శ్రీమదాంధ్ర భాగవతం: కూర్పుల మధ్య తేడాలు

చి పద్యాలు తొలగించు
పంక్తి 12:
* వామన చరిత్ర
* [[కుచేలోపాఖ్యానము]]
 
== మొదటి పద్యము ==
 
శ్రీ కైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్, లోక ర
 
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
 
ద్రేక స్తంభకు, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
 
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.
* ఈ పద్యములో మొత్తము ఆరు దళములు ఉన్నాయి.
(1) శ్రీ కైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్
(2) లోకరక్షైకారంభకున్
(3) భక్తపాలన కళా సంరంభకున్
(4) దానవోద్రేక స్తంభకున్
(5) కేళిలోల విలసద్ దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్
(6) మహానందాంగనా డింభకున్
 
==గజేంద్ర మోక్షము==
::సరసిలోనుండి పొడగని సంభ్రమించి
::యుదరి కుప్పించి లంఘించి హుంకరించి
::భానుఁ గబళించి పట్టు స్వ ర్భానుపగిది
::నొకమకరేంద్రుఁడిభరాజు నోడిసి పట్టె.
 
 
::కరిఁ దిగుచు మకరి సరసికి
::గరి దరికిని మకరిఁ దిగుచుఁ గరకరి బెరయన్
::గరికి మకరి మకరికిఁ గరి
::భర మనుచుచు నతలకుతల భటు లరుదు పడన్.
 
 
::పాదద్వంద్వము నేలమోపిపవనుం బంధించి పంచేంద్రియో,
::న్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకు న్మారాకు హత్తించి ని,
::ష్ఖేదబ్రహ్మపదావలంబనగతిన్ గ్రీడించుయోగీంద్రుమ,
::ర్యాద న్నక్రము విక్రమించెఁ గరిపాదాక్రాంతినిర్వక్రమై.
 
 
::ఊహా కలంగి జీవనపు తోలమునం బడి పోరుచున్మహా,
::మోహలతానిబద్ధపదము న్విడిపించుగొనంగ లేక సం,
::దేహముఁ బొందుదేహిక్రియ దీనదశన్ గజ ముండె భీషణ,
::గ్రాహదురంతదంత పరి ఘట్టితపాదఖురాగ్రశల్యమై.
 
 
::ఏరూపంబున దీని గెల్తు నిటుమీఁ దేవేల్పుఁ జింతింతునె,
::వ్వారిం జీరుదు నెవ్వడడ్డ మిఁక ని వ్వారిప్రచారోత్తము,
::న్వారింపం దగువార లెవ్వ రఖిల వ్యాపారపారాయణుల్,
::లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింపం బ్రపుణ్యాత్మకుల్.
 
 
::నానానేకపయూథము ల్వనములో నం బెద్దకాలంబు స,
::న్మానింప న్దశలక్షకోటికరిణీ నాథుండ నై యుండి మ,
::ద్దానాంభః పరి పుష్టచందనలతాం తచ్ఛాయలం దుండ లే,
::కీనిరాశ నిటేల వచ్చితి భయం బెట్లోకదే ఈశ్వరా.
 
 
::ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
::యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
::బెవ్వ; డనాదిమధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
::డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
 
 
::ఒకపరి జగముల వెలి నిడి
::యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ గనుచున్
::సకలార్థ సాక్షియగున
::య్యకులంకుని నాత్మమయుని నర్థింతు మదిన్.
 
 
::లోకంబులు లోకేశులు
::లోకస్థులు తెగిన తుది అలోకంబగు
::పెంజీకటి కవ్వల
::ఎవ్వండేకాకృతి వెలుగు నతను నే సేవింతున్
 
 
::కలఁ డందరు దీనులయెడఁ
::గలఁ డందరు పరమయోగి గణములపాలిన్
::గలఁ డందు రన్నిదిశలను
::కలఁడు కలం డనెడువాఁడు కలఁడో లేఁడో.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/శ్రీమదాంధ్ర_భాగవతం" నుండి వెలికితీశారు