చర్చ:తెలుగు భాషలో ఆంగ్ల పదాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
తెలుగు భాషలో కొన్ని పదాలు అంతరిస్తున్న మాట వాస్తవమే. ఏ భాష అయినా మార్పులు చెందుతూ ఉంటుంది. ఏ యంత్రాన్నైనా ఉపయోగించకపోతే అది కొన్నాళ్ళు పోయిన తర్వాత పనిచేయకుండా పోతుంది. అలాగే భాషలో అయినా పదాలు వాడకపోతే అవి కాల క్రమేణా వాడుక భాషలోంచి తొలగిపోయి కనుమరుగవుతాయి. ఇప్పటికే కొన్ని సమయల్లో నిఘంటువు చూస్తే గాని ఆంగ్ల పదాలకు తెలుగు అర్ధాలు తెలియడంలేదు. ఉదాహరణకు చిన్నప్పటినుండి ఆంగ్ల మాద్యమంలో చదివిన నాకు ఒక సంధర్భంలో 'చూస్ / చాయిస్ అను ఆంగ్ల పదానికి ఎంచుకోవడం అను తెలుగు పదం ఆన్ లైన్ నిఘంటువు చూస్తే గాని తెలియలేదు. చాలా సిగ్గు పడ్డాను. మన తల్లిదండ్రులు పూర్తి తెలుగులో మాట్లాడినా, నేడు మనం కొన్ని ఆంగ్ల పదాలు వాడుతున్నాం. రేపు మన పిల్లలు ఖచ్చితంగా మనం వాడిన పదాలనే వాడతారు. ఉదాహరణకు కూర అనే పదం బదులు కర్రీ అనే ఇంగ్లీషు పదం వచ్చింది. కూర అనే పదం వాడకపోతే అది వాడుక భాషలోంచి తొలగిపోయి క్రమేణా అంతరించవచ్చు. ఆంగ్ల విద్య దయ వల్ల ఇప్పటికే మనకు చాలా తెలుగు పదాలు తెలియడంలేదు. ఇప్పటికే తెలుగు భాషలోకి చాలా ఆంగ్ల పదాలు వచ్చి చేరిపోయాయి. సాంకేతిక పదాలకు ఏలాగూ తెలుగు పదాలుండవు కాబట్టి, అవి ఇంగ్లీషులో వాడినా పరవాలేదు. కనీసం మిగిలిన ఇంగ్లీషు పదాలకు ప్రత్యాయమ్నంగా తెలుగు పదాలు ఉంటాయికదా? ఈ కాలపు పిల్లల్లో మరియూ యువకుల్లో తెలుగు స్పష్టంగా మాట్లాడలేని, చదువలేని దారుణ పరిస్థితి ఉన్నది. ఈ విషయం పై చాలా టి.వి కార్యక్రమాలు వచ్చాయి, తెలుగు సంఘాలు ఆందోళన పడుతున్నాయి. వికీపిడియాలో వ్యాసాలను వ్రాయడానికి నేను ప్రత్యేకంగా ఒక గురువుగారి వద్ద ఎంతో కొంత తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది. తెలుగువాడినైనా అంతకు పూర్వం తెలుగు భాషలో ఎక్కువగా ఆంగ్ల పదాలే వాడేవాడిని. కనుక ఈ వ్యాసాన్ని తొలగించడం సరికాదు. కావాలంటే ఈ వ్యాసాన్ని అభివృద్ది చేయవచ్చు.
[[సభ్యుడు:B.RameshRaju|<font style="background:yellow;color:blue;"> భూపతిరాజు రమేష్ రాజు </font>]][[సభ్యులపై చర్చ:B.RameshRaju|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 20:56, 2 మార్చి 2013 (UTC)
:భూపతి గారి అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను. ఈ వ్యాసం తొలగించదగినది కాదు. దీనిని అభివృద్ది చేస్తే భవిష్యత్ తరాలకు చాలా సహాయకారిగా ఉంటుంది.--[[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] ([[వాడుకరి చర్చ:సుల్తాన్ ఖాదర్|చర్చ]]) 09:35, 5 మార్చి 2013 (UTC)
Return to "తెలుగు భాషలో ఆంగ్ల పదాలు" page.