"చర్చ:తెలుగు భాషలో ఆంగ్ల పదాలు" కూర్పుల మధ్య తేడాలు

:: దీనిని వికీకరించి బాగా అభివృద్ధి చేయవచ్చని నా అభిప్రాయం.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 09:44, 5 మార్చి 2013 (UTC)
::తెలుగు పదాలు తెలుగు వారు వాడాలి అనేది చాలా మంచి కాన్సెప్టే, కానీ దానికి వికీ వేదిక కాదు. ఇది ఒరిజినల్ రీసెర్చ్ కదా, అందుకని వికీలో ఉంచలేము. ఒరిజినల్ రీసెర్చ్ కాదనుకుంటే కనీసం ఎవరు ఈ పదాలను అంతరించి పోతున్న పదాలుగా వర్గీకరించారో ఆధారాలు ఇవ్వాలి. లేకుంటే ఇవి కేవలం మన అభిప్రాయాలే అయితే వాటికి వికీ వేదిక కాదు, బ్లాగో, లేకుంటే మరో వేదికో సరి అయినది. మరోచోట అయితే ఇది మంచి చర్చించదగిన వ్యాసం, కానీ సాంతేకికంగా వికీలో ఇటువంటి వాటికి చోటు లేదు. I home i am making sense. [[వాడుకరి:Chavakiran|Chavakiran]] ([[వాడుకరి చర్చ:Chavakiran|చర్చ]]) 12:30, 5 మార్చి 2013 (UTC)
 
== వ్యాసం పేరు మార్పు ప్రతిపాదన ==
 
===ప్రతిపాదన===
ఈ వ్యాసం పేరును "తెలుగు వారు ఉపయోగిస్తున్న ఆంగ్ల పదాలు" అనికానీ, "తెలుగు భాషలో వినియోగిస్తున్న ఆంగ్ల పదాలు" అని గానీ పెడితే బాగుండునేమో!
===కారణము===
తెలుగు భాషలో గల నిఘంటువులో అనేక పదములు మనకు తెలియదు. మనం వాటిని ఉపయోగించము. అంతమాత్రాన అవి అంతరించి పోయినట్లేనా! ఈ వ్యాసంలో సూచించిన తెలుగు పదాలు, వాటి అర్థాలు అందరికీ తెలిసినవే, ఉదాహరణకు [[అమ్మ]] అంటే తెలుగు వారికందరికీ తెలిసిన పదమే. కాని కొంతమంది వాడనంత మాత్రాన అందరూ దాని అర్థం తెలియనట్లేనా! అది అంతరించి పోయినట్లెనా! మనలో కొందరు వాడనంత మాత్రాన అవి అంతరించి పోతున్నట్లు తన స్వంత అభిప్రాయాలు ప్రకటించడం సరైనది కాదని నా అభిప్రాయం. సౌలభ్యం కోసం కొన్ని తెలుగు పదములలో అన్య భాషా పదాలు ఉపయోగించినంతమాత్రాన తెలుగు పదాలు అంతరించిపోయినట్లు రాయడం శోచనీయం. అవి అంతరించి పోతున్నట్లు ఏవైనా ఆధారాలు ఉంటే తెలియ జేయండి.
===కొన్ని తెలుగు పదములు===
ఈ క్రింది తెలుగు పదములు పరిశీలించండి
ఉదజని, ఆమ్లజని, నత్రజని, బొగ్గుపులుసు వాయువు, ఉదజహరికామ్లము, కర్బనము వంటి రసాయన పదార్థముల తెలుగు పదములు ఎవరికీ ఆర్థం కావు. కాని హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, హైడ్రోక్లోరికామ్లం, కార్బన్ అనిన చాలా మంది విద్యార్థులకు అర్థం అవుతాయి. వారికి అర్థం అయ్యే రీతిలో అర్థం చేసుకొనుటలో ఆంగ్ల పదముల వినియోగం తప్పనిసరి. అలా కాకుండా అచ్చమైన తెలుగు పదములతో రసాయన శాస్త్రము అభ్యసిస్తే తర్వాత తరగతులలో ఉన్న వివిధ అంశములు అర్థం కావు. విద్యార్థులు ఈ ఆంగ్ల పదాలు సౌలభ్యం కోసం వినియోగిస్తున్నారని తెలుగు నిఘంటువులో ఆ పదాలను తొలగించాలా! అవి అంతరించిపోయినట్లు ప్రకటించాలా! భౌతిక శాస్త్రంలో "ఉత్తేజిత కాంతి ఉద్గారం వలన కాంతివర్థకము" కాంతి అనిన ఎవరికీ అర్థం కాదు కాని "LASER" అనిన విద్యార్థులకు అర్థం అవుతుంది. కొన్ని ఆంగ్ల పదములకు తెలుగు పదములు ఉండవు. "ఎలక్ట్రాన్" "ప్రోటాన్" "పాజిట్రాన్" ఇలా అనేకమైనవి ఉన్నవి. ఇవి ఆంగ్లంలోనె చదవాలి తప్ప తెలుగు భాషాభివృద్ధి కోసం అవి చదవడం మాని వేయాలా! తెలుగు పదములు వినియోగించకపోవడం పిల్లల తల్లి దండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రభావం అని తెలియుచున్నది. వినియోగించనంత మాత్రాన అంతరిస్తున్న పదాల జాబితాగా ఏ ప్రాతిపదిక గా తయారు చేశారో తెలియ జేయాలి. దీనిపై ఏదైనా సర్వే నిర్వహించారా! ఏ పత్రికలోగాని, అంతర్జాలంలో కాని ఆధారాలు ఉన్నవా? ప్రభుత్వం వీటిని అంతరించిపోతున్న పదాలుగా ప్రకటించిందా రచయిత తెలియజేయాలి.
===జీవరాశులు అంతరించి పోవుట===
ప్రకృతిలో కొన్ని జీవరాశువు అంతరించిపోయాయి. ఉదా: డైనోసారులు వంటివి. వాటిని మనం చూడక పోయినా [[శిలాజాలు|శిలాజాల]]అధ్యయనం మూలంగా కనుగొన్నారు. దానికి ఆధారాలు ఉన్నాయి. అదే విధంగా ప్రకృతిలో పులులు, పిచ్చుకలు,రాబందులు వంటివి అంతరించిపోతున్నట్లు స్వష్టమైన ఆధారాలు ఉన్నాయి.పిచ్చుకలు మైక్రో తరంగాల మూలంగా నాశనమవుతున్నట్లు ప్రకటిస్తున్నారు. అలానే తెలుగు భాషలో వ్యాసం లో గల పదాలు అంతరిస్తూ ఉన్నట్లు ఆధారాలు చేర్చితె బాగుంటుంది లేదా వ్యాసం యొక్క పేరును [[తెలుగు భాషలో వినియోగిస్తున్న ఆంగ్ల పదాలు]] అని మార్చితే బాగుంటుంది.([[వాడుకరి:Kvr.lohith|<font style="background:#000033;color:#ccff33;">&nbsp; కె. వి. రమణ.</font>]][[సభ్యులపై చర్చ:kvr.lohith|<font style="background:#ccff33;color:#000033;"> '''చర్చ''' </font>]] 16:44, 6 మార్చి 2013 (UTC))
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/805640" నుండి వెలికితీశారు