టెలీఫోను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
ప్రసారిణిగా,రిసీవర్ గా ఇవి సమర్థవంతంగా పనిచేయాలంటే, వీటి నిర్మాణంలో కొద్దిగా మార్పులు అవసరమని అతడు గుర్తించాడు. పీపాకు ఒకవైపున పెద్ద రంధ్రం తొలిచి దానికి అడ్డంగా జంతు సంబంధమైన పల్చని చర్మం పొరను కట్టి, దీన్ని ప్రసారిణిగా ఉపయోగించాడు. అల్లిక సూది చుట్టూ తీగలు చుట్టి ఫిడేలుకు సంధించి దీన్ని రిసీవర్ గా వాడాడు. ఒకరోజు రిసీవర్ ని తరగతి గదిలో వుంచి, వర్క్ షాపు లో ఉన్న ప్రసారిణి ముందు నిలబడి సంగీత వాద్యాలను వాయిస్తూ చర్మం పొర ముందు గానం చేశాడు. తరగతిలో కూర్చున్న పిల్లలకు రిసీవర్ నుంచి కొన్ని అస్పష్ట శబ్దాలు వినబడ్డాయి.
 
1861 అక్టోబర్ లో ఫ్రాంక్ ఫర్డు భౌతిక శాస్త్ర సంఘం అధ్వర్యంలో విజ్ఞాన శాస్త్రజ్ఞుల ముందు తన పరికరాన్ని ప్రదర్శించి ఫిలిప్ రీన్ ఉపన్యసించాడు. "<big>'''విద్యుత్ ద్వారా టెలీఫోన్" అనే అంశం పై మాట్లాడుతూ అతను ఇలా చెప్పాడు. --"'''ఏ శబ్దమైనా మన చెవిలో కంపనాలు సృష్టిస్తుంది. వీటిని గ్రాఫ్ ద్వారా సూచించవచ్చు. ఈ కంపనాలను కృత్రిమ పద్ధతుల్లో సృష్టించగలిగితే, అవి మనకు సహజ శబ్దాల లాగే వినబడతాయి'''</big>." వుపన్యాసం, ప్రయోగ ప్రదర్శన సవ్యంగానే జరిగాయి. ఇది సంచలనాత్మకంగా ఉంటుందని వూహించిన రీన్ కి నిరాశ కలిగింది. అల్లిక సూది నుంచి వెలువడిన శబ్దాలను విన్న మేధావులు అందరూ కేవలం మందహాసం ప్రదర్శించి ఇళ్ళకు వెళ్ళి పోయారు. Annals of the physical society పత్రికలో మాత్రం ఓ చిన్న నివేదిక ముద్రించబడినది. టెలీఫోన్ కేవలం అతి సాధారణమైన ఓ పరికరమని అందులో రాయబడింది. ఉత్సాహ వంతులైన కొందరు యువకులు మాత్రం ఆ పరికరం నమూనాలు కావాలని అడిగారు.
 
వుపన్యాసం, ప్రయోగ ప్రదర్శన సవ్యంగానే జరిగాయి. ఇది సంచలనాత్మకంగా ఉంటుందని వూహించిన రీన్ కి నిరాశ కలిగింది. అల్లిక సూది నుంచి వెలువడిన శబ్దాలను విన్న మేధావులు అందరూ కేవలం మందహాసం ప్రదర్శించి ఇళ్ళకు వెళ్ళి పోయారు. Annals of the physical society పత్రికలో మాత్రం ఓ చిన్న నివేదిక ముద్రించబడినది. టెలీఫోన్ కేవలం అతి సాధారణమైన ఓ పరికరమని అందులో రాయబడింది. ఉత్సాహ వంతులైన కొందరు యువకులు మాత్రం ఆ పరికరం నమూనాలు కావాలని అడిగారు.
 
సుమారు రెండేళ్ళ తరువాత "చిన్న పిల్లలకో ఆట బొమ్మ" అనే శీర్షిక కింద టెలిఫోన్ ని ఎలా నిర్మించాలో ప్రఖ్యాత జర్మన్ పత్రిక డీ గార్టన్ లాబ్ వివరించింది. మరో సంవత్సరం గడిచాక గీసెన్ నగరంలో నెచురల్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు రీన్ తన పరికరాన్ని అక్కడ ప్రదర్శించాడు. ప్రేక్షకుల్లోని కొందరు యువ శాస్త్రజులు అతణ్ణి ప్రశంసించారు. ఈ సమావేశంలో కొంత ప్రచారం లభించాక Annala of the physical society పత్రిక టెలిఫోన్ పై ఓ వ్యాసం రాయాలని రీన్ ని కోరింది. "సమయం మించిపోయింది. మీ పత్రికలో ప్రచురించకపోయినా నా పరికరానికి ప్రపంచమంతటా ప్రచారం లభిస్తుంది."-- అని రీన్ ప్రత్యుత్తరం వ్రాశాడు.
సమయం నిజంగానే మించిపోయింది. కొన్నాళ్ళకు అతని ఆరోగ్యం దెబ్బతింది. జబ్బుతో చాలా కాలం బాధపడ్డాడు తన పరికరంతో దేశదేశాల్లో ప్రతిధ్వనింప జేయాలనుకున్న కంఠధ్వని హరించుకుపోయింది. "నేను ప్రపంచానికో కొత్త పరికరాన్ని సమర్పించాను. దాన్ని మెరుగు పరిచే బాద్యత ఇతరులపైనా ఉంది." అని చనిపోయే ముందు మితృని చెలిలో చెప్పాడట రీన్. చనిపోయే నాటికి అతని వయస్సు 40 ఏళ్ళు మాత్రమే.
 
 
"https://te.wikipedia.org/wiki/టెలీఫోను" నుండి వెలికితీశారు