పంక్తి 29:
''ఈ రోజుల్లో ఇద్దరు వ్యక్తులు ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు అంటే తప్పనిసరిగా వారు తెలుగువారు అయివుండొచ్చని ఒక వేళ అనుకున్నా అతిశయోక్తి కాదు'' అంటే
 
ఆంగ్లం అంతలా తెలుగు వారిలో పాతుకుపోతోంది అని అర్ధం. ఒక తెలుగువాడు తోటి తెలుగువాడితో ఆంగ్లంలో మాట్లడటం పూర్తిగా కాకపోయినా చాలావరకూ జరుగుతోంది. ఇది ముఖ్యంగా పిల్లల్లో గమనించవచ్చు. ఒక భాషలో మాట్లాడటం లేదంటే ఆ భాషపై మక్కువ లేక కాదు. తెలుగు భాష పదాలు ఉచ్చరించడానికి నాలుకకు కొద్ది ఎక్కువ వ్యాయామం అవసరమౌతుంది. కాని ఆంగ్లం మాట్లాడటానికి నాలుకకు తక్కువ వ్యాయామం చాలు. వాస్తవంగా ఆంగ్ల భాష మాట్లాడటానికి తెలుగు భాషతో పోలిస్తే చాలా సౌలభ్యంగా ఉంటుంది. కాని ఆ క్రమంలో కొన్ని తెలుగు పదాలు వాడుకలోంచి తొలగిపోతాయి. అందుకే తెలుగువారిలో పిల్లలు, యువతీ యువకులు మాతృభాష స్పష్టంగా మాట్లాడలేని పరిస్తితి ఏర్పడింది. బ్రతుకు తెరువు కోసం పరాయి భాష అయిన ఆంగ్లం అవసరమే, అవసరమైనప్పుడు మాట్లాడవచ్చు. కాని ఆ క్రమంలో మాతృభాషలో పదాలు మరచిపోకూడదు. ఇతర రాష్ట్రాల వారు మనతో పోలిస్తే చాలా నయం. వారికి మనకంటే ఎంతో మాతృభాషాభిమానం ఉన్నది.([[వాడుకరి:Mylaptops|Mylaptops]] ([[వాడుకరి చర్చ:Mylaptops|చర్చ]]) 09:49, 13 మార్చి 2013 (UTC))
 
==సూచన==
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Mylaptops" నుండి వెలికితీశారు