కృష్ణకుమారి (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
 
1963లో [[లక్షాధికారి]], [[బందిపోటు]], [[ఎదురీత]], [[కానిస్టేబుల్ కూతురు]] చిత్రాల్లో వైవిధ్యం ఉన్న పాత్రలు వేశారు. ప్రభుత్వ బహుమతి పొందిన జగపతీ పిక్చర్స్ వారి [[అంతస్థులు]] లో నాయికగా నటించారు. 1967-68 మధ్యకాలంలో ఉమ్మడి కుటుంబం, భువనసుందరి కథ, రహస్యం, చిక్కడు దొరకడు, స్త్రీ జన్మ వంటి చిత్రాలలో వైవిధ్యమున్న పాత్రలు పోషించారు. [[వరకట్నం]] లో నాయికగా గ్లామరస్ పాత్ర తర్వాత చిత్రాలు తగ్గి 1970 దశాబ్దంలో కొన్ని చిత్రాలలో నటించగలిగారు.
 
మొత్తంగా సుమారు రెండు దశాబ్దాల నటజీవితంలో ఈమె సుమారు 110 సినిమాలలో నటించింది. వీనిలో ఎక్కువగా తెలుగు సినిమాలైతే, 15 కన్నడ చిత్రాలు మరియు కొన్ని తమిళ భాషా చిత్రాలు. ఈమె ఆనాటి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, జగ్గయ్య, హరనాథ్, అందరు మహానటులతోను నటించి మెప్పించింది.
 
===వ్యక్తిగత విషయాలు===
ఈమెకు చిన్నప్పటినుండి [[భానుమతి రామకృష్ణ|భానుమతి]] అంటే భలే ఇష్టం. అందువలన ఆమెతో కలిసి కులగోత్రాలు, పుణ్యవతి సినిమాల్లో నటించినప్పుడు ఎంతో థ్రిల్ ఫీలయ్యారు. మహానటి [[సావిత్రి (నటి)|సావిత్రి]] ఈమెను స్వంత చెల్లెల్లా చూసుకొనేది.
 
ఈమెది ఒక రకంగా ప్రేమ వివాహము. ఈమె భర్త అజయ్ మోహన్ వ్యాపారవేత్త. అతని కుటుంబం వారు రాజస్థానీయులు. స్నేహితుల ద్వారా పరిచయమై అది 1969లో వివాహబంధంగా మారింది. వ్యాపారరీత్యా భర్త బెంగుళూరులో ఉండగా ఈమె కూడా మద్రాసు వీడి బెంగుళూరులో మకాం పెట్టారు.
 
==నటించిన కొన్ని సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/కృష్ణకుమారి_(నటి)" నుండి వెలికితీశారు