రైలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 110:
ఎలక్ట్రిక్ రైళ్ళలో పొగ, మసి లెకపోవటం ప్రయాణీకులకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇంజన్ పొగ లోని ఆమ్ల సంబంధమైన అంశాల వల్ల ఇళ్ళు, కట్టడాలు దెబ్బతినే ప్రశక్తి లేదు. పొగగొట్టం నుంచి వచ్చే మిణుగులుల వల్ల అపాయం లేదు. పొరంగాల్లో వెళ్ళేటప్పుడు వాతావరణం కలుషితం కాదు. మట్ట ప్రాంతాల్లో ప్రయాణం ఆవిరి రైలు కంటే వేగంగా ఉంటుంది. ఈ అన్ని కారణాల మూలంగానే రైలు మార్గాల విద్యుదీకరణ అన్ని దేశాల్లోనూ విస్తృతంగా జరుగుతోంది.
==విద్యుదీకరణ - రకాలు==
విద్యుదీకరణ రెండు రకాలుగా జరుగుతుంది. ఒక రకంలో 50 నుంచి 3000 వోల్టుల వరకు ఏకముఖ విద్యుత్ ప్రవాహాన్ని వాడుతారు. మరోరకం లో 25,000 వోల్టుల ఏకాంతర విద్యుత్తు ని ఉపయోగిస్తారు. డి.సి. ని వాహక తీగల్లో ఎక్కువ దూరం తీసుకెళ్ళితే ప్రసార నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పవర్ స్టేషన్ లు ఎ..సి నే సరఫరా చేస్తాయి. కానీ ఎలక్ట్రిక్ రైళ్ళు పనిచేయటానికి కావలసింది డి.సి యే, ఎ.సి.ని డి.సి. గా మార్చటానికి మొదట్లో మెర్క్యురీ ఆర్క్ రెక్టిఫైయర్, కాంటాక్ట్ రెక్టిఫైయర్ లను వాడేవారు. ఇటీవల జెర్మేనియం రెక్టిఫైయర్. యూస్టన్-లివర్ పూల్ మార్గంలో మాత్రం 25,000 వోల్ట్ ఎ.సి ని వాడుతున్నారు. దీన్ని 1960 లో ప్రారంభించారు. 3,300 హె.సి ఇంజన్ తొ ఇది గంటకు 90 మైళ్ళ వేగాన్ని సాధించగలిగింది. ఆవిరి ఇంజన్ వెళ్ళె గరిష్ట వేగం గంటకు 130 మైళ్ళయితే, ఫ్రాన్స్ లో ఎలక్ట్రిక్ రైలు 1955 లోనే 205 మైళ్ళ వేగాన్ని సాధించింది.
 
== రకాలు ==
"https://te.wikipedia.org/wiki/రైలు" నుండి వెలికితీశారు