రైలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 105:
==రైలు మార్గాల విద్యుదీకరణ==
దూర ప్రాంతాఅలకు వెళ్ళే రైలు మార్గాల విద్యుదీకరణ జల విద్యుచ్చక్తి పుష్కలంగా లభ్యమయ్యే స్విడ్జర్లాండ్, దక్షిణ జర్మనీ, అమెరికా లాంటి దేశాల్లో మొదట ప్రారంభమైంది. విద్యుచ్చక్తి తో రైళ్ళను నడపాలని చాలా కాలంగా ఇంజనీర్లు కలలు కంటూ వచ్చారు. 19 వశతాబ్దం మధ్య భాగంలో బ్యాటరీ ల సహాయంతో రైళ్ళను నడిపే ప్రయత్నాలు అనుకున్నట్లుగానే విఫలమయ్యాయి. అధిక భారాన్ని లాగటానికి మితంగా విద్యుచ్చక్తి కావల్సి వచ్చేది. పైగా బ్యాటరీలు ఈ పరిమాణంలో విద్యుచ్చక్తిని నిలపచేయలేవు. విద్యుదీకరణ వల్ల ఒకగూడే లాభాలు దానికయ్యే ఖర్చు కంటే ఎన్నో రెట్లు ఎక్కువే అని నిపుణులందరూ అంగీకరించారు.
 
అవిరి రైళ్ళ కంటే ఎలక్ట్రిక్ రైళ్ళ విషయంలో అనేక సౌలభ్యాలున్నాయి. ఆవిరిని ఇంజన్ బాయిలర్లలో ఎక్కడికక్కడే తయారుచేసుకోవాలి. కానీ ఎలక్ట్రిక్ రైళ్ళకు కావలసిన విద్యుచ్చక్తిని కొన్ని పెద్ద పవర్ స్టేషన్లలో ఉత్ప్త్తి చేసి నిర్వహణ ఖర్చులను తగ్గించవచ్చు ఆవిరి రైళ్ళలో ఉపయోగించటానికి వీలులేని నాసిరకం బొగ్గు, జలశక్తి,సహజ వాయువు, పరమాణు శక్తి లాంటి ఇంధనాలనూ, శక్తి జనకాలనూ విధ్య్చ్చక్తి ఉత్పాదనలో వాడుకోవచ్చు. ఎలక్ట్రిక్ రైళ్ళు తమ ఇంధనాన్ని గానీ, నీటిని గానీ ఆవిరి రైలు లాగా మోసుకొని పోవలసిన పనిలేదు.పని చేసేటప్పుడు మాత్రమే ఇవి శక్తిని ఉపయోగించుకుంటాయి. కానీ ఆవిరి రైలు బయలు దేరటానికి చాలా ముందుగానే ఆవిరిని సిద్ధం చేసి ఉండాలి. రైలు ;స్టేషన్ల వద్ద ఆగిఅప్పుడూ, ప్రయాణం ముగించిన కాసేపటికి వరకూ కూడా ఇంధనం సష్టమవుతుంది. ఎలక్ట్రిక్ రైలులో నియంత్రణ సాధనాలను, రక్షణ సదుపాయాలను వీటిలో జోడించటానికి వీలుంది. ఇంధనాన్ని పలుమార్లు ఇంజన్ లోకి జొప్పించే అవసరం లేకపోవటంతో గమ్య స్థానాన్ని వేగిరంగ చేరుకోవచ్చు.
 
== రకాలు ==
"https://te.wikipedia.org/wiki/రైలు" నుండి వెలికితీశారు