కృష్ణకుమారి (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
1963లో [[లక్షాధికారి]], [[బందిపోటు]], [[ఎదురీత]], [[కానిస్టేబుల్ కూతురు]] చిత్రాల్లో వైవిధ్యం ఉన్న పాత్రలు వేశారు. ప్రభుత్వ బహుమతి పొందిన జగపతీ పిక్చర్స్ వారి [[అంతస్థులు]] లో నాయికగా నటించారు. 1967-68 మధ్యకాలంలో ఉమ్మడి కుటుంబం, భువనసుందరి కథ, రహస్యం, చిక్కడు దొరకడు, స్త్రీ జన్మ వంటి చిత్రాలలో వైవిధ్యమున్న పాత్రలు పోషించారు. [[వరకట్నం]] లో నాయికగా గ్లామరస్ పాత్ర తర్వాత చిత్రాలు తగ్గి 1970 దశాబ్దంలో కొన్ని చిత్రాలలో నటించగలిగారు.
 
మొత్తంగా సుమారు రెండు దశాబ్దాల నటజీవితంలో ఈమె సుమారు 110 సినిమాలలో నటించింది. వీనిలో ఎక్కువగా తెలుగు సినిమాలైతే, 15 కన్నడ చిత్రాలు మరియు కొన్ని తమిళ భాషా చిత్రాలు. ఈమె ఆనాటి [[నందమూరి తారక రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]], [[కాంతారావు]], [[కృష్ణంరాజు]], [[జగ్గయ్య]], హరనాథ్, అందరు మహానటులతోను నటించి మెప్పించింది.
 
===వ్యక్తిగత విషయాలు===
"https://te.wikipedia.org/wiki/కృష్ణకుమారి_(నటి)" నుండి వెలికితీశారు