సైకిల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
20 యేండ్ల తరువాత మాక్మిలన్ అనే కమ్మరి యువకుడు "డ్రే ఈ" నమూనాను మెరుగుపరచటానికి ప్రయత్నించాడు. వెనక చక్రం ఇరుసుకి రెండు కాంక్ లను అమర్చి, వాటిని రెండు పొడుగాటి తులాదండాలకు కలిపాడు. వీటిని కాళ్ళతో తోసినపుడు వాహనం ముందుకు కదులుతుంది. మాక్మిలన్ ఈ వాహనం పై డంఫ్రీన్ నుంచి గ్లాస్కో వరకు 40 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణానికి అతనికి రెండు రోజులు పట్టింది. ఈ దశలో కూడా ఇది వ్యాపారవేత్తల దృష్టికి రాలేదు. పదేళ్ళ తరువాత జర్మనీకి చెందిన ఫిలిప్ హెనిరిక్ ఫిషర్ అనే మెకానిక్ మరికొన్ని మార్పులు చేశాడు. ముందు చక్రానికి రెండు వైపులా పెడల్ లను అమర్చటం అమర్చటం వల్ల కాళ్ళను నేలపై నెట్టినప్పుటి లాగా కుదుపుల చలనం కాకుండా వాహనం నెమ్మదిగా, అవిచ్ఛిన్నంగా చలిస్తుంది. కానీ చలిస్తున్నంత వరకూ వాహనాలు పడిపోకుండా ఎలా ఉండగలుగుతున్నాయో మాక్మిలన్ గానీ, ఫిషర్ కానీ చెప్పలేకపోయారు. కారణమేమిటంటే, చక్రాలు తిరుగుతున్నపుడు జైరోస్కోవ్ లాంటి ప్రభావం ఉంటుంది. వాహన వేగం ఎక్కువయ్యే కొద్దీ దాని స్థిరత్వం పెరుగుతుంది.
==మొదటి సైకిల్ కర్మాగారం==
ఎర్నస్ట్ మికాక్స్ అనే ఫ్రాన్స్ దేశీయుడు మొదటి సైకిల్ కర్మాగారాన్ని నెలకొల్పి ఫిషర్ నమూనా ప్రకారం సైకిళ్ళను తయారుచేశాడు. ఇంగ్లండ్ లో కూడా ఇలాంటివి తయారయ్యాయి. వీటిలో వెనక చక్రం కాస్త చిన్నగా ఉండేది. 1870 ప్రాంతంలో ఈ నమూనా బహుళ ప్రజాదరణ పొందింది. రాను రాను క్రీడాకారులకు దీనిపట్ల మోజు పెరిగింది. వాహన వేగం ముందు చక్రం తిరగటం పై ఆధారపడటం వల్ల దాని పరిమాణాన్ని ఎక్కువ చేసి, వెనుక చక్రం పరిమాణాన్ని బాగా తగ్గించారు. ఈ వాహనాన్ని ఎక్కడం, దిగడం ఒక సర్కస్ లాగా ఉండేది. ఇలా ఉన్నప్పటికీ ఈ వాహనాలు మంచి వేగంతో పోగలుగుతుండేవి.
==వేగంగా పోయే సైకిల్==
 
== సైకిలుకు 312 ఏళ్ళు ==
"https://te.wikipedia.org/wiki/సైకిల్" నుండి వెలికితీశారు