హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 200:
== రవాణా ==
 
హాంగ్ కాంగ్ రవాణా వసతులు అధికంగా అభివృద్ధి చెందినవి. 90% (మిలియన్లు)కంటే అధికంగా ప్రజలు ప్రభుత్వ వాహనాలలో ప్రయాణం చేస్తుంటారు. మాస్ ట్రాంసిస్ట్ రైల్వే (ఎం టి ఆర్) ముందుగా చెల్లింపు విధానంలో గుర్తింపు అక్టోపస్ కార్డులను పంపిణీ చేతుంది. ఈ కార్డులను ఉపయోగించి రైలు, బసు మరియు ఫెర్రీలలో ప్రయాణం చేయ్డానికి వీలు ఔతుంది. నగరంలోని ప్రధాన రైల్వే (కె సి ఆర్ సి ) సంస్థ ఎం టి ఆర్‍తో మిళితం చేయబడడం వలన మొత్తం ప్రదేశంలో ఏకీకృత ప్రయాణవసతులు ఏర్ప్డడానికి సాధ్యమైంది.
== రవాణాఆ==
ఎం టి ఆర్ రాపిడ్ ట్రాంసిస్ట్ 152 స్టేషన్లతో రోజుకు 3.4 మిలియన్ల ప్రజలకు ప్రయాణసౌకర్యం కలిగిస్తుంది. 1904 నుండి ప్రయాణ సేవలు అందిస్తున్న హాంగ్ కాంగ్ ట్రాంవేలు హాంగ్ కాంగ్ ద్వీపం ఉత్తర భాగంలో ప్రయాణించడానికి అనువైన వసతులు కల్పిస్తుంది.
 
హాంగ్ కాంగ్ బసులను నడిపే విశేషాధికారం ప్రైవేటు సంస్థకు ఇవ్వబడుతుంది. ఈ అధికారాన్ని కలిగి ఉన్న 5 ప్రైవేట్ యాజమాన్య సంస్థలు మొత్తం ప్రదేశంలో 700 బసులను నడుపుతున్నాయి. వీటిలో పెద్ద సంస్థ అయిన కోలూన్ మోటర్ బసులు కోలూన్ మరియు న్యూటెర్రిటరీలలో 402 మర్గాలలో బసులను నడుపుతున్నాయి. హాంగ్ కాంగ్ ద్వీపంలో సిటీబసులను 154 మార్గాలలో నడుపుతున్నారు. రెండూ హార్బర్ సేవలను అందిస్తున్నాయి. హాంగ్ కాంగ్‍లో 1949లో డబల్ డెక్కర్ బసులను పరిచయం చేసారు. ఇప్పుడు అధికంగా డబల్ డెక్కర్ బసులనే నడుపబడుతున్నాయి. సింగల్ డెక్కర్ బసులను తక్కువ రద్దీ కలిగిన మార్గాలలో మరియు తక్కువ బరువును మాత్రమే అనుమతించే మార్గాలలో నడుపుతున్నారు. తేలికపాటి ప్రభుత్వ బసులను హాంగ్ కాంగ్ లోని బసులను స్టాండర్డ్ బసులు చేరుకోలేని, తరచుగా లేక నేరుగా లభ్యంకాని మార్గాలలో నడుపుతుంటారు.
 
1888లో స్థాపించబడిన ది స్టార్ ఫెర్రీ సర్వీసు విక్టోరియా హార్బర్ చేరుకునేలా 4 మార్గాలలో ఫెర్రీలను నడుపుతుంది. ఈ ఫెర్రీలలో ప్రయాణిస్తూ హాంగ్ కాంగ్ ఆకాశసౌధ సమూహాలను వీక్షించే వీలు కల్పిస్తుంది. ఈ ఫెర్రీలలో ఒకరోజుకు 53,000 మంది ప్రయాణిస్తుంటారు. ది వరల్డ్ ఆఫ్ సూజీ వాంగ్ నవలలో ఈ ఫెర్రీ ప్రయాణాలు చోటుచేసుకోవడంతో ఈ ఫెర్రీ ప్రయాణాలు ప్రపంచంలో విశిష్ఠ స్థానం సంపాదించుకున్నాయి. పర్యాటక రచయిత రాయన్ లెవిట్ సెంట్రల్ తీరంలోని ప్రధాన " త్సిం షా ట్సుయి " ప్రయాణం ప్రపంచంలోనే అతి సుందరమైనదని పేర్కొన్నాడు. ఇతర ఫెర్రీలు సముద్రాంతర ద్వీపాలైన న్యూటౌంస్, మాక్యూ మరియు రిపబ్లిక్ చైనాలోని ప్రధాన నగరాలకు ఫెర్రీ సేవలు అందిస్తున్నాయి. హాంగ్ కాంగ్ చిరుతితిండి తింటూ హార్బర్ ప్రయాణాలు చేయడానికి పేరుపొందినది. సుదూర నివాసాలకు తీసుకు వెళ్ళడానికి కై-టు అనే చిన్న ఫెర్రీలను నడుపుతుంటారు. హాంగ్ కాంగ్ హార్బర్‍ రద్దీ అయిన డీప్ వాటర్ హార్బర్ కంటైనర్ రవాణాకు ప్రసిద్ధి అయినది.
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు