వరాహమిహిరుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 52:
 
చంద్ర,సూర్య గ్రహణాలు రాహు,కేతువుల వల్ల కాదని భూమి మీద నీడ పడటం చేత చంద్ర గ్రహణం, చంద్రుని నీడ పడటం చేత సూర్య గ్రహణము కలుగుతున్నాయని పూర్వ ఋషులు చెప్పిన సత్యాన్ని వివరించాడు. తోకచుక్కలు వాని రకాలు గురించి తెలిపాడు.
 
అనేక సందర్భాలలో వరాహమిహిరుడు గర్గ,పరాశర, అసిత దేవతల, కశ్యప, బృగు, వసిష్ట, మను, మయ వంటి ప్రాచీన ఋషుల మతము ప్రకారము అని విడి విడిగా ప్రస్తావించటం, అంతే కాక ఇంకా ఎంతో మందిని అనుసరించి (అన్యాన్ బహున్) అని చెప్పడం వలన ఆయన పరిశీలనాత్మక దృష్టి, వినయ సంపత్తి ద్యోతకమవుటయే కాక ఆ కాలములో అవన్నియు లభించి ఉండేవని తెలుస్తుంది.
 
"దకార్గాళాధ్యాయం" లో ఎలాంటి స్థలాలలో నీరు ఎంతెంత లోతుల్లో దొరుకుతుందో వివరించాడు. మనుష్యుని శరీరంలోని రక్త నాడులలో రక్యము ప్రవహించునటుల భూమిలో గల జల నాడులలో జల ప్రవాహములు గలవని వాటిని గుర్తించటానికి భూమిపై నున్న చెట్లు పుట్టలు ఉపయోగ పడతాయని నిరూపించాడు. అనంతర కాలంలో భారతీయ శాస్త్రవేత్తలు ఎవరు వీటి మీద పరిశోధన చేసి ప్రాచుర్యములోనికి తీసుకు రాలేదు. ఈ అధ్యాయములోని విషయాలు అధారముగా ప్రస్తుతం వేగంగా పరిశోధనలు చేయుట జరుగుతుంది. భూగర్భ లోహం కనుక్కునేందుకు వరాహమిహిరుని సిద్ధాంతాలు ఉపయోగిస్తున్నారు. చెట్లు,ఆకులు పరిశీలించి వీటి అంచనాయే గాక, ఖనిజ సంపత్తిని అంచనా వేసే క్రొత్త శాస్త్రము ఈ అధ్యాయం ఆధారంగా ఉధ్బవించింది.
 
 
 
"https://te.wikipedia.org/wiki/వరాహమిహిరుడు" నుండి వెలికితీశారు