రేడియో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
ట్రాన్సిష్టర్ ల వాడకం రేడియో సెట్లలో ప్రారంభమై చెవిటి వాళ్ళు ఉపయోగించె శ్రవణ పరికరాలు, గిటార్లు,రాకెట్ లో వాడే ఆధునిక పరికరాలు, కంప్యుటర్లు దాకా విస్తరించింది. ఇంతే కాకుండా అర్థవాహకాలను ఉపయోగించి సౌరశక్తినీ, పరమాణు శక్తినీ విద్యుత్ శక్తిగా మార్చటానికి వీలవుతుంది. ఇటీవలి కాలంలో జరిగిన పరిశోధన ఫలితంగా తపాలా బిళ్ళ కంటే చిన్న పరిమాణమున్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనబడే సాధనం రూపొందించబడింది. దీనిలో ట్రాన్సిష్టర్లు, కెపాసిటర్లు,రెసిస్టర్లు కావలసిన పద్ధతిలో అమర్చబది ఉంటాయి. కంప్యూటర్ల నిర్మాణంలో ఇది అతి కీలక పాత్ర వహిస్తోంది.
==రేడియో టెలిఫోన్==
[[File:GPS Receivers.jpg|thumb|right|Modern [[GPS]] receivers.]]
చిన్న తరంగాలపై పనిచేసే రేడియో టెలిఫోన్ అనే పరికరం చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ఓడ నుండీ తీరానికి, విమానం నుంచి విమానాశ్రయానికి వార్తలను పంపించేందుకు దీన్ని తప్పనిసరిగా వాడాల్సిందే. కల్లోలిత ప్రాంతాల్లో గస్తీ దళాలకు, పర్వతారోహక బృందాలకు, అంబులెన్స్ వాహనాలకు, సైనిక దళాలకు, ఇది విస్తృతంగా ఉపయోగపడుతుంది. కొన్ని విదేశీ నగరాల్లో కారులో ప్రయాణం చేస్తూ కూడా ఇతర టెలిఫోన్ వినియోగదారులతో మాట్లాడటానికి వీలుంది. ఆస్పత్రుల్లో డాక్టర్ లతోనూ, పెద్ద,పెద్ద కర్మాగాలాలలో, ఆఫీసుల్లో, ఉద్యోగులతోనూ రేడియో టెలిఫోన్ ద్వారా ఎప్పటికప్పుదు సంప్రదించవచ్చు. అంతర్జాతీయ సమావేశాలు జరిగినపుడు ప్రధాన వక్త ఉపన్యాసాన్ని వేవు వేరు మైక్రోఫోన్ లు, ట్రాన్స్ మీటర్లు ద్వారా వివిధ భాషల్లో తర్జుమా చేస్తుంటారు. సభుల వద్ద ఉండే చిన్న రిసీవర్ల తో ఏ భాషలోనైనా వినటానికి వీలుంటుంది. ఇలాంటి అధునాతన పరికరాలనిర్మాణం ట్రాన్సిష్టర్ల ద్వారానే సాధ్యమైంది.
 
"https://te.wikipedia.org/wiki/రేడియో" నుండి వెలికితీశారు