హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 187:
 
హాంగ్ కాంగ్ అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా మరియు పర్యాటక ఆకర్షణ కేంద్రంగా గుర్తింపు పొందింది.1960 - 1970 లో హాంగ్ కాంగ్ మార్షల్ ఆర్ట్స్ చిత్రమిర్మాణం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది. పలు హాలివుడ్ కాళాకారులు, అంత్ర్జాతీయ ఖ్యాతిగాంచిన నటీనటులు మరియు మార్షల్ ఆర్ట్స్ కళాకారులను హాంగ్ కాంగ్ చిత్రపరిశ్రమ అంతర్జాతీయ చిత్రసీమకు కానుకగా సమర్పించింది. బ్రూస్‍లీ, జాకీచాన్, చౌ యున్- ఫట్, మైకేల్ యాహ్, మేగీ చుంగ్ మరియు జెట్‍లీ.ఏ వంటి ప్రముఖనటులు హాంగ్ కాంగ్ చిత్రసీమ నుండి హాలీవుడ్‍లో ప్రవేశించారు. అనేక హాంగ్ కాంగ్ నిర్మాతలు హాలీవుడ్‍లో అత్యంత కీర్తిని సంపాదించారు. జాన్ వూ, వాంగ్ కార్-వై మరియు స్టిఫెన్ చౌ వంటి ప్రముఖులు వారిలో కొందరు. హోమ్‍గ్రోన్ చిత్రాలు చుంగ్‍కింగ్ ఎక్స్‍ప్రెస్, ఇన్‍ఫర్నల్ అఫెయిర్స్, షోల్ ఇన్ సాకర్, రంబుల్ ఇన్ ది బ్రోక్స్, ఇన్ ది మూడ్ ఫర్ లవ్ మరియు ఎకోస్ ఆఫ్ రైన్‍భో వటివి అంత్ర్జాతీయ గుర్తింపును పొందాయి. కాంటోపాప్ సంగీతానికి హాంగ్ కాంగ్ ప్రముఖ కేంద్రం. ఈ సంగీతం ఇతర చైనా సంగీతాలను అలాగే పశ్చిమదేశాల సంగీతం మీద ప్రభావం చూపి అధికమైన అభిమానులను సంపాదించింది.
 
హాంగ్ కాంగ్ " హెర్టేజ్ మ్యూజియం" " ది హాంగ్ కాంగ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ ", " ది హాంగ్ కాంగ్ అకాడమీ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మరియు హాంగ్ కాంగ్ ఫిల్‍హార్మోనిక్ ఆర్కెస్ట్రా వంటి హాంగ్ కాంగ్ సంస్కృతికి హాంగ్ కాంగ్ ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తుంది. " ది గవర్నమెంట్ లీషర్ అండ్ కల్చరల్ సర్వీస్ డిపార్ట్‍మెంట్ సబ్సిడీస్ అండ్ స్పాంసర్స్ ఇంటర్నేషనల్ పర్ఫార్మర్స్ వంటివి హాంగ్ కాంగ్‍కు తీసుకురాబడ్డాఆయి. అనేక అంతర్జాతీయ సంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వం, సలహాదారులు మరియు ప్రైవేట్ సంస్థలు చేత నిర్వహించబడుతున్నాయి.
 
== నిర్మాణశైలి ==
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు