రహదారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
ఆక్రమిత దేశాలను వదలి రోమన్ లు వెళ్ళీపోగానె, రోడ్ల ఉపయోగం తగ్గిపోవటమే కాకుండా సరైన నిర్వహణ కూడా లోపించింది. ఈ కారణంగా రోడ్లన్నీ పాడు బడ్డాయి. రోమన్ సామ్రాజ్యం అంతరించిపోగానే సుదూర రహదార్ల ఆవశ్యకత లేకుండా పోయింది. ఆ దేశాల్లో పటిష్టమైన కేంద్రాధిపత్యం లెక పోవటంతో సమర్థమైన వార్తా సౌకర్యాలు అవసరం అంతరించింది. దేశలు చిన్నాభిన్నమై, వాటి స్థానే ఏర్పడిన చిన్న రాష్ట్రాలు రోద్లు నిర్వహణను గురించి పట్టించుకోలేదు. పొరుగు దేశాల ఆక్రమణ సైన్యాల రాకపోకలను ఇవి దోహద కరంగా ఉంటాయన్న భయం కూడా దీనికి కారణం కావచ్చు. మధ్య యుగాల పూర్వార్థం కొత్తంలోనూ ఈ దేశాల్లో ఒక్క కొత్త రోడ్డు కూడా వేయలేదు. నికృష్టమైన దారుల్లో ప్రయాణం నత్తనడకలా నడిచేది. ప్రయాణికులకు ఎండా కాలంలో దుమ్ముతో ఊపిరాడక పోవటం, వర్షాకాలంలో బండ్లు బురదలో కూరుకుపోవటం జరుగుతుండేది. దారి పూర్తిగా నిరుపయోగంగా తయారయ్యాక దాన్ని వదిలి పెట్తి దాని ప్రక్కనే మరొ బాటను మలుచుకునేవారు. ఇవి ఇరుకుగానూ, లోతుగానూ తయారై వర్షా కాలంలో నీళ్ళమయమై పోగా ప్రయాణీకులు ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడేవారట!
==యూరప్ ఖండంలో రోడ్లు==
మొత్తం యూరప్ ఖండంలోనే ఇంగ్లండ్ లోని రోడ్లు అతి నికృష్టంగా ఉండేవి. జర్మనీ లో అయితే చక్రాల బండ్లు ఉపయోగించే కొన్ని రహదార్లను అడపా దడపా అయినా మరమ్మత్తులు చేస్తూండేవారు. 13 వ శతాబ్దంలో పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి. సేక్సన్ స్వైగల్ అనే జర్మనీ దేశం శాసన నియమావళి లో రోడ్లకు సంబంధించి ఒక చట్టంలో ఇలా నిర్దేశించారు. --" వాహనాలు రెందు దిశల లోనూ వెళ్ళటానికి సరిపోయెలా రహదార్లు వెడల్పుగా ఉండాలు. గుర్రం రౌతి ఎదురైనపుడు పాదచారి పక్కకు తొలగాలి. వాహనం ఎదురైనపుదు రౌతు పక్కకు తొలగాలి."
 
ఇంగ్లండ్ రోడ్లు చాల అధ్వాన్నంగా ఉండేవి. కనుకనె రోడ్ల నిర్మాణానికి సంబంధించిన తొలి ఆధునిక ఇంజనీర్లు అక్కడే అయారయ్యారు. వారిలో మహోన్నత వ్యక్తిత్వం కలవాడు జాన్ మెట్కాఫ్. ఇతడు 1717 లో జన్మించాడు. ఆరవ ఏటనే మశూచి వ్యాధితో ఇతనికి కంటి కృష్టి పోయింది. దృష్టి లోపం ఉన్నప్పటికీ, రోడ్ల నిర్మాణం లో దిట్ట అనే ఖ్యాతిని సంపాదించుకున్నాడు. 30 ఏళ్ళ లోపుగానే లాంకషైర్, చెషైర్ ప్రాంతాల్లో 180 మైళ్ళ పొడవు గల అద్భుతమైన రహదార్లను నిర్మించాడు. ఇతదు కూడా రోమన్ల లాగే రోడ్లకు పునాదిగా రాతి గుండ్లను పరచి వాటిపై గులక రాళ్లను దట్టించేవాడు. రోమన్ వ్యవస్థ లో వీటిపై మళ్ళీ చదును బండలను పరచటం జరిగేది. కానీ ఇతడు వాటిని అలాగే ఉంచి. వర్షం నీళ్ళు ప్రవహించటానికి వీలుగా రోడ్లను ఒకవైపున కాస్త ఎత్తుగా చేసేవాడు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/రహదారి" నుండి వెలికితీశారు