రహదారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
==చరిత్ర==
[[ప్రయాణం]] సాఫీగా జరగాలంటే కేవలం వాహనాలుంటె సరిపోదు. వాటికి తగిన రోడ్లు కూడా ఉండాలి. రోమన్ సామ్రాజ్య స్థాపన జరిగే వరకు ప్రాచీన దేశాలేవీ వీటి అవసరాన్ని గుర్తించలేదు. చెట్లకు, తోటలకు, లోయలకు ఆత్మలుంటాయనీ, ఇవి దేవుళ్ళ నివాస స్థానాలనీ విశ్వసించిన గ్రీకులు[[గ్రీకు]]లు ప్రకృతిలో జోక్యం చేసుకోవటం పాపంగా భావించేవారు. అందుకే వాళ్ళు నిర్మించిన రహదారులు రెండు పక్కలా సమాధులను, మత చిహ్నాలను కలిగి ఉంటూ దేవాలయ వీధుల్లాగా ఉండేవి. పర్షియన్ ల కృషి వీళ్ళ కంటె మెరుగుగా ఉండేది. వాళ్ళు నూసా నుంచి ఆసియా మైనర్, భారతక్వ్ దేశాలకు రహదారులు నిర్మించి, అక్కడక్కడా సత్రాలను, వసతి గృహాలను కట్టించారు. తపాలా సౌకర్యాలనూ, సైన్యాన్ని తరలించటానికి ఈ రోడ్లు బాగా ఉపయోగ పడేవి. [[చైనా]] లో కూడా అప్పట్లో మంచి రోడ్లు ఉండేవి.
 
రోడ్ల నిర్మాణంలో ఈ దేశాలన్నీ సమర్థ వంతంగా పాల్గొన్నప్పటికీ రోమన్ లదే అందె వేసిన చేయి. వాళ్ళ దేశం లోనే కాకుండా, స్కాట్లండ్ సరిహద్దుల నుండి పర్షియన్ సింధుశాఖ వరకు, కాకసన్ నుంచి అట్లాస్ పర్వతాల వరకు తొలిసారిగా రోడ్లు నిర్మించింది వారే. అయితే ఈ రోడ్లు వేయటం ఆయా ప్రాంతాల ప్రజల మీద అభిమానం పుట్టుకొచ్చి మాత్రం కాదు. వాళ్ళ సైన్యాన్ని తరలించటానికి , వాళ్ళ వర్తకులు, అధికారులు సుఖంగా ప్రయాణం చేయటానికీ ఈ రోడ్లు ఉపయోగ పడతాయన్న స్వార్థం తోనే!
"https://te.wikipedia.org/wiki/రహదారి" నుండి వెలికితీశారు