తంతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
 
1844 [[మే 24]] వ తేదీన "భగవంతుడు ఏం చేశాడు"(What hath god wrought) అనే సందేశం టెలిగ్రాఫ్ ద్వారా ప్రసారమైనది. కానీ సామాన్య ప్రజలు దీన్ని పట్టించుకోలేదు. ఇంగ్లండ్ లో జరిగినట్టుగానే కాకతాళీయంగా జరిగిన ఓ చిన్న సంఘటన వల్ల టెలిగ్రాఫ్ అమాంతంగా ప్రచారంలోకి వచ్చింది. అధ్యక్ష పదవికి అభ్యర్థులను నిర్ణయించటం కోసం డమాక్రటిస్ పార్టీ బాల్టిమోర్ లో సమావేశం ఏర్పాటు చేసింది. అమెరికా 11 వ అధ్యక్షుడుగా పోటీ చేయడానికి జేమ్స్ నాక్స్ పోక్‍నీ,ఉపాధ్యక్ష అభ్యర్థిగా సిలాన్ రైట్ నీ సమావేశం ఎన్నుకుంది. ఈ వార్తను వైల్ టెలిగ్రాఫ్ ద్వారా వాషింగ్టన్ కు చేరవేసే సరికి రైట్ కాంగ్రెస్ సభ చర్చల్లో పాల్గొంటున్నాడు. మోర్స్ స్వయంగా సందేశాన్ని రైట్ కి అందించాడు. పోటీలో పాల్గొనటం తనకిష్టం లేదని రైట్ ప్రకటించగానే మోర్స్ ఈ సమాచారాన్ని బాల్టిమోర్ కి పంపించాడు. ఉపాధ్యక్ష పదవికి రైట్ ని ఆమోదించి అరగంట గడవక ముందే అతడు అంగీకరించడం లేదన్న వార్తను డెమోక్రాటిక్ పార్టీ సమావేశం లో ప్రకటించేసరికి అందరూ దిగ్భ్రాంతులయ్యారు. వార్తను నమ్మలేక సతమతమవుతున్న సందర్భంలో వాషింగ్టన్ నుంచి పార్టీ ప్రత్యేక దూత వచ్చి రైట్ తిరస్కృతిని అధికారికంగా తెలియజేశాడు. దీంతో మోర్స్ కనుగొన్న టెలిగ్రాఫ్ సాధనానికి అనన్య ప్రచారం లభించింది. పన్నెండేళ్ళ నిరంతర కృషి, నిరాశా నిస్పృహలు, యాతనలు ముగిశాయి. అతని కీర్తి నలుదిశలా వ్యాపించింది. డాష్, డాట్ లతో కూడిన కొత్త టెలిగ్రాఫ్ భాష జైత్ర యాత్రకు బయలుదేరింది.
==మహా సముద్రాలలో టెలిగ్రాఫ్ తీగలు==
[[File:1891 Telegraph Lines.jpg|right|thumb|333px|Major telegraph lines in 1891]]
అనేక యూరప్ దేశాలు మోర్స్ టెలిగ్రాఫ్ విధానాన్ని ఆమోదించాయి. హాంబర్గ్, కక్స్ హావన్ మధ్య తొలిసారిగా 1848 లో టెలిగ్రాఫ్ సౌకర్యం కల్పించబడింది. మూదేళ్ళ తరువాత ఇంగ్లీషు ఛానెల్ లో టెలిగ్రాఫ్ తీగలు అమర్చ బడ్డాయి. 1858 లో ఇంగ్లండ్ శాస్త్రవేత్త లార్డ్ కెల్విన్ అధ్వర్యంలో [[బ్రిటన్]], [[అమెరికా]] దేశాల మధ్య టెలిగ్రాఫ్ సంబంధాలు నెలకొల్పబడ్డాయి. 1872 లో మోర్స్ చనిపోయే నాటికి ప్రపంచమంతటా టెలిగ్రాఫ్ సౌకర్యం విస్తరిల్లింది. అతడు సృషించిన కొత్త భాష అనేక దేశాల టెలిగ్రాఫ్ కార్యాలయాల్లో ప్రతిధ్వనించసాగింది.
==వైర్ లెస్ టెలిగ్రాఫ్==
 
<!-- గౌరవ సహసభ్యులకు మనవి: ఈ వ్యాసం పూర్తిగా విస్తరించటానికి మూడు రోజుల సమయం పడుతుంది. కనుక అంతవరకు వ్యాసం విస్తరణ దిద్దుబాట్లు చేయకుండా సహకరించండి.అక్షర దోష దిద్దుబాట్లు చేయండి -->
"https://te.wikipedia.org/wiki/తంతి" నుండి వెలికితీశారు