"వికీపీడియా చర్చ:సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013" కూర్పుల మధ్య తేడాలు

== నేను రాలేను ... గానీ, ==
వ్యక్తిగత కారణాల వల్ల నేను ఎటువంటి భౌతిక సమావేశాలకూ రాలేను గానీ, టీషర్టులు ప్లాన్ చేస్తే నాక్కూడా ఒకటి ఉంచండి :-) [[వాడుకరి:Chavakiran|Chavakiran]] ([[వాడుకరి చర్చ:Chavakiran|చర్చ]]) 13:24, 13 మార్చి 2013 (UTC)
 
== కార్యక్రమ ప్రణాళిక పై స్పందన ==
 
కార్యక్రమ ప్రణాళిక మొదటి రూపం చేర్చినందులకు ధన్యవాదాలు. కార్యక్రమ వుద్దేశ్యము వికీ సభ్యుల కలయికప రస్పర పరిచయాలు ప్రధానంగా వున్నట్లుంది. అయితే పెద్ద కార్యక్రమం, ఖర్చుతో కూడుకున్నదైనందున దీని లక్ష్యాలు ఇంకొంచెం విస్తృతంగా వుంటే బాగుంటుది. ఉదాహరణకు ప్రతి జిల్లానుండి ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు తెవికీ గురించి శిక్షణ ఇ‌వ్వటం. ఉగాదిసమావేశానికి ముందు వీలైతే హైద్రాబాదు మరియు ఆంధ్రప్రదేశ్ నగరాలలో చిన్న చిన్న వికీ సమావేశాలు జరిపితే దీని ప్రచారానికి తోడ్పడుతుంది. వివిధ ప్రాంతాలనుండి ఆసక్తిగలవారిని ఎంపికచేయటానికి వీలవుతుంది. బయటనుండి వచ్చేవారికి ప్రయాణ,హోటల్ ఖర్చులు భరించితే బాగుంటుంది. కార్యక్రమాన్ని నిర్వహించటానికి ముందుకు వచ్చిన కామేశ్వరరావు గారు దానికి తోడ్పడే ఇతరులు చిన్న కార్యనిర్వాహకవర్గంగా ఏర్పడితే బయటి ప్రపంచంతో సంప్రదింపులు చేయటానికి సులభమవుతుంది. అలాగే శిక్షణ ఇవ్వటానికి దాదాపు 40మందిపనిచేయటానికైనా వీలుండే కంప్యూటర్ లాబ్ వనరుని గుర్తించితే బాగుంటుంది. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:11, 14 మార్చి 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/819643" నుండి వెలికితీశారు