సూటు: కూర్పుల మధ్య తేడాలు

→‎బౌ టై: విస్తరణ
→‎ట్రౌజరు: విస్తరణ
పంక్తి 39:
 
===[[ట్రౌజరు]]===
{{Main|ప్యాంటు}}
[[File:Trouser-parts.svg|right|thumb|200px|మొదటి తరం ప్యాంటు, వివిధ భాగాలు]]
* '''<big>మొదటి తరం</big>''': '''ప్లీటెడ్ ట్రౌజర్సు''' భారతదేశంలో ధరింపబడిన మొదటి తరం ప్యాంట్లు. మోకాలి గుండా నిలువుగా రెండు కాళ్ళకి క్రీజ్ (మడత)లు ఉండేవి. వీటికి నడుముకి ఇరువైపులా రెండు ప్లీట్లు ఉండేవి. ఇవి నడుము కంటే పైకి ధరించబడేవి. పాదం వద్ద బయటికి కనిపించేలా మడత వేసి కుట్టేవారు. వీటిని కఫ్స్ అంటారు. ఇదే కాలంలో ప్లీటెడ్ ట్రౌజర్స్ కి అసాంప్రదాయిక ప్రత్యాన్మాయంగా లో-వెయిస్టెడ్ ప్యాంట్సు వేసేవారు. వీటిని నడుము క్రిందకు కట్టేవారు.
* '''<big>రెండవ తరం</big>''': కొంత కాలము తర్వాత '''న్యారో''' అని పిలువబడే బిగుతు ప్యాంట్లు వచ్చినవి. ఈ తరం నుండి కఫ్ వాడకం కనుమరుగైనది. అప్పటి యువత ప్లీటెడ్ ట్రౌజర్లని డబ్బా ప్యాంట్లు అని సరదాగా వ్యవహరించేవారు. పాత ఫ్యాషన్ యే ఇష్టపడే వయసైన వారు టైట్ ప్యాంట్లని గొట్టం ప్యాంట్లు గా అవహేళన చేసేవారు.
* '''<big>మూడవ తరం</big>''': తర్వాత '''బెల్ బాటం''' లు వచ్చాయి. మోకాలి వరకు బిగుతుగా ఉండి, మోకాలి వద్ద నుండి పాదం వరకు గంట ఆకారంలో వదులుగా ఉండటంతో వీటికి ఆ పేరు వచ్చినది. కథానాయకుడు సహృదయుడు గా ఉండే [[రాజేష్ ఖన్నా]] కాలం ముగిసి, నిరుద్యోగం, స్మగ్లింగ్, అన్యాయ వ్యవస్థ పై యువత అసంతృప్తి పెరిగిన [[అమితాబ్ బచ్చన్]] కాలం ఆరంభమైనది. పొడుగ్గా ఉన్న అమితాబ్ కి బెల్ బాటం శైలి బాగా నప్పటంతో యువత ఈ శైలిని అనుకరించటం మొదలుపెట్టారు.
* '''<big>నాల్గవ తరం</big>''': కొద్ది రోజులు ఏ ఫ్యాషన్ లేకుండా '''స్ట్రెయిట్ లెగ్''' ధరించారు. దీనిని ఫ్యాషన్ కి శూన్యావస్థ కాలంగా అభివర్ణించవచ్చును.
* '''<big>ఐదవ తరం</big>''': తర్వాత '''బ్యాగీ''' ప్యాంట్లు వచ్చినవి. అరబ్బుల పైజామాలు పోలి ఉండే ఈ ప్యాంట్లు నడుము నుండి మోకాలు వరకు వదులు పెరుగుతూ, అక్కడ అత్యధిక వదులు ఉండి, మరల మోకాలి నుండి పాదం వరకు వదులు తగ్గుతూ, అక్కడ అత్యల్ప వదులు ఉండేవి.
* '''<big>ఆరవ తరం</big>''': పిమ్మట వచ్చిన ప్యారలెల్ ప్యాంట్లు మరల ప్లీటెడ్ ట్రౌజర్లని పోలి ఉండేవి. మరల కఫ్ ల ఉపయోగం వాడుకలోకి వచ్చినది. అతి కొద్ది సమయం [[ప్రభుదేవా]] [[ప్రేమికుడు]] చిత్రం లో ధరించిన బెలూన్ బ్యాగీలు కూడా ఫ్యాషన్ గా ఉన్నవి.
*'''<big>జీంస్ విప్లవం</big>''': భారీ గా ఉండటం, ఉతకటం, ఆరవేయటం, ఇస్త్రీ చేయటం కష్టంగా ఉండటం వలన జీంస్ గురించి తెలిసిననూ వాటిని ధరించటం పై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. [[షారుఖ్ ఖాన్]] [[దిల్ వాలే దుల్హనియా లేజాయెంగే]] సినిమాలో కేవలం మూడు సందర్బాలలో ఫార్మల్ ప్యాంట్లు ధరించాడు. మిగితావన్నీ జీంస్ ప్యాంట్లే. ఇదే విధంగా [[నాగార్జున అక్కినేని]] నటించిన [[నిన్నే పెళ్ళాడుతా]] సినిమా లో పూర్తి నిడివి జీంస్ ధరించాడు. విజయ దుందుభి మోగించిన ఈ చిత్రాలు జీంస్ తో యువతని మంత్రముగ్ధులని చేశాయి. బరువు తగ్గించిన, మెత్తగా ఉన్న, కొద్దిగా సాగే గుణం కలిగిన సౌకర్యవంతమైన జీంస్ లు రూపొందించబడటం తో జీంస్ పుంజుకొన్నాయి. ఇస్త్రీ అవసరం లేకపోవటం, ఉతకకుండా ఎన్ని మార్లైనా వేసుకోగలిగే సౌలభ్యం ఉండటం, మాసిననూ, చిరిగిననూ అవి కూడా ఫ్యాషన్లుగా జమ కట్టటం తో జీంస్ జనం లోకి మరింతగా చొచ్చుకుపోయినది. జీంస్ వేసిన వారిని చూడకుండా ఒక్క రోజు కూడా గదవదంటే అతిశయోక్తి కాదేమో!
*'''<big>ఫ్యాషన్ ల పున:ప్రవేశం</big>''':మరల బెల్-బాటం లను పోలిన ప్యాంట్లు '''బూట్ కట్''' పేరుతో వచ్చాయి. ఈ ఫ్యాషన్ అప్పటికి మిక్కిలి వాడుకలో ఉన్న జీంస్ కి కూడ పాకినది. [[లీ]] మరల '''స్కిన్నీ జీంస్''' లని ప్రవేశ పెట్టినది. ఇవి న్యారో ప్యాంట్లని పోలి ఉండేవి. [[ఆర్య 2]] లో [[అల్లు అర్జున్]] సాంప్రదాయిక దుస్తులని టైట్ ఫ్యాషన్ లో వేసిననూ, నాయకులని అనుసరించటం యువత అప్పటికే మానుకొని, వారి కంటే ఫ్యాషన్ లో ఒక అడుగు ముందే ఉండటంతో అవి జనాదరణకి నోచుకోలేదు.
*'''<big>ప్రస్తుత వాడకం</big>''':ప్రస్తుతం ఫ్లాట్ ఫ్రంట్ (ప్లీట్లు, మడత లేని) కాటన్ ట్రౌజర్లు కూడా సాంప్రదాయికంగా వాడుతునారు.
*'''<big>కార్గోస్</big>''': మోకాళ్ళ ప్రక్కలకు కూడా జేబులు గల ఈ ముతక కాటన్ ప్యాంట్లని సిక్స్-పాకెట్, లేదా కార్గోస్ అని అంటారు. ఇవి అసాంప్రదాయికాలు
 
===బ్రీచెస్===
 
"https://te.wikipedia.org/wiki/సూటు" నుండి వెలికితీశారు