రామ్ పోతినేని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
== వ్యక్తిగత జీవితం ==
రామ్ ప్రముఖ నిర్మాత "స్రవంతి" రవికిషొర్రవికిషోర్ తమ్ముడైన మురళి పోతినేని కొడుకు. హైదరాబాద్ లో పుట్టినా తన విద్యాభ్యాసం తమిళనాడులో చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమంలోవిద్యాశ్రమం విద్యాభ్యాసంమరియు సెంట్ జాన్ పాఠశాలలో చేసాడు.<ref>http://www.telugucinema.com/c/publish/stars/sravanthiravikishore_interview_2.php</ref>
 
== సినీ జీవితం ==
రామ్ నటించిన మొదటి చిత్రం [[దేవదాసు (2006 సినిమా)|దేవదాసు]]. ఇందులో [[ఇలియానా]] కథానాయిక. వై.వీ.ఎస్. చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 11 2006 న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాక రామ్ కి [[ఫిలింఫేర్|ఫిలింఫేర్ అవార్డ్]] సౌత్ - ఉత్తమ నూతన నటుడు అవార్డును అందించింది. తన రెండో చిత్రం [[సుకుమార్]] దర్శకత్వం వహించిన [[జగడం]]. ఈ చిత్రం మార్చి 16 2007 న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైనప్పటికీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందాయి. 2008 లో [[శ్రీను వైట్ల]] దర్శకత్వంలో [[జెనీలియా]] సరసన [[రెడీ]] చిత్రంలో నటించాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో రామ్ పెద్ద హీరోల్లో ఒకడయ్యాడు.<ref>http://articles.timesofindia.indiatimes.com/2008-09-27/news-interviews/27923690_1_pleasant-surprise-hansika-ram</ref>
 
2009 లో రెండు చిత్రాల్లో నటించాడు. ఒకటి [[బి.గోపాల్]] దర్శకత్వంలో [[మస్కా]]. ఇందులో [[హన్సికా మోట్వాని|హన్సిక]], షీలా కథానాయికలు. మరో చిత్రం ఎం.శరవణన్ దర్శకత్వంలో [[గణేష్ (2009 సినిమా)|గణేష్]]. ఇందులో [[కాజల్ అగర్వాల్]] కథానాయిక. మస్కా ఓ మోస్తరు విజయం సాధించగా గణేష్ పరాజయం పాలైంది. కానీ ఈ రెండు చిత్రాల్లోనూ రామ్ తన నటనకు ప్రశంసలు సొంతం చెసుకున్నాడు. 2010 లో రామ్ శ్రీవాస్ దర్శకత్వంలో [[రామ రామ కృష్ణ కృష్ణ (సినిమా)|రామ రామ కృష్ణ కృష్ణ]] చిత్రంలో నటించాడు. ఇందులో ప్రియా ఆనంద్, బిందు మాధవి కథానాయికలు. ఈ చిత్రం కూడా ఓ మోస్తరు విజయాన్ని సొంతం చెసుకుంది. 2011 లో రామ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో [[కందిరీగ (సినిమా)|కందిరీగ]] చిత్రంలో నటించాడు. ఇందులో [[హన్సికా మోట్వాని|హన్సిక]], అక్ష కథానాయికలు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది.
పంక్తి 53:
== మూలాలు ==
<references/>
[[en:Ram Pothineni]]
"https://te.wikipedia.org/wiki/రామ్_పోతినేని" నుండి వెలికితీశారు