తంతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
మోర్స్ విధానాన్ని [[అమెరికా]] లో [[థామస్ అల్వా ఎడిసన్]], [[జర్మనీ]] లో [[వెర్నర్ సీమెన్స్]], [[ఇంగ్లండ్]] లోఅయన సోదరుడు విల్లియం మెరుగుపరచారు. అతని మరో సోదరుడు కార్ల్ కృషి వల్ల [[రష్యా]] లో తెలిగ్రాఫ్ పట్ల వుండే అపోహలు వైదొలిగాయి. సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తమ రాజభవనానికి మాత్రం టెలిగ్రాఫ్ సౌకర్యాన్ని కల్పించడానికి జార అనుమతి ఇచ్చాడు. కానీ తీగలు బయటి నుంచి ఎవరికీ కనబడరాదన్న షరతును విధించాడు. [[కార్ల్ సీమెన్స్]] అతని అభీష్టం మేరకు నీటి గొట్టాల పక్క న తీగ అమర్చాడు. దీంతో ప్రభావితుడైన జార్ రష్యా అంతటా టెలిగ్రాఫ్ తీగల ఏర్పాటుకు అంగీకరించాడు.
 
లండన్ లో జన్మించిన డేవిడ్ ఎడ్వర్డ్ హగ్స్ అనే సంగీత శాస్త్రజ్ఞుడు మోర్స్ కోడ్ తో నిమిత్తం లేకుండా అక్షరాలను, అంకెలను నేరుగా ప్రసారం చేయగలిగిన టెలిగ్రాఫ్ యంత్రాన్ని నిర్మించాడు. పియానో లో ఉన్నట్టుగా ఇందులో ఒక కీ బోర్డు ఉంటుంది. 52 కీ.లు ఉంటాయి. ఒక్కొక్క కీని అదిమినపుడు దానికి అనుగుణంగా ఉండే అక్షరం అవతలి పట్టణంలో ముద్రించబడుతుంది. ప్రస్తుతం మనం విస్తృతంగా వాడుతున్న టెలిప్రింటర్ ఈ సాధనం నుండే తయారుచేయబడినది.
 
విద్యుత్ టైప్‍రైటర్ లాగ కనిపించే టెలిప్రింటర్ ఒక్కొక్క సంకేతాన్ని సమాన కాలవ్యవధులలు ఉండే ఐదు విద్యుత్ స్పందనాల రూపంలో ప్రసారం చేస్తుంది. ఈ స్పందనాల సముదాయాన్ని రిసీవర్ టైప్ రైటర్ అక్షరాలుగా మార్చి టైప్ చేస్తుంది. అనేక దేశాల్లో పాత నమూనా టెలిగ్రాఫ్ యంత్రాల స్థానే టెలిప్రింటర్ లు వచ్చాయి. టెలిఫోన్ లాగ మనకు కావలసిన సంఖ్యను డయల్ చేసి సందేశాలను టెలిప్రింటర్ ద్వారా పంపడానికి ఇప్పుడు వీలవుతోంది.
 
నాగరికత అభివృద్ధి చెందటంలో టెలిగ్రాఫ్ ఎలాంటి కీలక పాత్ర ధరించిందో, జీవిత విధానం లో ఎలాంటి మూలభూతమైన మార్పులు తీసుకొచ్చిందో ఇదంతా మానవ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. దీని కారణంగా సువిశాల ప్రపంచం కుంచించుకు పోయింది. వార్తలు క్షణాల్లో ప్రపంచం నలుమూలలా వ్యాపిస్తోంది. కాలం, దూరం, అత్యల్పమై పోయాయి. మంచికో, చెడ్డకో ప్రపంచ దేశాలన్నీ టెలిగ్రాఫ్ తీగలతోనూ, కేబుల్స్ తోను అవినాభావంగా బంధించబడ్డాయి.
<!-- గౌరవ సహసభ్యులకు మనవి: ఈ వ్యాసం పూర్తిగా విస్తరించటానికి మూడు రోజుల సమయం పడుతుంది. కనుక అంతవరకు వ్యాసం విస్తరణ దిద్దుబాట్లు చేయకుండా సహకరించండి.అక్షర దోష దిద్దుబాట్లు చేయండి -->
"https://te.wikipedia.org/wiki/తంతి" నుండి వెలికితీశారు