చందా కొచ్చర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
1984 లో ICICI (Industrial Credit and Investment Corporation Of India) సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరింది. ఉద్యోగ తొలినాళ్ళలో సంస్థ యొక్క జౌళి, కాగితము మరియు సిమెంటు విభాగాలలో పనిచేసింది.
1993 , కొత్త బ్యాంకు ప్రారంభించాలనుకున్నపుడు సంస్థ యాజమాన్యం ఈమెను సంస్థ బ్యాంకింగ్ కోర్ కమిటీకి బదిలీ చేసింది.1994 లో అసిస్టెంట్ మేనేజర్ గానూ మరియు 1996 లో డిప్యూటీ మేనేజర్ గానూ పదోన్నతి సాధించింది. 1996 లో శక్తి (Power), టెలికాం మరియు రవాణా విభాగాలలో సంస్థను బలోపేతం చేయడానికి ఏర్పాటైన బృందానికి నాయకత్వం వహించింది.1998 లో సంస్థ జనరల్ మేనేజర్ గా పదోన్నతి సాధించింది.1999 లో సంస్థ యొక్క ఈ-కామర్స్ విభాగాన్ని కూడా నిర్వహించింది. ఈమె నాయకత్వంలోనే సంస్థ రిటైల్ బ్యాంకింగ్ లో ప్రవేశించి, మనదేశంలోని ప్రైవేటు బ్యాంకులలో అగ్రగామి గా నిలిచింది.2001 లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది.
==పురస్కారములు==
2005 నుండి ఫోర్బ్స్ పత్రిక అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో స్థానం సంపాదించుకుంటూనే ఉన్నది. 2009 లో ఫోర్బ్స్ పత్రిక '''ప్రపంచ అత్యంత శక్తివంతమైన మహిళల ''' జాబితాలో 20 వ స్థానం మరియు 2010 లో అదే జాబితాలో 10వ స్థానానికి ఎగబాకింది.
 
బ్యాంకింగ్ రంగంలో ఈమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2010 లో ఈమెను [[పద్మభూషణ్]] తో సన్మానించింది.
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/చందా_కొచ్చర్" నుండి వెలికితీశారు