"సీమ తంగేడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
|}}
 
'''సీమ తంగేడు'''ను అవిచిచెట్టు, మెట్టతామర, సీమ అవిసె, తంటెము అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయనామం సెన్నా అలటా (Senna alata), దీనిని ఆంగ్లంలో కాండిల్ బుష్ (Candle Bush) అంటారు. ఇది ముఖ్యమైన ఔషధ వృక్షం, అలాగే Caesalpinioideae ఉపకుటుంబంలోని పుష్పించే మొక్కలకు చెందిన అలంకార మొక్క. ఈ చెట్టు యొక్క పువ్వులు [[తంగేడు]] చెట్టు పువ్వులను పోలి ఉండుట వలన సీమ తంగేడుగా ప్రసిద్ధి చెందింది. ఈ చెట్టును ఇంకా ఎంప్రెస్ కాండిల్ ప్లాంట్ (సామ్రాజ్ఞి కాండిల్ మొక్క), రింగ్వార్మ్ ట్రీ (తామరవ్యాధి చెట్టు) అని కూడా అంటారు. [[సెన్నా]] యొక్క ఒక అద్భుతమైన జాతి ఇది, కొన్నిసార్లు దానియొక్క సొంత ప్రజాతి Herpeticaగా వేరు చేయబడింది. సీమ తంగేడు మెక్సికో ప్రాంతానికి చెందినది, మరియు విభిన్న ప్రాంతాలలో కనుగొనబడింది. ఉష్ణ ప్రదేశాలలో ఇవి సముద్ర మట్టానికి 1200 మీటర్ల ఎత్తులో పెరుగుతాయి. ఆస్ట్రోనేషియాలో ఇది ఒక ఆక్రమిత జాతి. శ్రీలంక సాంప్రదాయ వైద్య ప్రక్రియలో దీనిని ఒక మూలపదార్థముగా (ముఖ్య మూలికగా) ఉపయోగిస్తారు.
 
[[Image:Senna alata.jpg|thumb|[[Inflorescence]]s and foliage]]
32,620

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/798296" నుండి వెలికితీశారు