హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 181:
 
2011 నాటికి ప్రధాన చైనా భూమి నుండి తల్లులు హాంగ్ కాంగ్‍లో నివసించడానికి ప్రభుత్వ అనుమతి పొందడంతో నగరంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్ వార్డులు గదులు అన్నీ నిండి పోతున్న కారణంగా నగరంలోని గర్భవతులకు ప్రసవకాలంలో ఆసుపత్రులలో అవసరమైన పడకలు మరియు రొటీన్ చెకప్పులు వంటి వైద్యపరమైన వసతులు లభించ లేదని ప్రజలు తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. 2001-2010 మద్యకాలంలో వైద్యసిబ్బందికి పెరిగిన పనిభారం, వైద్యపరమైన పొరపాట్లు మరియు వైద్యపరమైన ఆపదలు ప్రధాన రిపబ్లిక్ చైనా వార్తా పత్రికలలో ప్రధాన వార్తలుగా వెలువడుతుంటాయి.
== నిర్మాణశైలి ==
గణాంకాలను అనుసరించి హాంగ్ కాంగ్‍లో షుమారు 1,223 ఆకాశసౌధాలు ఉన్నాయి. అవి హాంగ్ కాంగ్‍ను అంతర్జాతీయ శ్రేణికి చేర్చాయి. మిగిలిన లేనన్ని 500 అడుగులకంటే అధిక ఎత్తైన భవనాలు హాంగ్ కాంగ్‍లో ఉన్నాయి. ఎత్తైన ఆకాశసౌధాలు మరియు అధిక సంఖ్యలో ఉన్న భవన సముదాయం ఉన్న హంగ్ కాంగ్ నగరప్రాంతం హార్బర్ సమీపంలో విశాలమైన నివాసగృహాల కొరత అధికంగా ఉంది. నిటారుగా ఉండే కొండలు కలిగిన హాంగ్ కాంగ్ దీవి వైశాల్యం 1.3 చదరపు కిలోమీటర్ మాత్రమే ఉంది. నివాస అనుకూల ప్రాంతం కొరత కారణంగా నగరంలో జనసాంద్రత అధికంగా ఉంది. ఈ కారణంగా ఎత్తైన కార్యాలయ భవనాలు మరియు నివాస గృహసముదాయాలు కూడా ఆకాశసౌధాలుగా నిర్మించవలసిన అవసరం ఏర్పడింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన నివాస గృహాలు కలిగిన 100 ఆకాశభవనాలలో 36 హాంగ్ కాంగ్‍లో ఉన్నాయి. హాంగ్ కాంగ్ లోని అధికమైన ప్రజలు 14 అంతస్థుల కంటే ఎత్తులోనే నివసించడం మరియు పనిచేయడం వటివి చేస్తున్నారు. ఈ కారణంగా హాంగ్ కాంగ్ అత్యంత ఎత్తైన నగరంగా గుర్తింపు పొందింది.
 
భూమి కొరత నిర్మాణాల ఆవశ్యకత కారణంగా హాంగ్ కాంగ్‍లో పురాత భవనాల సంఖ్య చాలా కొద్దిగా మాత్రమే ఉన్నాయి. అంతే కాక హాంగ్ కాంగ్‍లో అత్యంతాధునిక నిర్మాణాలు అధికంగా ఉన్నాయి. " ది ఇంటర్నేషనల్ కామర్స్ సెంటర్ " 1,588 అడుగుల ఎత్తు ఉన్నది. ఈ భవనం ఎత్తు మరియు పైకప్పు పరిమాణంలో హాంగ్ కాంగ్‍లో అత్యంత ఎత్తైనది, అలాగే ప్రపంచంలో ఈ భవనం మూడవ స్థానంలోంఉంది. ఇంతకు ముందు ఎత్తైన భవనమైన 1,362 అడుగుల ఎత్తైన ఐసిసి భవనంలో రెండు ఫైనాంషియల్ సెంటర్లు ఉన్నాయి. గుర్తించతగిన ఇతర భవనాలు హెచ్ ఎస్ బి సి హెడ్క్వార్టర్స్ బిల్డింస్, పిరమిడ్ ఆకాపరపు శిఖరం ఉన్న " ది ట్రైయాంగులర్-టాప్డ్ సెంట్రల్ ప్లాజా కూడా ఒకటి. ఈ సెంటర్‍లో రాత్రిసమయ అనేక రంగుల నియోన్ లైట్ షోజ్, సింఫోనీ లైట్లు, పదునైన త్రిభుజాకార ముఖాకృతికలిగిన ఐ.ఎం.పి బాంక్ ఆఫ్ చైనా టవర్ ఉన్నాయి. ఎంపోరిస్ వెబ్‍సైట్ హాంగ్ కాంగ్ ఆకాశసౌధాల సమూహ దృశ్యం ఇతర ప్రపంచ నగరాలకు ధీటైన ప్రభావవంతమైనదని అభిప్రాయపడింది. తరచుగా హాంగ్ కాంగ్ నగర ఆకాశసౌధ సమూహం ప్రపంచంలో అత్యుత్తమమైనదిగా భావించబడుతుంది. కొడల నడుమ వికోటిరియా రేవు ఆకాశసౌధాల సౌందర్యం కలసి హాంగ్ కాంగ్ అందం ఇనుమడింపజేస్తున్నాయి. 19 మరియు 20 వ శతాబ్ధ ఆరంభంలో నిర్మించబడిన " త్సిం షా ట్సుఇ క్లాక్ టవర్", సెంట్రల్ పోలీస్ స్టేషన్, మరియు కౌలూన్ అవశేషాలు హాంగ్ కాంగ్ చాత్రిత్రకతను చాటే భవనాలుగా గుర్తింపు కలిగి ఉన్నాయి.
 
హాంగ్ కాంగ్‍లో అనేక అభివృద్ధి ప్రణాళికలు రూపుదిద్దుకొంటున్నాయి. ప్రభుత్వ భవన నిర్మాణం, కేంద్రంలో జలభాగం పునరుద్ధరణ మరియు కోలూన్ పడమటి భాగంలో వరుస నిర్మాణ ప్రణాళికలు వంటివి కొన్ని. కోలూన్‍లో విక్టోరియా రేవు ఎదురు తీరంలో ఆకాశసౌధ నిర్మాణం వంటివి భవనాల ఎత్తు విషయంలో నిబంధనలకు లోబడి నిర్మించాలని భావిస్తున్నారు.
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు