పంచె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
సాధారణంగా తెలుపు దానికి సంబంధించిన రంగులో (క్రీం కలర్) ఉన్నా, మతసంబంధిత కార్యక్రమాలు లేదా ప్రత్యేక సందర్భాలలో వేరే రంగులు వాడతారు. ఉపనయనాలకి పసుపు/తెలుపు లలో లభ్యమయ్యే (తమిళనాడులో మగతం అనే) పట్టు పంచెలు ధరిస్తారు. సింధూర వర్ణంలో ఉండే సౌలే అనబడు పంచెలు మహారాష్ట్రలో గుళ్ళలోని అర్చకులు వాడతారు. రాజుల, కవుల పట్టు పంచెలు ముదురు రంగులతో ఉండగా బంగారు దారాలతో వాటికి ఎంబ్రాయిడరీలు ఉండేవి. రోజువారీ వినియోగానికి నూలు పంచెలు ఉత్తమం. పట్టు పంచెలు ఖరీదు ఎక్కువ. వీటిని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే వాడతారు.
 
ఉదర భాగం/పొత్తి కడుపు నుండి రెండు కాళ్ళ మధ్య నుండి వెనక్కి వెళ్ళేలా ధోవతిని కడతారు. కొన్ని ప్రాంతాల (ఎక్కువగా [[రాయలసీమ]])లో ధోవతిని పంచెకట్టుతో ధరిస్తారు. గ్లాక్సో (Glaxo) పంచెలు పేరెన్నిక గన్నవి. అయితే వీటి వికృతి గ్లాస్కో పేరే వాటికి స్ధిరపడినది. జారకుండా ఉండటానికి [[మొలత్రాడు]]ని వాడతారు. పంచ, పై పంచ లు సాధారణంగా తెలుపు రంగు లో గానీ, క్రీం కలర్ లో గానీ ఉంటాయి. వీటికి అంచుల్లో రంగులతో నగిషీలు అద్దబడి ఉంటాయి. సాధారణంగా ఈ నగిషీ ఒకే రంగుతో అద్దబడి ఉంటుంది. అంచుల్లో ఉండే ఈ నగిషీ లని కేవలం [[అంచు]] అని గానీ లేదా బార్డర్ (border) అని గానీ వ్యవహరిస్తూ ఉంటారు. బార్డరులు స్త్రీలు ధరించే చీరలు/పై లంగాలు/జాకెట్లు/రవిక లకి కూడా ఉంటాయి. అయితే స్త్రీల దుస్తులపై వాడే బార్డరులు (ఉదా: మామిడి పిందెలు), పురుషుల దుస్తులపై వాడే బార్డరులు (ఉదా: సర్పిలమును పోలినవి) వేర్వేరుగా ఉంటాయి.
 
'''పంచెకట్టు:''' చీరకు వేసే కుచ్చిళ్ళ అంత ఒద్దికగా పెద్దగా కాకుండా, దాదాపు అదేవిధంగా, చిన్నగా నడుముకు ఒక వైపు మాత్రమే గానీ, ఇరువైపుల గానీ, రెండువైపులు బయటకు గానీ లోపలకుగానీ దోపుతారు. (ఒకటి బయటికి, ఇంకొకటి లోపలికి దోపరు.)
 
'''ధోవతి కట్టు:''' పై విధంగా కట్టిన పంచె కి క్రిందికి వ్రేలాడే అంచును కాళ్ళ మధ్య నుండి వెనుకకు తీసుకుపోయి, నడుము వద్ద లోపలికి (మాత్రమే) దోపుతారు. వెనుకకు దోపటం తప్పని సరి కాదు. నడిచే సమయంలో పెద్ద పెద్ద అడుగులు వేసేందుకు వీలుగా దీనిని చేత పట్టుకొనవచ్చును.
 
===దక్షిణ భారతంలో పంచె వినియోగం===
"https://te.wikipedia.org/wiki/పంచె" నుండి వెలికితీశారు