అనువాదం: కూర్పుల మధ్య తేడాలు

చి కాపీఎడిట్
పంక్తి 1:
'''అనువాదం''' (Translation) ఒక [[భాష]] నుండి మరొక భాషలోని [[తర్జుమా]] చేయడం. దీనిని రెండు భాషలలోనూ ప్రావీణ్యం ఉండాలి. దీనికి [[నిఘంటువు]]లు బాగా ఉపకరిస్తాయి. ఇది సాహిత్యంలో ఒక భాషలో బహుళ ప్రసిద్ధిచెందిన రచనలను ఇతర భాషలలోకి అనువాదం చేయడం వలన మంచి రచనలు అందరికీ అందుబాటులోకి వస్తాయి.
 
 
==విజ్నాన సర్వస్వము నుండి==
{{వికీకరణ}}
వైయాయికులు వేదవాక్యములను మూడు విధములుగ విభజించిరి. విధివాక్యము, అర్థవాదవాక్యము, అనువాద వాక్యములు ( ' విధ్యర్థవాదానువాద వచనవినియోగాత్ ' - గౌతమ, 2. 1. 63). విధి యనగా విధాయక మని ( ' విధిర్విధాయకః ' 2. 1. 64) గౌతమాచార్యులవారు న్యాయసూత్రము నందు జెప్పినారు. ఇట్లు చేయవలసినది యని యాఙాపించునది విధి. ' స్వారాజ్యకామో వాజపేయేన యజేత ' ( స్వర్గమును కోరువాడు వాజపేయ యఙమును జేయవలసినది ) అనునది విధివాక్యము. ఒకానొక కార్యమును స్తుతించి, లేక నిందించి, భయము కలిగించి, పూర్వచరిత వర్ణించి బోధించునట్టివాక్యము అర్థవాదవాక్య మనబడును. ' పాకకారీ పాపో భవతి ' ( పాపము చేయువాడు పాపుడైపోవును ) అనునది అర్థవాదము. ఇందు నాజ్న స్పష్టముగా నుండదు. విధివాక్యముచే జెప్పబడినదానిని మరల జెప్పుట అనువాద మనబడును. అనువాదము రెండు విధములు: శబ్దానువాదము, అర్థానువాదము. ఇదివరకు జెప్పబడిన మాటల మరల జెప్పుట శబ్దానువాదము. ఇదివరకు దెలిసిన విషయమునే మరల నన్యపదములతో జెప్పుట అర్థానువాదము. ' అనువాదే చరణానాం ' (2.4.3) అను పాణినీయసూత్రముమీద టీక వ్రాయుచు గాళికాకారుడు ' ప్రమాణాంతరావగతస్యార్థస్య శబ్దేన సంకీర్తనమాత్ర మనువాదః ' అని వ్రాసియున్నాడు. వేణుప్రమాణముచే సిద్ధించినయర్థమును ( సంగతిని ) శబ్దముచే జెప్పుటమాత్రము అనువాద మనబడును. ' అగ్ని ర్హి మస్య భేషజం ' ( అగ్ని చలికి మందు ) అనునది యనువాదము. ఏల ? ప్రత్యక్షప్రమాణముచే నీసంగతి మన మెరుగుదుము. అజ్నానమును ఈవాక్య మనువదించినది.
పంక్తి 21:
===వెబ్===
:[[గూగుల్ ట్రాన్స్లేటర్ టూల్కిట్]]
==వనరులు==
*[[s:పుట:Andhravijnanasarvasvamupart21.djvu/106#అనువాదం| ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము లో వివరణ]]
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/అనువాదం" నుండి వెలికితీశారు