ప్యాంటు: కూర్పుల మధ్య తేడాలు

జేంస్ బాండ్ గురించి
పంక్తి 6:
[[File:Trouser-parts.svg|right|thumb|200px|మొదటి తరం ప్యాంటు, వివిధ భాగాలు]]
* '''<big>మొదటి తరం</big>''': '''ప్లీటెడ్ ట్రౌజర్సు''' భారతదేశంలో ధరింపబడిన మొదటి తరం ప్యాంట్లు. మోకాలి గుండా నిలువుగా రెండు కాళ్ళకి క్రీజ్ (మడత)లు ఉండేవి. వీటికి నడుముకి ఇరువైపులా రెండు ప్లీట్లు ఉండేవి. ఇవి నడుము కంటే పైకి ధరించబడేవి. పాదం వద్ద బయటికి కనిపించేలా మడత వేసి కుట్టేవారు. వీటిని కఫ్స్ అంటారు. ఇదే కాలంలో ప్లీటెడ్ ట్రౌజర్స్ కి అసాంప్రదాయిక ప్రత్యాన్మాయంగా లో-వెయిస్టెడ్ ప్యాంట్సు వేసేవారు. వీటిని నడుము క్రిందకు కట్టేవారు.
* '''<big>రెండవ తరం</big>''': కొంత కాలము తర్వాత '''న్యారో''' అని పిలువబడే బిగుతు ప్యాంట్లు వచ్చినవి. [[హాలీవుడ్]] లో [[సీన్ కానరీ]] [[జేంస్ బాండ్]] చిత్రాలు, తెలుగునాట [[ఘట్టమనేని కృష్ణ]] గూఢచారి చిత్రాలు వీటిని ప్రజలకి దగ్గర చేశాయి. ఈ తరం నుండి కఫ్ వాడకం కనుమరుగైనది. అప్పటి యువత ప్లీటెడ్ ట్రౌజర్లని డబ్బా ప్యాంట్లు అని సరదాగా వ్యవహరించేవారు. పాత ఫ్యాషన్ యే ఇష్టపడే వయసైన వారు టైట్ ప్యాంట్లని గొట్టం ప్యాంట్లు గా అవహేళన చేసేవారు.
* '''<big>మూడవ తరం</big>''': తర్వాత '''బెల్ బాటం''' లు వచ్చాయి. మోకాలి వరకు బిగుతుగా ఉండి, మోకాలి వద్ద నుండి పాదం వరకు గంట ఆకారంలో వదులుగా ఉండటంతో వీటికి ఆ పేరు వచ్చినది. కథానాయకుడు సహృదయుడు గా ఉండే [[రాజేష్ ఖన్నా]] కాలం ముగిసి, నిరుద్యోగం, స్మగ్లింగ్, అన్యాయ వ్యవస్థ పై యువత అసంతృప్తి పెరిగిన [[అమితాబ్ బచ్చన్]] కాలం ఆరంభమైనది. పొడుగ్గా ఉన్న అమితాబ్ కి బెల్ బాటం శైలి బాగా నప్పటంతో యువత ఈ శైలిని అనుకరించటం మొదలుపెట్టారు.
* '''<big>నాల్గవ తరం</big>''': కొద్ది రోజులు ఏ ఫ్యాషన్ లేకుండా '''స్ట్రెయిట్ లెగ్''' ధరించారు. దీనిని ఫ్యాషన్ కి శూన్యావస్థ కాలంగా అభివర్ణించవచ్చును.
"https://te.wikipedia.org/wiki/ప్యాంటు" నుండి వెలికితీశారు