హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 138:
హాంగ్ కాంగ్ న్యాయవ్యవస్థ పూర్తిగా రిపబ్లిక్ న్యావ్యవస్థకు లోబడక స్వతంత్రంగా వ్యవహరించే సాధికారం కలిగి ఉన్నది. రిపబ్లిక్ చైనా సివిల్ లా కంటే విభిన్నమైన హాంగ్ కాంగ్ న్యావ్యవస్థ బ్రిటిష్ న్యాయసూత్రాల ఆధారితంగా రూపొందించబడిన " ఇంగ్లీష్ కామన్ లా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇతర న్యాయవ్యవస్థలు ప్రతిపాదించిన కేసుల చర్చలు హాంగ్ కాంగ్ కోర్టులలో కొనసాగిస్తారు. ఇతర కామన్ లా న్యాయమూర్తులు తాత్కాలికంగా అనధికారికంగా న్యాయస్థానంలో కూర్చుని కేసును విచారణను గమనించవచ్చు.
 
కుటుంబ న్యాయస్థానం చేరిన డిస్ట్రిక్ కోర్టులలో విచారించిన తరువాత వారి సిఫారసు మీద ఆధారపడి హైకోర్ట్ కేసు విచారణ జరుపుతుంది. ట్రిబ్యూనల్, మెజిస్ట్రేట్ కోర్ట్, ది జ్యువెన్లీ కోర్ట్, ది కార్నర్స్ కోర్ట్, ది లేబర్ ట్రిబ్యూనల్, ది స్మాల్ క్లెయింస్ ట్రిబ్యూనల్ మరియు అబ్సెంస్ ఆర్టికల్ ట్రిబ్యూనల్ వంటి ఇతర న్యాయస్థానాలు న్యాయ సేవలు అందిస్తునాయి. చివరి తీర్పుకు వచ్చే కేసులను విచారించడానికి హాంగ్ కాంగ్ ప్రభుత్వం చీఫ్ ఎగ్జిక్యూటివ్ నియామకం చేస్తుంది.
 
న్యాయవ్యస్థ బాధ్యతలలో ప్రభుత్వ వివాద పరిష్కారాలు కూడా ఒక భాగమే. న్యాయవ్యవస్థ బాధ్యతలలో ముఖ్యమైనవి చట్టపరమైన సలహాలు అందించడం, నేర విచారణ, సాంఘిక ప్రాతినిధ్యం, చట్టం మరియు విధానాల రూపకల్పన మరియు సంస్కరణ చేయడం వంటివి. అలాగే విభిన్నమైన న్యాయవిధానాలు కలిగిన అంతర్జాత్జియ న్యాయవిధానాలకు సహకరించడం కూడా వారి బాధ్యతలలో ఒకటి. ప్రభుత్వ న్యాయశాఖా న్యాయవాదులకు క్రిమినల్ కేసుల విచారణ చేయడమే కాక ప్రభుత్వా వ్యతిరేక సివిల్ కేసులను నిర్వహణా పరమైన కేసులను కూడా వివాదించవలసిన బాధ్యత ఉంది. ప్రజాశక్తి కరమైన కేసులను ప్రభుత్వం న్యాయవిచారణ బాధ్యతను స్వీకరిస్తుంది. క్రిమినల్ కేసుల విచారణలో ప్రభుత్వ జోక్యం ఆటంకపడకుండా న్యాయవ్యవస్థను బేసిక్ లా విధానం రక్షిస్థుంది.
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు