ప్యాంటు: కూర్పుల మధ్య తేడాలు

ప్యాంటులలో రకాలు
→‎ట్రౌజరు భాగాలు: నైఫ్ ప్లీట్ల గురించి
పంక్తి 20:
* '''బెల్టు లూపులు''': నడుము చుట్టూ బెల్టుని పెట్టుకొనేందుకు వీలుగా కుట్టిన రింగుల వంటి రిబ్బన్లు
*'''జేబులు''': నడుముకిరువైపులా ఉండే వాటిని సైడ్ పాకెట్స్ అంటారు. ప్రక్కలకి ఉండే కుట్ల పైన గానీ కొద్దిగా ఏటవాలుగా గానీ ఉంటాయి. (బహు అరుదుగా ట్రౌజర్లకి జీంస్ ప్యాంటు వలె ముందు వైపున జేబులు ఉంటాయి.) పిరుదుల పైన ఒక్కో పాకెట్ ఉంటాయి. వీటిని హిప్ పాకెట్స్ అంటారు. కొన్ని ప్యాంటులకి ఒక హిప్ పాకెట్ మాత్రమే ఉంటుంది. కార్గోలు అయితే మోకాళ్ళ వెలుపలి ప్రక్కలకి కూడా జేబులు ఉంటాయి. అందుకే వీటిని సిక్స్-పాకెట్ అంటారు
* '''ప్లీటులు''': జిప్పుకి ఇరువైపులా రెండేసి మడతలు ఉంటాయి. వీటినే ప్లీట్స్ అంటారు. ఒక వైపు ఉన్న ప్లీటులు (నడుము కి కత్తులు వేలాడదీసినట్లు) ఒకే దిశలో ఉంటాయి. అందుకే వీటిని నైఫ్ ప్లీట్స్ అంటారు. కొందరు ఒకే ప్లీటు ఇంకొందరు మూడేసి ప్లీట్లు వేయించుకొంటుంటారు. ఇవి వ్యక్తిగతం. కొన్ని ట్రౌజర్లకైతే అసలు ప్లీట్లే ఉండవు.
* '''జిప్పు''': వేసుకొనే సమయంలో బిగుతు సమస్య రాకుండా, వేసుకొన్న తర్వాత నడుము చుట్టూ బిగుతుగా హత్తుకోవటానికి, మూత్రవిసర్జన కోసం ప్యాంటు మొత్తం విప్పకుండా జిప్పు వాడతారు. ఒకప్పుడు జిప్పు స్థానే బొత్తాలు వాడేవారు. కొన్ని కొత్త తరం జీంసులకి ఇలా బొత్తాలే వాడారు. వీటినే బటండ్ ఫ్లై అంటారు.
* '''కఫ్''': పాదం వద్ద బయటికి కనిపించేలా మడత వేసి కుట్టేవాటిని కఫ్స్ అంటారు. న్యారో ప్యాంట్ల నుండి నుండి కఫ్ వాడకం కనుమరుగైనది. ప్యారలెల్ ప్యాంట్లు మరల ప్లీటెడ్ ట్రౌజర్లని పోలి కఫ్ ల ఉపయోగం వాడుకలోకి వచ్చినది. అయితే జీంస్, కార్గోస్ వంటి వాటికి కఫ్ లు లేకపోయినను, కొందరు వాటిని బయటకు ఒకటి-రెండు మడతలు మడుస్తారు. ఇలా పొడవుని సరి చేసుకొనటానికి, లేదా కేవలం ఫ్యాషన్ కి చేస్తారు
"https://te.wikipedia.org/wiki/ప్యాంటు" నుండి వెలికితీశారు