కృష్ణకుమారి (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
ఈమెకు చిన్నప్పటినుండి [[భానుమతి రామకృష్ణ|భానుమతి]] అంటే భలే ఇష్టం. అందువలన ఆమెతో కలిసి కులగోత్రాలు, పుణ్యవతి సినిమాల్లో నటించినప్పుడు ఎంతో థ్రిల్ ఫీలయ్యారు. మహానటి [[సావిత్రి (నటి)|సావిత్రి]] ఈమెను స్వంత చెల్లెల్లా చూసుకొనేది.
 
ఈమెది ఒక రకంగా ప్రేమ వివాహము. ఈమె భర్త అజయ్ మోహన్ వ్యాపారవేత్త. అతని కుటుంబం వారు రాజస్థానీయులు. స్నేహితుల ద్వారా పరిచయమై అది 1969లో వివాహబంధంగా మారింది. వ్యాపారరీత్యా భర్త బెంగుళూరులో ఉండగా ఈమె కూడా మద్రాసు వీడి బెంగుళూరులో మకాం పెట్టారు. కొంతకాలం విరామం తర్వాత అత్తమామల ప్రొత్సాహంతో తిరిగి నటించడం మొదలుపెట్టింది.
 
బెంగుళూరిలో వీరికి ఐదెకరాల ఎస్టేటు ఉన్నది. ప్రశాంత వాతావరణం, చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలోని అందమైన ఇంట్లో ఈమె జీవితాన్ని సుఖంగా గడుపుతున్నది. వీరికి ఒక అమ్మాయి - దీపిక. వీరి అల్లుడు విక్రం మైయా మరియు మనవడు పవన్.
 
==నటించిన కొన్ని సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/కృష్ణకుమారి_(నటి)" నుండి వెలికితీశారు