వంతెన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
ఆధునిక వంతెన నిర్మాణంలో వివిధ బలాల కలయికకు సంబందించిన పరిజ్ఞానం అవసరం. దీన్ని గురించి వివరంగా చర్చించే భౌతిక శాస్త్ర విభాగాన్ని స్థితి శాస్త్రం అందురు. 15,16 శతాబ్దాల్లో లియొనార్డో డానిన్సీ చేసిన కృషి ఆధునిక వంతెనల నిర్మాణానికి ఆధారభూతంగా ఉంటోంది. 18 వ శతాబ్దం చివరి భాగంలో వంతెన నిర్మాణానికి ఇనుమును పెద్ద ఎత్తున ఉపయోగించటం ప్రారంభించటమైనది. పోత ఇనుముతొ నిర్మించబదిన మొదటి వంతెన ఇంగ్లండ్ లో 1770 ప్రాంతంలో తయారయింది. కొన్ని దశాబ్దాల తరువాత జర్మనీ, ఫ్రాన్స్ దేసాలు ఇంగ్లండ్ ని అనుకరించాయి. తరువాతి దశలో ఇనుప మోకులతో గానీ(cables), గొలుసులతో గానీ వేలాడే వంతెనలను అమెరికాలో నిర్మించటం జరిగింది. మెన చూసెట్స్ లో 240 అడుగుల పొడవుతో ఇలాంటి వంతెనను 1809 లో నిర్మించారు. దీన్ని ఇప్పటికీ చూడవచ్చు. సాంకేతిక; పరిజ్ఞానం పెరిగే కొద్దీ, ఎక్కువ పొడవు గల వంతెనల నిర్మాణం చురుకుగా సాగింది. క్రమేణా స్విట్జర్లాండ్ లో దాదాపు 900 అడుగుల పొడవుతో వేలాడే వంతెనను నిర్మించటం సాధ్యమైంది.
 
వేలాడే వంతెనలపై పనిచేసే బలాలను లెక్కించటం, నిర్మాణ పదార్థాలు దృఢత్వాన్ని పరీక్షించటం ఇతర నమూనాల కంటే ఖచ్చితంగా చేయవచ్చు. కాబట్టి 19,20 శతాబ్దాల్లో ఈ రకం వంఎనలు విస్తృతంగా నిర్మించబడ్డాయి. ఉదాహరణకు, ఏదైనా వేదికను వేలాడదీయటానికి సాగదీసిన తీగలు సమర్థవంతంగా పనిచేస్తాయని ప్రయోగాల్లో తెలిసింది. ఈ కారణంగానే అనేక వేల పోగులు(Strands) గల ఉక్కు మోకులను వేలాడే వంతెనలు నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. ఫిలడెల్ఫియా-కాండెన్ రహదారిలో 1926 లో నిర్మించిన వంతెన 1750 అడుగుల పొడవుతో ఉంది. 18,666 తీగ పోగులను కలిగి 30 అంగుళాల వ్యాసం గల రెండు మోకులతో ఈ వంతెనను వ్రేలాడదీశారు. న్యూయార్క్ వద్ద ఈస్ట్ నదిపై ఇలాంటి వంతెనలు మరో మూడు ఉన్నాయి. వీటిలో శాన్‌ఫ్రాన్సిస్కో వద్ద నిర్మించిన వంతెన మూడు భాగాలుగా ఉంది. మధ్య భాగం పొడవు 4,200 అడుగులు, ఇరుపక్కలా ఒక్కొక్క భాగం 1,100 అడుగులు కలిగి ఉన్నాయి.
 
== వంతెనలలో రకాలు ==
"https://te.wikipedia.org/wiki/వంతెన" నుండి వెలికితీశారు