టెలీఫోను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
సుమారు రెండేళ్ళ తరువాత "చిన్న పిల్లలకో ఆట బొమ్మ" అనే శీర్షిక కింద టెలిఫోన్ ని ఎలా నిర్మించాలో ప్రఖ్యాత జర్మన్ పత్రిక డీ గార్టన్ లాబ్ వివరించింది. మరో సంవత్సరం గడిచాక గీసెన్ నగరంలో నెచురల్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు రీన్ తన పరికరాన్ని అక్కడ ప్రదర్శించాడు. ప్రేక్షకుల్లోని కొందరు యువ శాస్త్రజులు అతణ్ణి ప్రశంసించారు. ఈ సమావేశంలో కొంత ప్రచారం లభించాక Annala of the physical society పత్రిక టెలిఫోన్ పై ఓ వ్యాసం రాయాలని రీన్ ని కోరింది. "సమయం మించిపోయింది. మీ పత్రికలో ప్రచురించకపోయినా నా పరికరానికి ప్రపంచమంతటా ప్రచారం లభిస్తుంది."-- అని రీన్ ప్రత్యుత్తరం వ్రాశాడు.
సమయం నిజంగానే మించిపోయింది. కొన్నాళ్ళకు అతని ఆరోగ్యం దెబ్బతింది. జబ్బుతో చాలా కాలం బాధపడ్డాడు తన పరికరంతో దేశదేశాల్లో ప్రతిధ్వనింప జేయాలనుకున్న కంఠధ్వని హరించుకుపోయింది. "నేను ప్రపంచానికో కొత్త పరికరాన్ని సమర్పించాను. దాన్ని మెరుగు పరిచే బాద్యత ఇతరులపైనా ఉంది." అని చనిపోయే ముందు మితృని చెలిలో చెప్పాడట రీన్. చనిపోయే నాటికి అతని వయస్సు 40 ఏళ్ళు మాత్రమే.
==గ్రాహ్ంబెల్గ్రాహంబెల్ యొక్క టెలీఫోన్==
రీన్ తయారుచేసిన ఓ టెలిఫోన్ పరికరం ఎలాగో ఎడింబ్రా విశ్వవిద్యాలయ్ం చేరింది. 1862-63 లో అక్కడ చదువుతున్న అలెగ్జాండర్ గ్రాహంబెల్ ఈ పరికరాన్ని శ్రద్ధగా పరిశీలించాడు. చెవిటి,మూగవాళ్ళకు మాట్లాడటంలో శిక్షణ ఇవ్వాలని అతడెంతో కృషి చేశాడు. ఈ సందర్భంగా ఒకసారి అతడు లండన్ కెళ్ళి వీట్‍స్టన్ తో మాట్లాడటం జరిగింది. విద్యుదయస్కాంతత్వం ద్వారా శ్రుతి దండాలను శబ్దించేలా హెల్ం హోల్ట్ జ్ అనే జర్మన్ శాస్త్రజ్ఞుడు చేయగలిగాడని అయని వల్ల తెలిసింది.
 
కొంత కాలానికి అతడు బోస్టన్ లో చెవిటి, మూగ శిక్షణాలయంలో వుపాధ్యాయునిగా చేరాడు. తీరిక దొరికినప్పుడల్లా అతడు రీన్ పరికరంతో ఏవో ప్రయోగాలు చేస్తుండేవాడు. అదే స్కూల్లో జదువుకుంటున్న ఓ అందమైన చెవిటి అమ్మాయితో అతని వివాహం నిశ్చయమైంది. కాబోయే మామ ప్రయోగాలకు కావలసిన డబ్బును సమకూర్చి పెట్టాడు.
 
లోహపు తీగ చుట్టబడిన ఒక శాశ్వత అయస్కాంతం దగ్గర పల్చని ఇనుప రేకును కంపింపజేస్తే, కంపనాల తీవ్రత కు అనుగుణంగా తీగలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతున్నట్లు బెల్ కనుగొన్నాడు. శబ్దాన్ని ప్రసారం చేయటానికి ఈ సిద్ధంతం బాగా ఉపకరిస్తుందని అతడు గ్రహించాడు. ధామస్ వాట్సన్ అనే మెకానిక్ తో బాటు దీనికి సంబంధించిన ప్రయోగాలు చేసుకుంటూ అతడు పచ్చిక బయళ్ళలో, మైదానాల్లో, బీడు భూముల్లో తిరుగుతుండేవాడు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అపజయం అడుగడుగునా వెక్కిరించసాగింది. వెన్ను తట్టి ప్రోత్సహించేవారు కరువయ్యారు. ఎటు చూసినా నిరాశా నిస్పృహలే తారసిల్లాయి. టెలిఫోన్ ద్వారా నోటిమాటల్ని దూర ప్రదేశాలకు అందించే కృషి చేస్తున్నానని చెబితే నలుగురు నవ్విపోతారేమో అని భయపడుతూ అజ్ఞాతంగా కాలం గడిపేవాడు. కాబోయే మామ కూడా ఇది అంతా ఒక పగటి కల అని కొట్టి పారేశాడు.
 
1875 జూన్ లో ఒకరోజు వర్క్ షాప్ కి ఇటూ, అటూ ఉన్న రెండు గదుల్లో ప్రసారిణి, రిసీవర్ లను వుంచి వెల్, వాట్సన్ ప్రయోగాలు చేస్తుండగా ఒకదాని ఇనుపరేకు అయస్కాంతానికి అతుక్కుపోయింది. దాన్ని లాగాలని వాట్సన్ ప్రయత్నించినపుడు బెల్ వద్ద వున్న ఇనుపరేకు కూడా కంపించసాగింది. ఇనుపరేకు దగ్గర చెవి ఉంచగా శబ్దం కూడా వినబడింది. ఇక ఆ రొజల్ల ఒక పక్క ఇనుపరేకును అయస్కాంతానికి చాలా దగ్గరగా ఉంటే ప్రయోగ ఫలితాలు సంతృప్తి కరంగా ఉంటాయని వాళ్ళూ గ్రహించారు. ఇలా కొన్ని నెలలు కృషి చేశాక మొదటి పటిష్టమైన టెలిఫోన్ నిర్మించారు. బాటరీ అవసరంలేకుండా ప్రసారిణిలో ఉత్పత్తి అయ్యే అల్ప విద్యుత్ వల్లనే ఇది పనిచేయసాగింది. ఈ టెలిఫోన్ ప్రసారిణి బెల్ ఇంటి రెండో అంతస్తులోనూ, రిసీవర్ ని మొదటి అంతస్తులోనూ, అమర్చి బెల్ ఫోన్ లో ఇలా మాట్లాడాడు.---"మిస్టర్ వాట్సన్, మీతో పనుంది, పైకి రండి" ---. ఫోన్ లో మాట్లాదిన తొలిపలుకులుగా ఈ పదాలు ప్రసిద్ధి కెక్కాయి. ఒకటి రెండు నిముషాల్లో మెట్లెక్కి రొప్పుతూ, రోజుతూ వాట్సన్ బెల్ వద్దకు పరుగెత్తి వచ్చి "ఫోన్ పనిచేస్తుంది. మీ మాటలు నాకు వినబడ్డాయి." -- అని అరిచాడు.
 
== అన్ని సెల్‌ఫోన్లకు ఒకే [[ఛార్జర్]] ==
"https://te.wikipedia.org/wiki/టెలీఫోను" నుండి వెలికితీశారు