"బోయ" కూర్పుల మధ్య తేడాలు

97 bytes removed ,  8 సంవత్సరాల క్రితం
 
==బోయ, కిరాత తేడాలు==
కిరాతులు అనే తెగ నేపాల్ మరియి అస్సాంలో నివసించే అటవీ తెగ. వేట వారి ప్రధాన వృత్తి. నాగవంశ క్షత్రియులైన కిరాతుల్లో సుమారు 29 రాజులు పరిపాలించారు. మహా భారతం మరియు మనుధర్మశాస్త్రం ప్రకారం బ్రాహ్మనులను వ్యతిరేకించిన కిరాతులు ఉపనయనాది ఆచారవ్యవహారాలను పాటించకపోవడముతో క్షత్రియహోదాను కోల్పోయారు అంటాడు మనువు తన మనుధర్మశాస్త్రములో. ఒక్క రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి మాత్రం గొప్పవాడైయ్యాడు. కిరాతులవలె అడవి జంతువుల వేట జీవనోపాధిగా కలిగివున్న తెగలు చాలా తెగలున్నాయి. ఉదాహరణకు బోయలు, చెంచులు, కోయలు, కొండారెడ్డిలు వంటివారు. కిరాతుల సంస్కృతికి బోయ సంస్కృతికి చాలా వైవిధ్యాలున్నాయి. కిరాతులు 'సకేల' అనే పండుగను సంవత్సరానికి రెండు సార్లు ఉభయులి మరియు ఉధయులి అనే పేర్లతో జరుపుకుంటారు. కిరాతుల మతం కిరాతి మతం. వారికి మత గ్రంధం కూడా ఉన్నది. కాని బోయవారికి అటువంటిది లేదు. కిరాతులతో పోలిస్తే బోయవారి కట్టుబాట్లు మరియ వివాహ సంస్కృత విభిన్నంగా ఉంటుంది. కిరాతులు మంగోలీ జాతుల విభాగానికి చెందినవారైతే, బోయలు ద్రావిడ తెగల విభాగానికి చెందినవారు. దీన్ని బట్టి బోయవారు కిరాతులు కాదని, అయితే కిరాతుల వంటి వేటగాళ్ళని తెలుస్తున్నది. సంస్కృత మహాబారతంలో పేర్కొనబడ్డ కిరాతులను తెలుగు కవులు ఆంధ్రులకు బోయవారిగా పరిచయం చేశారు. ఉదాహరణకు ఉత్తర భారత దేశంలో నిషాఢ తెగకు చెందిన [[ఏకలవ్యుడు]], కిరాత తెగకు చెందిన [[వాల్మీకి]] మహర్షి తెలుగులో అనువదింపబడిన మహాభారతంలో తెలుగువారికి బోయ తెగవారిగా పరిచయమయ్యారు. నేడు బోయ కులం బి.సి కులంగా గుర్తింపు పొందినది.
 
==ఇవీ చూడండి==
1,373

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/794130" నుండి వెలికితీశారు