రైలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 93:
దీనికంటే ఆరమైలు ఎక్కువ పొడవు గల రోడ్డు సొరంగాన్ని ఫ్రాన్స్ - ఇటలీ సరిహద్దు వద్ద అల్ఫ్స్ పర్వత శ్రీణుల్లో నిర్మించారు. 1964 లో ప్రారంభించబడి, పని పూర్తి కావటానికి ఐదేళ్ళు పట్టింది. దీని గుండా గంటకు 800 చొప్పున వాహనాలు వెళ్ళుతుండేవి.
 
==విద్యుత్ రైళ్ళు - ట్రామ్‌ కార్లు==
స్టీఫెన్ సన్ తయారుచేసిన "రాకెట్" తో మొదలయిన రైలు ఇంజన్ క్రమ క్రమం గా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అమెరికా రైలు సంస్థ సుమారు 70 అడుగుల పొడవు, 450 టన్నుల బరువు కలిగిన సమర్థవంతమైన ఇంజన్ తయారుచేసింది. బ్రిటన్,జర్మనీ దేశాల్లో ఆవిఅరి టర్బయిన్ లను ఇంజన్ నమూనాలతో వాడటం జరిగింది. కానీ ఒక శతాబ్ద కాలం తరువాత ఆవిరి ఇంజన్ స్థానాన్ని ఎలక్ట్రిక్ మోటారు ఆక్రమించుకుంది. బెర్లిన్ నగర ప్రాంతంలో బర్నర్ వాసి సీమన్స్ అనే ఇంన్నీరు తొలిసారిగా విద్యుచ్చక్తి సహాయంతో ట్రాంలను నడపడంతో 1881 లో ఎలక్ట్రిక్ రైలు ఆవిర్భవించింది. అతడు రైలు పట్టాలనే విద్యుత్ వాహకాలుగా ఉపయోగించాడు. ఇది చాలా అపాయకరమైనదని తెలిసాక రైలు పట్టాలకు సమాంతరంగా కొంత ఎత్తులో వాహక తీగలను ఆమర్చే పద్ధతిని సీమన్స్ అనుసరించాడు.
 
ట్రాం ల మార్గంతో ప్రారంభమైన ఈ రవాణా సౌకర్యంతో బాటు పట్టణాల్లో ట్రాలీ బస్సు, భూగర్భ రైలు మార్గం, సుదూర ప్రాంతాలను కలిపే ఎలక్ట్రిక్ రైళ్ళు ఇవన్నీ క్రమంగా అభివృద్ధి చెందాయి. 1900 కి పీర్వం ట్రాంలను గుర్రాలు లాగుతుండేవి. క్రమంగా దీనికోసం విద్యుచ్చక్తి ని వాడసాగారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత మోటార్ రవాణా అమితంగా పెరిరి నప్పుడు ఇరుకుగా ఉండే నగర వీధుల్లో ఇటూ అటూ తిరిగే ట్రాం కార్లు ఇబ్బంది కరంగా తయారయ్యాయి. కొన్ని నోట్ల మాత్రం పట్టాలు లేకుండా వెళ్ళగలిగే ట్రాలీ బస్సులను ప్రవేశపెట్టారు ట్రాంలను పూర్తిగా తొలగించి వాటి స్థానే మోట్రార్ బస్సులను వాడే పద్ధతి అంతటా వాడుకలోకొచ్చింది.
 
== రకాలు ==
"https://te.wikipedia.org/wiki/రైలు" నుండి వెలికితీశారు