"చర్చ:తెలుగు భాషలో ఆంగ్ల పదాలు" కూర్పుల మధ్య తేడాలు

==ఆంగ్ల భాష==
[[ఆంగ్ల భాష]] వ్యాసంలో ఉప విభాగంగా [[తెలుగువారు అనుదిన జీవితంలో విస్తృతంగా వాడే ఇంగ్లీషు పదాలు]] పెద్ద జాబితా ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న చర్చలో కొన్ని విషయాలు కూడా వున్నాయి. చూడండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 07:00, 7 మార్చి 2013 (UTC)
 
== Removed below ==
I removed below, as these are either flowery words, own opinions, suggestions.
 
15వ శతాబ్దంలో నికోలా డా కాంటీ అను బ్రిటీష్ మహాశయుడు తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" గా అభివర్ణించాడు. తుళువరాజు శ్రీకృష్ణదేవరాయలు 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని తెలుగు భాషను కొనియాడాడు. ఎంతో మధురమైన, తియ్యనైన తెలుగు భాష నేడు ఆంగ్లభాష విష ప్రభావానికి గురి అయ్యి ఎన్నో వాడుక పదాలను కోల్పోతోంది. పదాలు వాడుకలో లేకపోతే అవి కాల క్రమేణా భాషలోంచి తమ ఉనికిని కోల్పోతాయి. దురదృష్టవశాత్తు ఈరోజుల్లో సాధారణ వ్యక్తి మాట్లాడే భాషలో దాదాపు సగం వరకూ ఆంగ్ల పదాలే వినిపిస్తున్నాయి. తెలుగు భాష ను స్పష్టంగా మాట్లాడలేని పరిస్తితిలో నేటి పిల్లలు, యువతీ యువకులు ఉన్నారు. ఈ రోజుల్లో ఇద్దరు వ్యక్తులు ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు అంటే తప్పనిసరిగా వారు తెలుగువారు అయివుండొచ్చని ఒక వేళ అనుకున్నా అతిశయోక్తి కాదు. తెలుగు మాట్లాడేవారిని చాలా సందర్భాలలో చులకనగా / అనాగరికులుగా చూస్తున్నారు. నేడు తెలుగు భాష ఇంతటి దౌర్భాగ్య స్థితిలో ఉండటం దురదృష్టకరం. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగును భవిష్యత్ తరాలు పుస్తకాలలో మాత్రమే చూడగలరు.
 
 
తెలుగు భాషను కాపాడుకునే విధానం
:తెలుగు మాతృభాష అని, ఇంగ్లీషు కేవలం బ్రతుకు తెరువు కోసం మాట్లాడే పరాయి భాష అని తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలియజెప్పాలి. ముందుగా మాతృ భాష నేర్చుకుంటే పరాయి భాష చాలా సులభంగా నేర్చుకోవచ్చు. కనుక పిల్లలకు విధ్యార్ధి దశనుండే తెలుగు భాషను అలవరచాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల చేత మమ్మీ, డాడీలకు బదులు అమ్మ, నాన్న అని పిలిపించుకోవాలి. పిల్లలకు [[పెద్దబాల శిక్ష]], చందమామ కధలు, నీతి పద్యాలు వంటివి బోధించాలి.
 
Also removed wiki-links, as they cannot be references. May be we should put them under Also see... section.
2,920

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/817398" నుండి వెలికితీశారు