను అనుభవించడం, మూడు
#సారూప్యం - భగవంతుని రూపం పొంది ఇష్టభోగాలు అనుభవిస్తూ ఆనందించడం, నాలుగు
#సాయుజ్యం - భక్తుడు భగవంతునిలో లీనమైనా ఆయన కంటే వేరుగా ఉంటూనే ఆయన ఆనందంలో పాలుపంచుకోవటం.
 
==ద్వైతమత ప్రభావం==
మధ్వాచార్యుడు ఆసేతుశీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి తన మధ్వమతాన్ని ప్రచారం చేసినా [[శంకరాచార్యుడు | శంకరుని]] [[అద్వైతం]], [[రామానుజాచార్యుడు| రామానుజుని]] [[విశిష్టాద్వైతం]] అంతగా ద్వైతం ప్రచారంలోకి రాలేదనే చెప్పాలి. అయితే దేశంలో వైష్ణవమత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు.
"https://te.wikipedia.org/wiki/మధ్వాచార్యుడు" నుండి వెలికితీశారు