పంక్తి 26:
==జవాబు==
తెలుగు భాషను సరిగ్గా మాట్లాడలేని పరిస్థితిలో పిల్లలు, యువతీ యువకులు ఉన్నారనేది కఠిన వాస్తవం. ఆంగ్ల భాషలో చర్చించుకొనేవారంతా తెలుగువారు కాకపోవచ్చును కాని, 'ఈ రోజుల్లో ఇద్దరు వ్యక్తులు ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు అంటే తప్పనిసరిగా వారు తెలుగువారు అయివుండొచ్చని ఒక వేళ అనుకున్నా అతిశయోక్తి కాదు' అంటే ఆంగ్లం అంతలా తెలుగు వారిలో పాతుకుపోతోంది అని అర్ధం. ఒక తెలుగువాడు తోటి తెలుగువాడితో ఆంగ్లంలో మాట్లడటం పూర్తిగా కాకపోయినా చాలావరకూ జరుగుతోంది. ఇది ముఖ్యంగా పిల్లల్లో గమనించవచ్చు. ఒక భాషలో మాట్లాడటం లేదంటే ఆ భాషపై మక్కువ లేక కాదు. తెలుగు భాష పదాలు ఉచ్చరించడానికి నాలుకకు కొద్ది ఎక్కువ వ్యాయామం అవసరమౌతుంది. కాని ఆంగ్లం మాట్లాడటానికి నాలుకకు తక్కువ వ్యాయామం చాలు. వాస్తవంగా ఆంగ్ల భాష మాట్లాడటానికి తెలుగు భాషతో పోలిస్తే చాలా సౌలభ్యంగా ఉంటుంది. కాని ఆ క్రమంలో కొన్ని తెలుగు పదాలు వాడుకలోంచి తొలగిపోతాయి. అందుకే తెలుగువారిలో పిల్లలు, యువతీ యువకులు మాతృభాష స్పష్టంగా మాట్లాడలేని పరిస్తితి ఏర్పడింది. బ్రతుకు తెరువు కోసం పరాయి భాష అయిన ఆంగ్లం అవసరమే, అవసరమైనప్పుడు మాట్లాడవచ్చు. కాని ఆ క్రమంలో మాతృభాషలో పదాలు మరచిపోకూడదు. ఇతర రాష్ట్రాల వారు మనతో పోలిస్తే చాలా నయం. వారికి మనకంటే ఎంతో మాతృభాషాభిమానం ఉన్నది.
 
==సూచన==
[[ఇప్పుడు ప్రపంచంలోని (భారతదేశంలోని భాషలతో సహా) చాలా భాషలవలెనే తెలుగు భాష కూడా ఆంగ్లభాషా ప్రభావానికి లోనవుతుంది. సాంఘీకంగా ఆంగ్ల భాషాపదాలు కలిపి మాట్లాడటం ప్రెస్టీజ్ ఇస్యూగా భావించడం గత యాభై నూరు సంవత్సరాల నుండి జరుగుతున్న ప్రక్రియ. గతంలో ఆంగ్ల భాష ఏ విధంగా ఫ్రెంచ్ ప్రభావానికి లోనైనదో (ఉదాహరణకు, పిగ్ అనేది నేటివ్ పదం అయితే ఫోర్క్ అనేది నార్మన్ ఫ్రెంచ్ పదం) అదే విధంగా తెలుగు గతంలో సంస్కృతం, ప్రాకృతం, పార్శీ, అరబిక్ ఇప్పుడు ఆంగ్ల భాషా ప్రభావాలకు లోనవుతోంది]] - అనే పరిచయం ఈ వ్యాసానికి సరైనది కాదు. మరోవిధంగా ఆలోచించి వ్రాయమని వ్రాసినవారికి విన్నపం చేస్తున్నాను. ఈ వ్యాసంలో పరిచయం కేవలం తెలుగు భాష వాడుకలోంచి తొలగిపోతున్న పదాలు గురించి మాత్రమే ఉండాలి.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Mylaptops" నుండి వెలికితీశారు