సైకిల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
సైకిల్ ని మరింత చిన్నగానూ, వేగంగా పోయే లాగానూ చేయటంలో లాసన్ అనే ఇంగ్లండ్ దేశీయుడు కృతకృత్యుడయ్యాడు. రెండు చక్రాల నడుమ క్రాంక్ నీ, ఫెడల్ నీ తొలిసారిగా అమర్చింది ఇతడే. ఫెడల్ ని తొక్కినప్పుడు తెక్కేవాడి కాళ్ళ శక్తిని ఫెడల్ లకు అమర్చిన గేర్ చక్రం నుంచి వనక ఇరుసు వద్ద ఉన్న చిన్న గేర్ చక్రానికి అందించటం కోసం స్వీడన్ కి చెందిన హాన్స్ రెనాల్డ్ ఒక గొలుసును వాడాడు. క్రమంగా చక్రాలకు స్ఫోక్ లు, బాల్ బేరింగులు, గేర్ లు, కూర్చోవడానికి స్ప్రింగ్ సీటు కనుక్కోబడ్డాయి. 1890 లో పెద్ద ఎత్తున సైకిళ్ళను తయారుచేయటం మొదలయ్యే సరికి అవి ఇంచుమించు ప్రస్తుతం వాడుతున్న నమూనా ప్రకారమే ఉండేది. అయితే వాటికి అప్పట్లో టైర్లు మాత్రం లేవు.
==డన్‍లప్ టైర్లు అభివృద్ధి==
టైర్లను కనుగొన్న కీర్తి బెల్ ఫాస్ట్ లో స్థిరపడ్డ స్కాట్లండ్ పశువైద్యుడు జాన్ బాయిడ్ డన్‍లప్ యొక్క పదేళ్ళ కుమారునికి దక్కింది. మూడు చక్రాల సైకిల్ పందెంలో తనని ఎలాగైనా గెలిచేలా చేయాలని కొడుకు తండ్రి వద్ద మారాం చేశాడు. అప్పట్లో సైకిల్ చక్రాలకు దళసరి రబ్బరు టైర్లను ఉపయోగించేవారు. వీటివల్ల కుదుపులు తగ్గడమంటూ జరగలేదు. చెట్లకు నీళ్ళు పట్టడానికి ఉపయోగించే హోసు గొట్టాన్ని(Hose pipe) డాక్టర్ డన్‍లప్ రెండు భాగాలుగా చేసి, వాటిని వెనక వుండే రెందు చక్రాలకు అతికించి, పంప్ సహాయంతో గొట్టాల్లో గాలి నింపాడు. అబ్బయి పందెంలో గెలవటమే కాకుండా, అదే సైకిల్ తోనే హాయిగా ఊరంతా రిగుగుతూ ఉండి పోయాడు. ఈ సంఘటన జరిగిన ఒక సంవత్సరం లోపుగానే దీన్ని గురించి వార్తా పత్రికల్లో రాయటం, ఒక ఐర్లండ్ పారిశ్రామికునితో కలిసి జాన్ డన్‍లప్ గాలి టైర్లను తయారు చేయటం జరిగింది.
==సామాన్య ప్రజల వినియోగం==
 
== సైకిలుకు 312 ఏళ్ళు ==
"https://te.wikipedia.org/wiki/సైకిల్" నుండి వెలికితీశారు