రహదారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
రహదార్ల వ్యవస్థ కోసం డబ్బు బాగానే ఖర్చు అయినప్పటికీ, ఖజానా మాత్రం ఇది పెద్ద భారంగా తోచలేదు. ఎందుకంటె యుద్ధాలు లేనప్పుదు సైనికులకు రోడ్ల నిర్మాణము కేటాయించబడినది. రోమన్ లు ఆక్రమించిన పరాయి దేశాల్లో ప్రజల చేత నిర్బంధ సేవ చేయించేవారు. ధనవంతులైన రోమన్ లు తమ ఆస్తులను రోడ్ల నిర్మాణ నిధికి విరాళంగా ఇచ్చారు. నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించటానికి సమర్థవంతమైన నిర్వాహకులను నియమించారు. సెనేట్ సభ్యుల్లో ధనికులైన వాళ్ళకు అనేక రోడ్ల నిర్మాణ, నిర్వహణ భారాన్ని అగస్టన్ చక్రవర్తి అప్పగించాదు. తాను స్వతహాగా కొన్ని రోడ్ల బాధ్యతను స్వికరించాడు కూడా. పట్టణాల్లో రహదార్ల నిర్మాణం బాధ్యత అక్కది ధనవంతులకు అప్పజెప్పారు.
 
ఇంగ్లండ్ లాంటి కొన్ని దేశాల్లో రోమన్ లు రాక పూర్వమె నాసిరకం రోడ్లు ఉండేవి. ఇలాంటి చోట వెడల్పు చేయటం, వంపులు తీసివేసి తిన్నగా వేయటం, చదును చేయడం చేశారు. గ్రామీన ప్రాంతాల్లోని పాతబడ్డ రోడ్లను అద్భుతమైన రహదార్లుగా మార్చారు.
 
ఆక్రమిత దేశాలను వదలి రోమన్ లు వెళ్ళీపోగానె, రోడ్ల ఉపయోగం తగ్గిపోవటమే కాకుండా సరైన నిర్వహణ కూడా లోపించింది. ఈ కారణంగా రోడ్లన్నీ పాడు బడ్డాయి. రోమన్ సామ్రాజ్యం అంతరించిపోగానే సుదూర రహదార్ల ఆవశ్యకత లేకుండా పోయింది. ఆ దేశాల్లో పటిష్టమైన కేంద్రాధిపత్యం లెక పోవటంతో సమర్థమైన వార్తా సౌకర్యాలు అవసరం అంతరించింది. దేశలు చిన్నాభిన్నమై, వాటి స్థానే ఏర్పడిన చిన్న రాష్ట్రాలు రోద్లు నిర్వహణను గురించి పట్టించుకోలేదు. పొరుగు దేశాల ఆక్రమణ సైన్యాల రాకపోకలను ఇవి దోహద కరంగా ఉంటాయన్న భయం కూడా దీనికి కారణం కావచ్చు. మధ్య యుగాల పూర్వార్థం కొత్తంలోనూ ఈ దేశాల్లో ఒక్క కొత్త రోడ్డు కూడా వేయలేదు. నికృష్టమైన దారుల్లో ప్రయాణం నత్తనడకలా నడిచేది. ప్రయాణికులకు ఎండా కాలంలో దుమ్ముతో ఊపిరాడక పోవటం, వర్షాకాలంలో బండ్లు బురదలో కూరుకుపోవటం జరుగుతుండేది. దారి పూర్తిగా నిరుపయోగంగా తయారయ్యాక దాన్ని వదిలి పెట్తి దాని ప్రక్కనే మరొ బాటను మలుచుకునేవారు. ఇవి ఇరుకుగానూ, లోతుగానూ తయారై వర్షా కాలంలో నీళ్ళమయమై పోగా ప్రయాణీకులు ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడేవారట!
==యూరప్ ఖండంలో రోడ్లు==
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/రహదారి" నుండి వెలికితీశారు