పాలకోడేటి శ్యామలాంబ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''పాలకోడేటి శ్యామలాంబ''' స్వాతంత్ర్యసమరయోధురాలు. శ్యామలంబ డిస...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పాలకోడేటి శ్యామలాంబ''' స్వాతంత్ర్యసమరయోధురాలు. శ్యామలంబ డిసెంబరు 6, 1902లో కైకలూరులో దుగ్గిరాల వియ్యన్న, సుబ్బమ్మ దంపతులకు జన్మించినది. ఈమె భర్త సూర్యప్రకాశరావు కూడా స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ పురపాలక సంఘ సభ్యుడు మరియు ప్రేమజ్యోతి అనే పత్రికాసంపాదకుడు. ఈమె బావ డాక్టర్ గురుమూర్తి స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ పురపాలక సంఘ సభ్యుడు మరియు అనేక సహకార సంస్థలను స్థాపించాడు.<ref>[http://rajahmundry.me/Rajamahendravaram/IdealPerson10.html రాజమండ్రి వెబ్ సైటులో పాలకోడేటి శ్యామలాంబ గురించిన వివరాలు.]</ref>
 
శ్యామలాంబ 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలోనూ, 1941లో వ్యక్తిగత సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. ముఖ్యంగా యువతలో దేశభక్తి పెంపొందించేందుకు కృషి చేసిన ఈమె పురపాలక సంఘ సభ్యురాలిగా రాజమండ్రి నగర పారిశుధ్యంపై శ్రద్ధ వహించినది.