రహదారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
 
ఇంగ్లండ్ లోని మధ్య, ఉత్తర రాష్ట్రాలలో పారిశ్రామికీకరణం ఎక్కువయ్యె కొద్దీ కొత్త రోడ్ల ఆవశ్యకత కూడా పెరిగింది. తన నైపుణ్యాన్ని ప్రదర్శించటానికి మెట్కాఫ్ కి ఇదొక గొప్ప అవకాశమే కానీ గుడ్దివాడు ఈ పనుల్ని నిర్వహించగలడని ప్రభుత్వాధికారులను నమ్మించటం కష్టమైంది. మరో ఇబ్బంది ఏమిటంటె ఇతడు ఫిడేలు వాయించుకుంటూ ఊరూరా తిరిగేవాడట! 1745 విప్లవం సందర్భంలో ఇతడు యుద్ధ భూమిలో కూడా ఫిడేలు వాయించాడట! ఎలాగైతేనేమి మూడు మైళ్ళ రోడ్డు నిర్మాణం బాద్యత ఇతనికి తొలిసారిగా అప్పజెప్పినపుదు ఇతని వయస్సు దాదాపు యాభై. కళ్ళున్న ఇతర ఇంజనీర్ల కంటె త్వరితంగా, సమర్థవంతంగా, చౌకగా ఇతడు ఆ రోడ్డును పూర్తి చేయగలిగాడు. అప్పటి నుంచీ ఒకదాని తరువాత ఒకటిగా ఇతనికి పనులు దొరుకుతుండేవి.
 
ఇతని రోడ్డు నిర్మాణ పద్ధతుల్ని ఇతరులు కూడా అనుకరించసాగారు. స్కాట్ లాండ్ దేశాన్ని వదలి వంతెనలు నిర్మించటానికి దక్షిణ ప్రాంతాలకు తరలిపోయిన థామస్ టెల్‍ఫర్డ్ పీఠభూముల్లో కరువును నివారించటానికి గాను రోడ్లు, కాలువలు నిర్మాణం కోసం మళ్ళీ వచ్చాడు. రోడ్డు చదునుగా ఉండాలనీ, భారీ వాహనాలు వెళ్లగలిగేలా మధ్య భాగం బలంగా ఉండాలనీ అతని ఆశయం. ఇతడు రోడ్లకు రెండు పొరలుగా పునాది రాళ్ళను వేసి, కంకరనూ, గులకరాళ్ళనూ రెండు వరుసలుగా పరచి దిమ్మని చేసేవాడు.
 
ఇతని సమకాలికుడు జాన్ మెకాడం పెద్ద బండలకు బదులు కంకర రాళ్ళతోనే అనేక పొరలను రోడ్డు పునాదిగా ఉపయోగించేవాడు. కొద్ది కాలంలోనే ఇవి స్థిరపడిపోయి, రోడ్లు ధృఢంగా, నునుపుగా ఏర్పడేవి. రోడ్లను మరమ్మత్తు చేయాలంటే, వాటిని పగలగొట్టి ఆ సామాగ్రితోనే కొత్త రోడ్లు చేసేవాడు. టెల్ ఫర్డ్ రోడ్ల కంటే మన్నిక తక్కువైన ప్పటికీ, పద్ధతి మాత్రం త్వరితంగానూ, చౌకగానూ ఉండేవి.
==19 వ శతాబ్దం లో రోడ్లు==
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/రహదారి" నుండి వెలికితీశారు