"చందా కొచ్చర్" కూర్పుల మధ్య తేడాలు

==వ్యక్తిగత జీవితము==
ఈవిడ ముంబైలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ లో తన సహాధ్యాయు మరియు పవన శక్తి వ్యాపారవేత్త అయిన దీపక్ కొచ్చర్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానము. ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి.
==జీవన ప్రస్థానము==
1984 లో ICICI (Industrial Credit and Investment Corporation Of India) సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరింది. ఉద్యోగ తొలినాళ్ళలో సంస్థ యొక్క జౌళి, కాగితము మరియు సిమెంటు విభాగాలలో పనిచేసింది.
1993 , కొత్త బ్యాంకు ప్రారంభించాలనుకున్నపుడు సంస్థ యాజమాన్యం ఈమెను సంస్థ బ్యాంకింగ్ కోర్ కమిటీకి బదిలీ చేసింది.1994 లో అసిస్టెంట్ మేనేజర్ గానూ మరియు 1996 లో డిప్యూటీ మేనేజర్ గానూ పదోన్నతి సాధించింది. 1996 లో శక్తి (Power), టెలికాం మరియు రవాణా విభాగాలలో సంస్థను బలోపేతం చేయడానికి ఏర్పాటైన బృందానికి నాయకత్వం వహించింది.1998 లో సంస్థ జనరల్ మేనేజర్ గా పదోన్నతి సాధించింది.1999 లో సంస్థ యొక్క ఈ-కామర్స్ విభాగాన్ని కూడా నిర్వహించింది. ఈమె నాయకత్వంలోనే సంస్థ రిటైల్ బ్యాంకింగ్ లో ప్రవేశించి, మనదేశంలోని ప్రైవేటు బ్యాంకులలో అగ్రగామి గా నిలిచింది.2001 లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది.
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/821346" నుండి వెలికితీశారు