టెలీఫోను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
 
ఇలాంటి చేదు అనుభవాలె అమెరికా ఆల్మన్ స్ట్రోగర్ కి అనేక సార్లు కలిగాయి. ఆపరేటర్ లతో గొడవలు పడి, విసిగి వేసారి తుదకు తానే ఆటోమాటిక్ టెలిఫోన్ ఎక్స్ చేంజ్ ని 1889 లో నిర్మించి కన్సాన్ నగరం ఆఫీసులో అమర్చాడు. ఇది పని చేయడానికి ఆపరేటర్ల అవసరం వుండదు. కానీ ఇదివరకు వాడుకలో ఉండే యంత్రాలు నిరుపయోగమవుతాయని, ఆటోమాటిక్ యంత్రాల కొనుగోలుకై మరీ ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి వస్తుందనీ టెలిఫోన్ కంపెనీలు కొత్త పద్దతిని అమలుచేయలేదు.
===ఆటోమాటిక్ స్విచ్ బోర్డు===
 
తొలిసారిగా ఆటోమాటిక్ స్విచ్ బోర్డు ఇండియానా రాష్ట్రంలో లాపోర్ట్ నగరంలో 1892 లో ప్రవేశపెట్టబడింది. ఒక సంవత్సరం తరువాత చికాగో ఎగ్జిబిషన్ లో దీన్ని ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో టెలిఫోన్ శాఖ పనిచేసే జర్మన్ దేశంలో ఈ పద్ధతిని 1909 లో ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో టెలిఫోన్ తో బాటు సున్న నుంది 9 వరకు సంఖ్యలు రాసిన రంధ్రాలు ఉంటాయి. ఈ డయల్ సహాయంతో వినియోగదారులు కావలసిన టెలిఫోన్ సంబంధాన్ని నేరుగా పొందటానికి అవకాశం ఉంటుంది.
===వివిధ పద్ధతులు===
డయల్ పద్ధతిలో మనకు కావల్సిన వినియోగదారుతో నేరుగా మాట్లాడే సిద్ధాంతాన్ని రూపొందించినవాడు స్ట్రోగర్. టెలిఫోన్ వాడకంలో యితర పద్ధతులు కూడా ఉన్నాయి. అమెరికా లో వాడుతున్న పానల్ పద్ధతి, వెల్ కంపెనీ తయారుచేసిన కాల్ బార్ పద్ధతి, రోటరీ పద్ధతి, ఆధునిక ఎలక్ట్రానిక్ పద్ధతి వగైరా. ఎలక్ట్రానిక్ పద్ధతిలో అయితే మనకు కావలసిన కనెక్షన్ 0.002 సెకనులో లభ్యమవుతుంది. తరచుగా మనం ఉపయోగించే టెలిఫోన్ వినియోగాదార్లతో కనెక్షన్ కావాలంటే 6 లేదా 7 అంకెలను చేయనవసరం లేకుండా కేవలం రెండు అంకెలతోనే సాధ్యమవుతుంది. వలయంలో ఎక్కడైనా దోషం ఏర్పడితే మరోవలయం తానంతట తానుగా పనిచేయడం ప్రారంభమవుతుంది. ఎలక్ట్రానిక్ ఎక్స్ ఛేంజ్ లో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
 
== అన్ని సెల్‌ఫోన్లకు ఒకే [[ఛార్జర్]] ==
"https://te.wikipedia.org/wiki/టెలీఫోను" నుండి వెలికితీశారు