తంతి: కూర్పుల మధ్య తేడాలు

చి సుల్తాన్ ఖాదర్ టెలిగ్రాఫ్ పేజీని తంతికి తరలించారు: తెలుగు పేరు
పంక్తి 1:
'''తంతి ''' లేదా టెలిగ్రాఫ్ అనునది విద్యుత్ స్పందనల సంకేతాల ద్వారా సమాచారాన్నిసమాచారాaన్ని ఒకచోటు నుండి వేరొక ప్రదేశానికి పంపించే వ్యవస్థ. ఇది రెండు గ్రీకు పదములైన టెలి(tele)([[గ్రీకు]]:τηλε) అనగా "దూరం" మరియు గ్రాఫియన్ (graphein)([[గ్రీకు]]:γραφειν) అనగా "రచన" అని అర్థము. సమాచారాన్ని సుదూర ప్రాంతాలకు ప్రసారం చేయుటకు ఉపయోగపడే వ్యవస్థ.
 
==చరిత్ర==
పంక్తి 13:
 
==విద్యుత్ టెలిగ్రాఫ్==
[[స్కాట్లండ్]] వైద్యుడు చార్లెస్ మారిసన్ విద్యుత్తు ద్వారా సంకేతాలను ప్రసారం చేయచచ్చునని 1753 లోనే సూచించాడు. ఈ పద్ధతి లోనే కొన్ని ప్రయోగాలు జరిగాయి కూడా. విద్యుత్ విశ్లేషణ ప్రక్రియని ఉపయోగించి టెలిగ్రాఫ్ చేస్తే హైడ్రోజన్, ఆక్సినజ్ ఉత్పత్తి అవుతాయి. వోల్టా విద్యు ఘటాలలో రెందు డజన్ల లోహం చీలలని వాడాడు. ఒక్కొక్క చీల ఒక అక్షరాన్ని సూచిస్తుంది. ప్రసారిణి వద్ద వోల్టా ఘటాలు రెండు డజన్ల చీలలు ఉంటాయి. ఒక గాజు పాత్రలో ఆసిడ్ కలిపిన నీళ్ళు గ్రాహకంగా పనిచేస్తుంది. ఇందులో కూడా 24 లోహపు చీలలు ఉంటాయి. ప్రసారిణిలో ఉండే చీలలను గ్రాహకం లో ఉండే చీలలతో 24 తీగలు కలుపుతాయి. ప్రసారిణి వద్ద ఒక్కొక్క అక్షరాన్ని సూచించే చీలను వోల్టా ఘటానికి కలిపితే గ్రాహకంలో చీలవద్ద హైడ్రోజన్ లేదా ఆక్సిజన్ గాలి బుడగల రూపంలో ఉత్పత్తి అవుతుంది. ఏ ఏ చీలల వద్ద ఇలా గాలి బుడగలు బయలు దేరతాయో వాటి ఆధారంగా సందేశాల్ని తెలుసుకోవచ్చు. ఈ పద్ధతి కాస్త క్లిష్టమైనప్పటికీ బాగానే పనిచేసింది.
 
ఒక్ లోహం తీగలో విద్యుత్తు ప్రవహించినపుడు దానికి దగ్గరగా ఉండే అయస్కాంత సూచిక అపవర్తనం చెందుతున్నదని కోపన్ గేగన్ లో ఫొఫెసర్ [[ఆయిర్‍స్టెడ్]] కనుక్కోవటం టెలిగ్రాఫ్ పరిశోధనలు చేసే శాస్త్రజ్ఞులకు కొత్త బాట చూపింది. గాటింజన్ వేధశాల(objervatory) డైరక్టర్ గా పని చేస్తున్న ఫ్రీడిచ్ గాన్ మ్యూనిచ్ లో సోమరింగ్ నిర్మించిన టెలిగ్రాఫ్ పరికరాన్ని చూచి చాలా ప్రభావితుడై ఈ విభాగంలో కృషి చేయడం ప్రారంభించాడు. గాటింజన్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ఆచార్యుడుగా పనిచేస్తున్న వెబర్తో కలిసి వేధశాల నుంచి భౌతిక శాస్త్ర ప్రయోగశాల వరకు సుమారు రెండు మైళ్ళ దూరం తెలిగ్రాఫ్ తీగలను సంధించాడు. గ్రాహకంలో అయస్కాంత సూచికకు బదులు ఇనుప బద్దని వాడారు. ప్రసారిణి నుంచి వచ్చే తీగలో విద్యుత్తు మారినప్పుడల్లా గ్రాహకంలోని ఇనుప బద్దలో కదలికలు ఏర్పడతాయి. దీనికి ఓ చిన్న అద్దం అతికించబడి ఉంటుంది. అద్దానికి ముందు భాగంలో టెలిస్కోప్, స్కేలు ఉంటాయి. టెలిస్కోప్ లో చూచినప్పుడు అద్దంలో స్కేలు విభాగాలు కనబడతాయి. ఇనుపబద్ద ఏ మాత్రం కదిలినా టెలిస్కోప్ లో చూచినప్పుదు అద్దంలో స్కేలు విభాగాలు కనబడతాయి ఇనుప బద్ద ఏ మాత్రం కదిలినా టెలిస్క్ఫ్హ్ లో అపవర్తనం ఏర్పడుతుంది. ఇలాంటి అపవర్తనాలలో అక్షరాలను సూచించె కోడ్ ని శాస్త్రజ్ఞులిద్దరూ తయారుచేసుకున్నారు.
 
వైజ్ఙానిక విషయాలను పరస్పరం అందించుకునే ఉద్దేశ్యముతో ఈ ఏర్పాటు చేసినప్పటికీ, గణనీయమైన దూరానికి సందేశాలను పంపే మొదటి విద్యుత్ టెలిగ్రాఫ్ పరికరం ఇదే అని చెప్పవచ్చు. '''మైకెల్మన్ వస్తున్నాడు ''' అనె వార్తను వాళ్ళు తొలిసారిగా ఈ పరికరం ద్వారా పంపగలిగారు. పరికరాన్ని అమర్చడంలో మైకెల్మన్ అనే మెకానిక్ శాస్త్రజ్ఞులకు తోడ్పడ్డాడు. ఈ సందేశాన్ని 40 అనువర్తనాలద్వారా పంపటం జరిగినది.
 
 
కొద్దిమంది శాస్త్రజ్ఞులకు తప్ప ఈ పరికరం నిర్మాణం అజ్ఞాతంగానే ఉంది పోయింది. దీన్ని విస్తృత ప్రాతిపదికపై అభివృద్ధి చేయాలన్న ఆలోచన వాళ్ళకెందుకో తట్టలేదు. కానీ మానవ శరీరంలో నాడీ వ్యవస్థ లాగా ప్రపంచ దేశాలన్నింటినీ రైల్వే పట్టాలతోను, టెలిగ్రాఫ్ తీగలతోనూ కలపగలిగితే దేశాల మధ్య దూరం తగ్గడమే కాకుండా మెరుపు తీగ వేగంతో వార్తల్ని అందజేయవచ్చని వెబర్ ఒకప్పుడు మనసులో అనుకున్నాడట.
 
ఒకప్పుడు తన వద్ద చదువుకున్న స్టీన్ హీల్ ని నిత్యజీవితంలో ఉపయోగపడేలా టెలిగ్రాఫ్ విధానాన్ని మెరుగుపరచాలని గాస్ సలహా యిచ్చాడు. ఇనప బద్దకు బదులుగా స్టీన్ హీల్ రెండు అయస్కాంత సూచికలను వాడి, వాటిద్వారా రెండు కలాలు కదిలేలా అమర్చాడు. కదులుతున్న కాగితం చుట్టపై ఈ కలాల వల్ల చుక్కలు ఏర్పడతాయి. 1837 లో ఈ టెలిగ్రాఫ్ విధానం మ్యూనిచ్ లో రాయల్ అకాడమీ, వేధశాలల మధ్య ఏర్పాటయింది. ఇంతలో న్యూరెంబర్గ్,ఫర్త్ నగరాల మధ్య రైల్వే మార్గం పక్కనే టెలిగ్రాఫ్ తీగలను అమర్చే పని స్టీన్ హీల్ కి అప్పగించబడింది.
 
ఒక తీగను మాత్రమే వాడి, విద్యుత్ వెనక్కి రావటానికి రైలు పట్టాలనే వినియోగించవచ్చునని స్టీల్ హీల్ మొదట్లో అనుకున్నాడు. కానీ ఇది కుదరలేదు. ప్రయోగాలు చేస్తున్నప్పుడు భూమి ఉత్తమ విద్యుద్వాహకంగా పనిచేస్తుందని స్టీన్ హీల్ కనుగొన్నాఅడు. ప్రసారిణి, గ్రాహకం రెండిటినీ వేరు వేరు లోహం బద్దలకు సంధించి, వాటిని తడిగా ఉన్న భూమిలోకి జొనిపితే రెండో తీగ అవసరం లేకుండ భూమి ద్వారా ఇవి సంధించబడతాయి.
 
మ్యూనిచ్ లో రష్యా రాయబారి కార్యాలయ్ం ఉండేది. అందులో పాల్ షిల్లింగ్ అనే అధికారి పనిచేస్తుండేవాడు. ఇతనికి విజ్ఞానశాస్త్రంలో అభిరుచి ఎక్కువ. సోమరింగ్ నిర్మించిన టెలిగ్రాఫ్ నమూనాని ఇతడు ఉదార భావాలు కలిగిన వాడైనప్పటికీ, వర్తా ప్రసార సౌకర్యాలు అభివృద్ధి చెందితే తన నిరంకుశ అధికారాలు దెబ్బతింటాయని భయపడి టెలిగ్రాఫ్ తీగలను అమర్చడం గానీ, దాన్ని గురించి వైజ్ఞానిక పత్రికల్లో రాయడం గానీ చేయరాదని షిల్లింగ్ ని ఆదేశించాడు.
===కుక్-వీట్‍స్టన్ టెలిగ్రాఫ్ పద్ధతి===
[[File:Cooke and Wheatstone electric telegraph.jpg|thumb|160px|right|Cooke and Wheatstone's electric telegraph]]
కానీ షిల్లింగ్ మాత్రం వ్యక్తిగత అభిరుచిని వదులుకోలేక ప్రయోగాలు చేస్తూనే వచ్చాడు. 5 అయస్కాంత సూచికల తో అతడు ఓ నమూనాని తయారుచేసి 1835 లో బాన్ నగరంలో జరిగిన సైన్సు కాంగ్రెస్ సదస్సులో ప్రదర్శించాడు. దీన్ని గురించి క్షున్నంగా తెలుసుకున్న విలియం కుక్ లండన్ కింగ్ కళాశాల లో ఆచార్యుడుగా పనిచేస్తున్న వీట్ స్టన్ తో కలిసి పరిశోధనలు ప్రారంభించాడు. లండన్-బ్లాక్ వాల్ రైలు మార్గం వెంబడి వీళ్ళీద్దరూ తొలిసారిగా ఇంగ్లండ్ లో టెలిగ్రాఫ్ తీగల్ని అమర్చారు. ఇది విజయవంతం కావటంతో రైల్వే అధికారులు పొడింగ్డన్, స్లో నగరాల మధ్య 19 మైళ్ళ పొడవునా టెలిగ్రాఫ్ సౌకర్యం కల్పించి ఇది ఎలా పనిచేస్తుందో వచ్చి చూడాలని ప్రజల్ని ఆహ్వానించారు. తీగలతో, అయస్కాంత సూచికలతో ఆడుకుంటున్న ఆపరేటర్ ల లీలలను గమనించడం తప్ప ఈ కొత్త వింతను ఏం చేసుకోవాలో ప్రజలకు పాలుపోలేదు. 1845 జనవరు ఒకటో తేదీన జరిగిన ఓ సంఘటన వాళ్ళలో సంచలనం కలిగించింది.
 
పాడింగ్టన్ లో పనిచేసే ఆపరేటర్ కి టెలిగ్రాఫ్ యంత్రం ద్వారా ఈ వార్త అందించబడింది. -- "సాల్ఠిల్ లో ఓ హత్య ఇప్పుడే జరిగింది. హంతకుడుగా అనుమానింపబడ్డ వ్యక్తి స్లో నుంచి ఉదయం 7.42 సమయానికి మొదటి తరగతి పెట్టెలో లండన్ కి బయలుదేరాడు. గోదుమరంగు కోటు కాళ్ళదాకా ధరించి అతడు రెండో పెట్టెలో ప్రయాణం చేస్తున్నాడు."
 
ఆపరేటర్ వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్ళీ విషయం తెలియజేశాడు. పాడింగ్ టన్ స్టేషన్ లోకి రైలు వచ్చేసరికి మామూలు దుస్తులు ధరించిన ఇద్దరు పోలీసు అధికారులు సిద్ధంగా నిలబడి హంతకుణ్ణి గుర్తించి అరెస్టు చేయగలిగారు. కోర్టులో జరిగిన విచారణ అందరిలోనూ ఉత్కంఠ లేపింది. టెలిగ్రాఫ్ సౌకర్యం వల్లనే హంతకుణ్ణి పట్టుకోగలిగామని పోలీసులు వాంగ్మూలం ఇచ్చారు. "టెలిగ్రాఫ్ తీగలే ముద్దాయిని ఉరి తీశాయి" -- అని లండన్ ప్రజలు బాహాటంగానే చెప్పుకున్నారు.
==శామ్యూల్ మోర్స్==
[[File:Samuel Morse 1840.jpg|100px|left|thumb|శామ్యూల్ మోర్స్]]
కుక్-వీట్‍స్టన్ టెలిగ్రాఫ్ పద్ధతి ఒకే సూచికతో పనిచేసేలా నిర్మాణంలో మార్పులు చేశారు. ఈ పద్ధతి బ్రిటన్ లో చాలా కాలం వాడుకలో ఉండేది. దీనికంటే మెరుగైన పద్ధతి అమెరికా లో కనుగొనబడింది. దీన్ని కనుగొన్నవాడు విజ్ఞాన శాస్త్రజ్ఞుడు కాకుండా ఒక కళాకారుడు కావటం ఆశ్చర్యకరమైన విషయమే. కనిక్టికట్ లో ఓ చర్చి అధికారికి మోర్స్ అనే కొడుకు పుట్టాడు అతడు చిన్నప్పటి నుండి పాఠశాలలో తనతోపాటు చదువుకునే విధ్యార్థుల చిత్రపటాలను గీచి వాళ్ళనుంచి కొంత డబ్బు పొందేవాడు. 30 యేళ్ళ వయస్సు వచ్చేసరికి చిత్రకారుడుగా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. అతడు గీసిన ప్రెసిడెంట్ మన్రో, లాఫయటీ మొదలైన నాయకుల చిత్రపటాలు ఇప్పటికీ వాషింగ్టన్, న్యూయార్క్ నగరాల్లోని సార్వజనిక భవనాల్లో చూడవచ్చు. అతని భార్య చాలా అందంగా ఉండేది. ఆమె మరణానంతరం అతడు వియోగ బాధతో ఏ పనీ చేయలేకపోయాడు. మనశ్శాంతి కోసం యూరప్ యాత్రకెళ్ళి 1832 లో తిరిగి వచ్చాడు. అప్పటికీ అతడు నలభయ్యో వడిలో పడ్డాడు.
 
ఓడలో తిరిగి వస్తుండగా అమెరికా కి చెందిన ఓ కుర్ర డాక్టర్ విజ్ఞాన సంబంధమైన వార్తలను, తమాషాలను ముచ్చటిస్తూ తోటి ప్రయాణీకులకు వినోదం కల్పించసాగాడు. పారిస్ లో ఫొఫెసర్ ఆంపియర్ ప్రదర్శించిన విద్యుదయస్కాంతాన్ని చూది ప్రభావితుడై అతడు [[వోల్టా ఘటం]] తొ సహా ఓ విద్యుదయస్కాంతాన్ని తనతో బాటు తెచ్చాడు. ఇనుపకడ్డీ చుట్టూ తీగను చుట్టి [[విద్యుత్తు]] ప్రవహింప జేస్తే అది తాత్కాలిక అయస్కాంతంగా మారుతుందని, విద్యుత్తును ఆపివేయగానే అది మామూలు ఇనుప కడ్డీ అయిపోతుందనీ అయడు ప్రయోగం చేసి అందరికీ చూపించాడు.
 
ప్రయోగాలను మోర్స్ అతి జాగ్రత్తగా పరిశీలించాదు. మెరుపు తీగలా అతని మస్తిష్కంలో ఓ ఆలోచన మెరిసింది. --"<big>'''విద్యుదయస్కాంత వలయంలో ఎక్కడో ఒక చోట విద్యుచ్ఛక్తి అస్తిత్వాన్ని కంటికి కనవడేలా చేయగలిగితే, సమాచారాన్ని వెంటనే ప్రసారం చేయటానికి వీలవుతుంది కదా'''</big>" అని అనుకున్నాడు. ఈ ఆలోచన రావటమే తరువాయి, కళాకారుడు యంత్ర నిర్మాతగా మారిపోయాడు.
==మోర్స్ టెలిగ్రాఫ్==
[[File:L-Telegraph1.png|thumb|right|200px|మోర్స్ కీ]]
[[దస్త్రం:Morse code.png|thumb|right|200px|మోర్స్ కోడ్]]
విద్యుచ్ఛక్తిని ఉపయోగించి సంకేతాలను ప్రసారం చేయడంలో అదివరకు జరిగిన ప్రయోగాల సంగతి మోర్స్ కేమీ తెలియదు. వివిధ దేశాల మధ్య వార్తా ప్రసారాల కోసం సమర్థవంతమైన అధునాతన పరికరాన్ని రూపొందించటం చాలా అవసరమని అతడు గ్రహించాడు. పారిశ్రామిక విప్లవం ఇంగ్లండ్ ని ఆర్థికంగా, సామాజికంగా గుర్తు తెలియకుండా మార్చివేసింది. అమెరికా లో కూడా ఇలాంటి మార్పులే వస్తున్నాయి. రవాణా సాధనాలుగా నేలమీద గుర్రం, జలమార్గాల్లో తెరచాప తెరమరుగున పడిపోయి వాటి స్థానంలో ఆవిరి శక్తి ఊపందుకుంది. శారీరక శ్రమతో నెమ్మదిగా జరుగుతున్న వస్తువుల ఉత్పత్తి రాను రాను యాంత్రిక పరికరాలు వాడటంతో అనేక రెట్లు పెరిగింది. పరిశ్రమల్లో పెట్టుబడి ఎక్కువైంది. అధిక లాభాలను పొందాలంటే వస్తువులను వివిధ దేశాలకు ఎగుమతి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. నిత్య జీవితంలో మార్పులు చాలా త్వరగా ఏర్పడుతూ వచ్చాయి. కానీ వార్తా ప్రసారం మాత్రం నత్తనడకలా మునుపటి లాగా సాగుతుండేది. చావ్ టెలిగ్రాఫ్ విధానం సామాన్యులకు అందుబాటులో లేనంత దుబారాగా ఉండేది. పైగా అందులో ఉపయోగించే కోడ్ ని ఎవరైనా సులభంగా తెలుసుకోగలిగేలా ఉండేది.
 
సముద్ర ప్రయాణంలో మోర్స్ ఈ సమస్యను గురించే తీవ్రంగా ఆలోచిస్తూ, మనసులో మెదిలిన ఆలోచనల్ని నమూనాల రూపంలో ఓ పుస్తకంలో రాసి పెట్టాడు. న్యూయార్క్ చేరాక తీరిక దొరికినప్పుడల్లా టెలిగ్రాఫ్ పరికరం తయారుచేయాలని ప్రయత్నించాడు. చిత్ర పటాలను గీసేటప్పుడు వాడే కొయ్య చట్రం, చెడిపోయిన గడియారంలోని చక్రాలు, ఒక చిన్న బాటరీ, స్వహస్తంతో తయారుచేసిన ముతకరకం విద్యుదయస్కాంతం -- వీటితో కొన్ని వారాలు తంటాలు పడి టెలిగ్రాఫ్ పరికరాన్ని సిద్ధం చేశాడు. అది అనుకున్నంత సమర్థవంతంగా కాకపోయినప్పటికీ, తక్కువ దూరాల్లో బాగా పనిచేసింది. బాటరీ లో విద్యుత్ ఘటాల సంఖ్యను పెంచినప్పటికీ, సంకేతాలు 50 అడుగుల దూరం కంటే ఎక్కువ వెళ్ళలేక పోయాయి. అంటే దూరం ఎక్కువైతే విద్యుత్ ప్రవాహం చాలా తగ్గిపోయేది.
 
ఈ మొరటు నమూనాతోనే సుమారు రెండేళ్ళ వరకూ మోర్స్ శ్రమించాడు. హఠాత్తుగా ఓ రోజు మెరుపు తీగలా మరో ఆలోచన తట్టింది. తపాలా సర్వీసు ప్రారంభించిన తొలి రోజుల్లో తపాలా సంచులను మోయటానికి గుర్రాలను వినియోగించేవారు. గుర్రాలు అలసిపోయినప్పుడు వాటికి విశ్రాంతి ఇచ్చి,వేరే గుర్రాలను బండికి జోడించటానికి కొన్ని ప్రత్యేక స్థానాలను నిర్ణయించి ఉండెవారు. ఇలా అంచెలంచెల వారీగా తపాలా సంచులను తీసుకెళ్ళే పద్ధతిని రిలే పద్ధతి అనేవారు. ఇలాంటి పద్ధతిని టెలిగ్రాఫ్ సాధనంలో ప్రవేశపెట్టాలని మోర్స్ నిశ్చయించాడు. మొదటి దశలో విద్యుత్ ప్రవాహ రూపంలో ఉండే సంకేతాలు సుమారు 40 అడుగుల దూరం వెళ్ళాక బలహీనమవుతుందని ఇదివరకే తెలుసుకున్నాం. ఈ దశలో చిన్న విద్యుదయస్కాంతాన్ని అమర్చి, ఇది ఓ ఇనుప ముక్కను ఆకర్షించేలా చేస్తే, మరో బాటరీ సహాయంతో రెండో దశలో విద్యుత్తు ప్రవహింస్తుంది. ఇది మరో 50 అడుగుల దూరం దాకా వెళ్లగలుగుతుంది. అక్కడ మూడో దశను అమర్చవచ్చు. ఇలా చేస్తూ పోతే విద్యుత్ సంకేతాలు ఎంత దూరమైనా వెళ్ళడానికి వీలవుతుంది.
 
ఇంతలో అతనికి [[న్యూయార్క్]] నగర విశ్వవిద్యాలయంలో చిత్రలేఖనంలో ప్రొఫెసర్ గా ఉద్యోగం దొరికింది. తాను నిర్మించిన సాధనాన్ని ఓ రోజు విద్యార్థుల ముందు ప్రదర్శించాడు మోర్స్. ఆల్‍ఫ్రెడ్‍వైల్ అనే విధ్యార్థి ధనవంతుడైన అన తండ్రి వద్ద నుండి ఈ ప్రయోగశాల కోసం కొన్ని వేల డాలర్లను సమకూర్చిపెట్టాడు. డబ్బు ఇబ్బంది లేకపోవటంతో పరిశోధనలు నిర్విరామంగా, నిరాఘాటంగా కొనసాగాయి. నిర్మించిన కొత్త టెలిగ్రాఫ్ నమూనాని [[1837]] [[సెప్టెంబర్ 4]] వ తేదీన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మోర్స్ ప్రదర్శించాడు. విద్యుత్ వలయాన్ని మూయడానికి, తెరచడానికి "కీ" అనే కొత్త సాధనాన్ని మోర్స్ అందులో అమర్చాడు. దాన్ని [[మోర్స్ కీ]] అంటారు. అమెరికా జలసేన వుపయోగించే కోడ్ సహాయంతో ఈ క్రింది వార్తను మోర్స్ తీగల ద్వారా ప్రసారం చేశాడు.. ---"టెలిగ్రాఫ్ విజయవంతమైన ప్రయోగం -1837 సెప్టెంబర్ 4" --- కానీ ఇంతకంటే సరళమైన కోడ్ ని తయారుచేస్తే గాని ఇది ప్రజలకందరికీ ఉపయోగపడదని మోర్స్ గ్రహించాడు.
===మోర్స్ కోడ్===
చిన్న సంకేతాలను డాట్(Dot) అనీ, దీనికంటే ఎక్కువ కాలవ్యవధి వుండే సంకేతాలను డాష్(Dash) అనీ పేరు పెట్టి, వీటిద్వారా ఇంగ్లీషు భాషలోని అక్షరాలకు, సంఖ్యలకూ, విరామ చిహ్నాలకు, కోడ్ ని తయారుచేశాడు. దీన్ని తయారు చేయటంతో [[మోర్స్]] కి వైల్ ఎంతగానో సహయ పడ్డాడు. ఉదాహరణకి ఇలా ప్రమాణీకరించిన కోడ్ లో 'e' అనే అక్షరానికి "డాట్" మరియు 't' అనే అక్షరానికి "డాష్" సూచిస్తాయి. ఈ కోడ్ ని మోర్స్ కోడ్ అంటారు. దీన్ని 1838 జనవరి 24 వ తేదీన విశ్వవిద్యాలయంలో ప్రకటించారు.
 
==మోర్స్ టెలిగ్రాఫ్ కు అవరోధాలు==
కొత్త వార్తా ప్రసారం సాధనం కోసం అర్రులు చాచి నిరీక్షిస్తున్న ప్రపంచం టెలిగ్రాఫ్ ఆవిర్భావానికి జేజేలు పలుకుతుందనీ, తన కష్టాలు గట్టెకాయని మోర్స్ అనుకున్నాడు గానీ ముందున్న ముసళ్ళ పండగని ఊహించలేదు. టెలిగ్రాఫ్ పరికరాన్ని గురించి ఓ నివేదికను అమెరికా కాంగ్రెస్ కి సమర్పించాదు. వాషింగ్టన్ నుంచి బాల్టిమోర్ దాకా టెలిగ్రాఫ్ సౌకర్యం కల్పించటానికి 30,000 డాలర్ల మంజూరు కోసం ప్రతిపాదించిన బిల్లు మరుసటి కాంగ్రెస్ సమావేశంలో సిద్ధంగా వుంచబడింది. తమ బతుకు తెరువు దెబ్బ తింటుందనే కారణంగా తపాలా శాఖ లోని అధికారులందరూ టెలిగ్రాఫ్ సౌకర్యాన్ని ప్రతిఘటిస్తునారని పాపం మోర్స్ కి తెలియలేదు. ఇతర దేశాల్లో టెలిగ్రాఫ్ పట్ల అభిరుచి కలిగించటానికి అతడు యూరప్ కి బయలుదేరాడు.
 
కానీ అక్కడ కూడా చుక్కెదురైంది. బ్రిటన్ లో కుక్-వీట్‍స్టన్ పద్ధతి ని ప్రవేశ పెట్టారు. ఫ్రాన్స్ అనుమతి ఇచ్చింది గానీ పని సజావుగా జరగడానికి వీలుచేనన్ని కఠిన షరతులను విధించింది. రష్యా ప్రభుత్వ ఛాన్సలర్స్ తో టెలిగ్రాఫ్ సౌకర్యాలు కల్పించటానికి మోర్స్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. కానీ ఈ విషయం నికోలన్ చక్రవర్తికి తెలియగానే ఒప్పందం ప్రతిని చించివేసి గావు కేక పెట్టాడు. --"టెలిగ్రాఫ్ స్తంభాలను నాటడమే ఆలస్యం, రాజభక్తులు వాటిని పడగొడతారు. ఆ తీగల్లో ఏదో దెయ్యం వుందన్న కారణం కావచ్చు, లేదా వంట కట్టెలు కోసం కావచ్చు."---
 
మోర్స్ అమెరికాకి తిరిగొచ్చేసరికి ఆర్థిక సంక్షోభం మొదలైంది. తపాలాశాఖ అధ్యక్షుని కోరికపై బిల్లు కాంగ్రెస్ లో వీగిపోయింది. మోర్స్ ప్రతిపాదించిన కొత్త ముసాయిదాను కాంగ్రెస్ తిరస్కరించింది. తనకు చేదోడు వాదోడుగా, నమ్మిన బంటుగా వుంటూ వచ్చిన ఆల్‍ఫ్రెడ్ కూడా టెలిగ్రాఫ్ ని గురించి తల బద్దలు కొట్తుకోకుండా చిత్రలేఖనంతో సరిపెట్టుకోవాలని మోర్స్ కి సలహా యిచ్చాడు. ఏళ్ళు గడిచిపోయాయి. హతాడుడైన మోర్స్ తుది అభ్యర్థనగా కాంగ్రెస్ కి ఇలా నివేదించాడు. --- "సంతృప్తి కరమైన జవాబు రాకపోతే టెలిగ్రాఫ్ ని శాశ్వతంగా వదిలేసి శాశ్వతంగా బొమ్మలు గీసుకుంటూ కాలం గడుపుతాను." ---
 
కట్ట కడపటికి 1843 మార్చి లో మోర్స్ బిల్లు కాంగ్రెస్ లో ప్రతిపాదించబడినది. సమావేశం బహు నాటకీయంగా మరుసటి రోజు తెల్లవారు జాముదాకా జరిగింది. కాంగ్రెస్ లో జరుగుతున్న వాదోప వాదాలను గ్యాలరీ లో కూర్చొని వింటున్న మోర్స్ కి బిల్లు వీగిపోయే సూచనలు కనబడగానే అర్థరాత్రి రైలులో న్యూయార్క్ కి వెళ్ళిపోయాడు. అక్కడి కెళ్ళే సరికి అతని వద్ద 27 సెంట్లు మాత్రమె మిగిలాయి. మరుసటి రోజు ఏకాంతంగా గదిలో కూర్చున్న మోర్స్ దగ్గరికి ఓ మిత్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. "89-83 ఓట్లతో బిల్లు ఆమోదించబడింది. నీవు గెలిచావు."
==మోర్స్ టెలిగ్రాఫ్ ప్రారంభం==
వాషింగ్టన్, బాల్డిమోర్ మధ్య పని వెంటనే ప్రారంభమైంది. ఓ ప్రముఖ వాణిజ్య సంస్థ ప్రతినిధి, ఎజ్రా కార్నెల్ రాగితీగలను సరఫరా చేశాడు.(కొన్నేళ్ళ తరువాత బాగాడబ్బు సంపాదించి తన జన్మస్థలంలో కార్నెల్ విశ్వవిద్యాలయం స్థాపించాడు) తపాలా శాఖ అధ్యక్షుడు శక్తి వంచన లేకుండా అనేక అంతరాయాలు కలిగించాడు. అతని మనుషులు రాత్రిపూట తీగలు తుంచివేసేవారు. నాటిన స్థంభాలను పడగొట్టేవారు. పనిచేస్తున్న కార్మికులను బెదిరించటానికి గాలిలో కాల్పులు జరిపేవారు. ఈ విధ్వంసక చర్యలను ఎదుర్కోవటానికి మోర్స్, వైల్ ఇద్దరూ రంగంలోకి దిగారు. విధ్వంశకాండకు కారకులైన వాళ్ళపై ఋజువులతో సహా అమెరికా అధ్యక్షునికి వినతి పత్రం సమర్పించారు. ఫలితంగా తపాలా శాఖ అధ్యక్షుడు రాజీనామా చేశాడు.
 
1844 [[మే 24]] వ తేదీన "భగవంతుడు ఏం చేశాడు"(What hath god wrought) అనే సందేశం టెలిగ్రాఫ్ ద్వారా ప్రసారమైనది. కానీ సామాన్య ప్రజలు దీన్ని పట్టించుకోలేదు. ఇంగ్లండ్ లో జరిగినట్టుగానే కాకతాళీయంగా జరిగిన ఓ చిన్న సంఘటన వల్ల టెలిగ్రాఫ్ అమాంతంగా ప్రచారంలోకి వచ్చింది. అధ్యక్ష పదవికి అభ్యర్థులను నిర్ణయించటం కోసం డమాక్రటిస్ పార్టీ బాల్టిమోర్ లో సమావేశం ఏర్పాటు చేసింది. అమెరికా 11 వ అధ్యక్షుడుగా పోటీ చేయడానికి జేమ్స్ నాక్స్ పోక్‍నీ,ఉపాధ్యక్ష అభ్యర్థిగా సిలాన్ రైట్ నీ సమావేశం ఎన్నుకుంది. ఈ వార్తను వైల్ టెలిగ్రాఫ్ ద్వారా వాషింగ్టన్ కు చేరవేసే సరికి రైట్ కాంగ్రెస్ సభ చర్చల్లో పాల్గొంటున్నాడు. మోర్స్ స్వయంగా సందేశాన్ని రైట్ కి అందించాడు. పోటీలో పాల్గొనటం తనకిష్టం లేదని రైట్ ప్రకటించగానే మోర్స్ ఈ సమాచారాన్ని బాల్టిమోర్ కి పంపించాడు. ఉపాధ్యక్ష పదవికి రైట్ ని ఆమోదించి అరగంట గడవక ముందే అతడు అంగీకరించడం లేదన్న వార్తను డెమోక్రాటిక్ పార్టీ సమావేశం లో ప్రకటించేసరికి అందరూ దిగ్భ్రాంతులయ్యారు. వార్తను నమ్మలేక సతమతమవుతున్న సందర్భంలో వాషింగ్టన్ నుంచి పార్టీ ప్రత్యేక దూత వచ్చి రైట్ తిరస్కృతిని అధికారికంగా తెలియజేశాడు. దీంతో మోర్స్ కనుగొన్న టెలిగ్రాఫ్ సాధనానికి అనన్య ప్రచారం లభించింది. పన్నెండేళ్ళ నిరంతర కృషి, నిరాశా నిస్పృహలు, యాతనలు ముగిశాయి. అతని కీర్తి నలుదిశలా వ్యాపించింది. డాష్, డాట్ లతో కూడిన కొత్త టెలిగ్రాఫ్ భాష జైత్ర యాత్రకు బయలుదేరింది.
==మహా సముద్రాలలో టెలిగ్రాఫ్ తీగలు==
[[File:1891 Telegraph Lines.jpg|right|thumb|333px|Major telegraph lines in 1891]]
అనేక యూరప్ దేశాలు మోర్స్ టెలిగ్రాఫ్ విధానాన్ని ఆమోదించాయి. హాంబర్గ్, కక్స్ హావన్ మధ్య తొలిసారిగా 1848 లో టెలిగ్రాఫ్ సౌకర్యం కల్పించబడింది. మూదేళ్ళ తరువాత ఇంగ్లీషు ఛానెల్ లో టెలిగ్రాఫ్ తీగలు అమర్చ బడ్డాయి. 1858 లో ఇంగ్లండ్ శాస్త్రవేత్త లార్డ్ కెల్విన్ అధ్వర్యంలో [[బ్రిటన్]], [[అమెరికా]] దేశాల మధ్య టెలిగ్రాఫ్ సంబంధాలు నెలకొల్పబడ్డాయి. 1872 లో మోర్స్ చనిపోయే నాటికి ప్రపంచమంతటా టెలిగ్రాఫ్ సౌకర్యం విస్తరిల్లింది. అతడు సృషించిన కొత్త భాష అనేక దేశాల టెలిగ్రాఫ్ కార్యాలయాల్లో ప్రతిధ్వనించసాగింది.
==టెలిగ్రాఫ్ వ్యవస్థలో మార్పులు==
మోర్స్ విధానాన్ని [[అమెరికా]] లో [[థామస్ అల్వా ఎడిసన్]], [[జర్మనీ]] లో [[వెర్నర్ సీమెన్స్]], [[ఇంగ్లండ్]] లోఅయన సోదరుడు విల్లియం మెరుగుపరచారు. అతని మరో సోదరుడు కార్ల్ కృషి వల్ల [[రష్యా]] లో టెలిగ్రాఫ్ పట్ల వుండే అపోహలు వైదొలిగాయి. సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తమ రాజభవనానికి మాత్రం టెలిగ్రాఫ్ సౌకర్యాన్ని కల్పించడానికి జార అనుమతి ఇచ్చాడు. కానీ తీగలు బయటి నుంచి ఎవరికీ కనబడరాదన్న షరతును విధించాడు. [[కార్ల్ సీమెన్స్]] అతని అభీష్టం మేరకు నీటి గొట్టాల పక్క న తీగ అమర్చాడు. దీంతో ప్రభావితుడైన జార్ రష్యా అంతటా టెలిగ్రాఫ్ తీగల ఏర్పాటుకు అంగీకరించాడు.
 
లండన్ లో జన్మించిన డేవిడ్ ఎడ్వర్డ్ హగ్స్ అనే సంగీత శాస్త్రజ్ఞుడు మోర్స్ కోడ్ తో నిమిత్తం లేకుండా అక్షరాలను, అంకెలను నేరుగా ప్రసారం చేయగలిగిన టెలిగ్రాఫ్ యంత్రాన్ని నిర్మించాడు. పియానో లో ఉన్నట్టుగా ఇందులో ఒక కీ బోర్డు ఉంటుంది. 52 కీ.లు ఉంటాయి. ఒక్కొక్క కీని అదిమినపుడు దానికి అనుగుణంగా ఉండే అక్షరం అవతలి పట్టణంలో ముద్రించబడుతుంది. ప్రస్తుతం మనం విస్తృతంగా వాడుతున్న టెలిప్రింటర్ ఈ సాధనం నుండే తయారుచేయబడినది.
 
విద్యుత్ టైప్‍రైటర్ లాగ కనిపించే టెలిప్రింటర్ ఒక్కొక్క సంకేతాన్ని సమాన కాలవ్యవధులలు ఉండే ఐదు విద్యుత్ స్పందనాల రూపంలో ప్రసారం చేస్తుంది. ఈ స్పందనాల సముదాయాన్ని రిసీవర్ టైప్ రైటర్ అక్షరాలుగా మార్చి టైప్ చేస్తుంది. అనేక దేశాల్లో పాత నమూనా టెలిగ్రాఫ్ యంత్రాల స్థానే టెలిప్రింటర్ లు వచ్చాయి. టెలిఫోన్ లాగ మనకు కావలసిన సంఖ్యను డయల్ చేసి సందేశాలను టెలిప్రింటర్ ద్వారా పంపడానికి ఇప్పుడు వీలవుతోంది.
 
నాగరికత అభివృద్ధి చెందటంలో టెలిగ్రాఫ్ ఎలాంటి కీలక పాత్ర ధరించిందో, జీవిత విధానం లో ఎలాంటి మూలభూతమైన మార్పులు తీసుకొచ్చిందో ఇదంతా మానవ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. దీని కారణంగా సువిశాల ప్రపంచం కుంచించుకు పోయింది. వార్తలు క్షణాల్లో ప్రపంచం నలుమూలలా వ్యాపిస్తోంది. కాలం, దూరం, అత్యల్పమై పోయాయి. మంచికో, చెడ్డకో ప్రపంచ దేశాలన్నీ టెలిగ్రాఫ్ తీగలతోనూ, కేబుల్స్ తోను అవినాభావంగా బంధించబడ్డాయి.
==వైర్‍లెస్ టెలిగ్రాఫ్==
[[Nikola Tesla]] and other scientists and inventors showed the usefulness of [[wireless telegraphy]], radiotelegraphy, or [[radio]], beginning in the 1890s. [[Alexander Stepanovich Popov]] demonstrated to the public his [[receiver (radio)|wireless radio receiver]], which was also used as a lightning [[detector]],<ref>{{cite book
|title=Radar Origins Worldwide: History of Its Evolution in 13 Nations Through World War II
|edition=
|first1=Raymond C.
|last1=Watson Jr.
|publisher=Trafford Publishing
|year=2009
|isbn=1-4269-2110-1
|url=http://books.google.com/books?id=Zup4V2wSZtMC}}, [http://books.google.com/books?id=Zup4V2wSZtMC&pg=PA278 Extract of page 278]
</ref> on May 7, 1895. He proudly demonstrated his wireless receiver before a group of reporters on a stormy August evening in 1895. It was attached to a long 30-foot pole that he held aloft to maximize the signal. When asked by one of the reporters if it was a good idea to hold this metal rod in the middle of a storm he replied that all was well. After being struck (and nearly killed) by a bolt of lightning he proudly announced to the world that his invention also served as a "lightning detector".
 
[[Albert Turpain]] sent and received his first radio signal, using Morse code, in [[France]], up to 25 meters in 1895.<ref name="dspt">{{cite web |url=http://dspt.club.fr/TURPAIN.htm|title=Raconte-moi la radio: Albert TURPAIN|accessdate=2009-05-07|work=Pierre Dessapt}}</ref>
 
[[File:Post Office Engineers.jpg|thumb|Post Office Engineers inspect [[Marconi Company|Marconi]]'s equipment on Flat Holm, May 1897]]
 
[[Guglielmo Marconi]] sent and received his first radio [[Wiktionary:signal|signal]] in [[Italy]] up to 6 kilometres in 1896. On 13 May 1897, Marconi, assisted by George Kemp, a [[Cardiff]] Post Office engineer, transmitted the first [[wireless]] signals over water to [[Lavernock]] (near [[Penarth]] in [[Wales]]) from [[Flat Holm]].<ref>{{cite web |url=http://www.bbc.co.uk/wales/southeast/sites/flatholm/pages/marconi.shtml |title=Marconi: Radio Pioneer |accessdate=2008-04-12 |work=BBC South East Wales }}</ref> Having failed to interest the [[Italy|Italian]] government, the 22-year-old inventor brought his telegraphy system to Britain and met [[William Preece]], a Welshman, who was a major figure in the field and Chief Engineer of the [[General Post Office]]. A pair of masts about {{convert|34|m|ft|0}} high were erected, at Lavernock Point and on Flat Holm. The receiving mast at Lavernock Point was a {{convert|30|m|ft|0|adj=on}} high pole topped with a cylindrical cap of zinc connected to a detector with insulated copper wire. At Flat Holm the sending equipment included a [[Ruhmkorff coil]] with an eight-cell battery. The first trial on 11 and 12 May failed but on the 13th the mast at Lavernock was extended to {{convert|50|m|ft|0}} and the signals, in Morse code, were received clearly. The message sent was "ARE YOU READY"; the Morse slip signed by Marconi and Kemp is now in the [[National Museum of Wales]].
 
In 1898 Popov accomplished successful experiments of wireless communication between a naval base and a [[Pre-dreadnought|battleship]].
 
In 1900 the crew of the Russian coast defense ship ''General-Admiral Graf Apraksin'' as well as stranded Finnish fishermen were saved in the [[Gulf of Finland]] because of exchange of distress telegrams between two radiostations, located at [[Suursaari|Hogland island]] and inside a Russian [[naval base]] in [[Kotka]]. Both stations of wireless telegraphy were built under Popov's instructions.
 
In 1901, Marconi radiotelegraphed the letter "S" across the [[Atlantic Ocean]] from his station in [[Poldhu|Poldhu, Cornwall]] to [[Signal Hill, Newfoundland and Labrador|St. John's, Newfoundland]].
 
Radiotelegraphy proved effective for rescue work in sea [[disaster]]s by enabling effective communication between ships and from ship to shore.
 
==యివి కూడా చూడండి==
* [[టెలిఫోన్]]
* [[టెలి ప్రింటర్]]
 
==సూచికలు==
{{Reflist}}
"https://te.wikipedia.org/wiki/తంతి" నుండి వెలికితీశారు